హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 14 Launch: ఐఫోన్ 14 సిరీస్ లాంచింగ్ ఈవెంట్‌లో ఏడు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసే అవకాశం.. అవేంటంటే..

iPhone 14 Launch: ఐఫోన్ 14 సిరీస్ లాంచింగ్ ఈవెంట్‌లో ఏడు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసే అవకాశం.. అవేంటంటే..

iPhone 14 Launch

iPhone 14 Launch

iPhone 14 Launch: యాపిల్ (Apple) కంపెనీ సరికొత్త ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 series)ను వచ్చే నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ లాంచ్ ఈవెంట్ సందర్భంగా యాపిల్ ఏడు కొత్త ప్రొడక్ట్స్ విడుదల చేయనుందని ఒక తాజా రిపోర్ట్ తెలిపింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

యాపిల్ (Apple) కంపెనీ సరికొత్త ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 series)ను వచ్చే నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్లు ఎలాంటి అద్భుతమైన ఫీచర్లు (Features), టెక్నాలజీలతో లాంచ్ అవుతాయో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కంపెనీ సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేయవచ్చని కొన్ని లేటెస్ట్ రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి. అయితే ఈ లాంచ్ ఈవెంట్ సందర్భంగా యాపిల్ ఏడు కొత్త ప్రొడక్ట్స్ విడుదల చేయనుందని ఒక తాజా రిపోర్ట్ తెలిపింది.


ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం, యాపిల్ 'మినీ' ఐఫోన్ 14 మోడల్‌ను లాంచ్ చేయవచ్చు. ఇవాన్ రిపోర్ట్ తప్ప ఇప్పటివరకు అందరూ మినీ మోడల్‌లో ఐఫోన్ 14 రాదని తెలిపారు. మరి ఐఫోన్ 14 మినీ మోడల్ లాంచ్ అవుతుందో లేదో చూడాలి. ఇవాన్ రీసెంట్ లీక్ ప్రకారం, యాపిల్ ఐఫోన్ 14 ( iPhone 14), ఐఫోన్ 14 మినీ (iPhone 14 Mini), ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max)లను లాంచ్ చేస్తుంది. అంటే iPhone 13 సిరీస్‌లో ఏయే మోడల్స్ వచ్చాయో 14 సిరీస్‌లో కూడా అవే మోడల్స్‌ రానున్నాయని తెలుస్తోంది.వీటితో పాటు 10వ జెన్ ఐప్యాడ్ 10.2, 11-అంగుళాలు, 12.9-అంగుళాల రెండు ఐప్యాడ్ ప్రో మోడళ్లను M2 చిప్‌తో కంపెనీ లాంచ్ చేస్తుందని రిపోర్టు తెలిపింది. అంటే ఐఫోన్ మోడల్స్‌తో కలిపి మొత్తం ఏడు ప్రొడక్ట్స్ యాపిల్ 2022 లాంచ్ ఈవెంట్‌లో విడుదల కానున్నాయి.


టిప్‌స్టర్ ఇవాన్ చెప్పిన ఏడు ప్రొడక్ట్స్ రెండు వారాల సమయంలో వస్తాయని టాక్. కాగా కొత్త ఐప్యాడ్ ప్రో మోడళ్లు ఒక నెల తర్వాత లాంచ్ అవుతాయని సమాచారం. ఇవాన్ షేర్ చేసిన లిస్ట్‌లో iPhone 14 Max లేకపోవడం గమనార్హం. అతను కొత్త Apple Watch మోడళ్లు గురించి కూడా ప్రస్తావించలేదు. ఇవి ఎప్పుడూ కొత్త ఐఫోన్లతో పాటు లాంచ్ అవుతుంటాయి. యాపిల్ ఈ ఏడాది Apple వాచ్ సిరీస్ 8, వాచ్ SE, యాపిల్ వాచ్ ప్రో అనే మూడు కొత్త వాచ్ మోడళ్లను విడుదల చేస్తుందని ఇతర లీక్‌స్టర్స్ తెలిపారు.


ఇది కూడా చదవండి : జియో ఇండిపెండెన్స్ డే బంపరాఫర్.. ఫ్రీగా రూ.3 వేల బెనిఫిట్స్.. ఆఫర్ మరికొన్ని రోజులే


సెప్టెంబరు 7న ఊహించిన దానికంటే ముందుగా Apple iPhone 14 సిరీస్‌ను విడుదల చేయవచ్చని యాపిల్ ట్రాక్ వంటి ప్రముఖ వెబ్‌సైట్ల రిపోర్ట్స్‌ కూడా వెల్లడించాయి. దానికి ముందు, ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ అయిన ఒక నెల తర్వాత అక్టోబర్‌లో జరిగే మరో ఈవెంట్‌లో యాపిల్ కొత్త iPad Pro మోడల్స్‌ను విడుదల చేయవచ్చని ఒక నివేదిక పేర్కొంది. ఐఫోన్ 14 సెప్టెంబరు 7న లాంచ్ అయితే.. సెప్టెంబరు 16 నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని మరో రిపోర్ట్ వెల్లడించింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Apple iphone, Iphone 14, Tech news

ఉత్తమ కథలు