• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • APPLE MAY LAUNCH NEW PRODUCTS ON MAY 18 AIRPODS 3 AND APPLE MUSIC HI FI TIER INCOMING MK GH

Apple New Products: యాపిల్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... కొత్తగా లాంచ్ అవుతున్న ప్రొడక్ట్‌లు

Apple New Products: యాపిల్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... కొత్తగా లాంచ్ అవుతున్న ప్రొడక్ట్‌లు

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్ సంస్థ రెండు ప్రత్యేకమైన ప్రాడక్ట్‌లను లాంచ్‌ చేసింది. వాటి గురించి పూర్తి వివరాలు...

  • Share this:
యాపిల్ సంస్థ రెండు ప్రత్యేకమైన ప్రాడక్ట్‌లను లాంచ్‌ చేసింది. యాపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌ కొత్త వెర్షన్‌ ఒకటి ఈ రోజు విడుదలవుతుందని సమాచారం. యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ 3 పేరుతో దీనిని తీసుకొస్తున్నారు. దీంతోపాటు యాపిల్‌ మ్యూజిక్‌ హైఫై మ్యూజిక్‌ పేరుతో ఓ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాన్‌ను కూడా తీసుకొస్తారట. యాపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌కు కొనసాగింపుగా కొత్త ఫీచర్లతో ఎయిర్‌పాడ్స్‌ 3 రాబోతోంది. ఇక యాపిల్‌ హైఫై గురించి చూస్తే... ఇది మ్యూజిక్‌ స్ట్రీమంగ్‌ సర్వీసెస్‌లో బెటర్‌ ప్లాన్‌ అంట. ఈ కొత్త ప్లాన్‌లో డాల్బీ అట్మాస్‌, డాల్బీ ఆడియో లాంటివి ఉంటాయట. స్పాటిఫైకి పోటీగా యాపిల్‌ ఈ మార్పులు చేస్తోందని తెలుస్తోంది.

ఇటీవల కాలంలో యాపిల్‌ పెద్దగా ప్రచారం చేయకుండానే విడుదల చేస్తోంది. గతేడాది డిసెంబరులో యాపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌ మ్యాక్స్‌ ఇలానే విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు ప్రోడెక్ట్‌లు కూడా అలానే వస్తాయట. అయితే గతంలో ఇలానే ఎయిర్‌ పాడ్స్‌ కొత్తవి వస్తాయని వార్తలొచ్చినా అవ్వలేదు. అయితే ఈసారి వచ్చిన తేదీ మంగళవారం కావడం గమనార్హం. ఎందుకంటే యాపిల్‌ ఎక్కువగా ఇలాంటి ఈవెంట్లు మంగళవారమే చేస్తుందట.

ఎయిర్‌పాడ్స్‌ 3 గురించి చూస్తే... ఇందులో పెద్ద మార్పులు ఉంటాయని చెప్పలేమని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఎయిర్‌ పాడ్స్‌ ప్రో డిజైన్‌లోనే వీటిని తీసుకొస్తున్నారట. అయితే ఇందులో యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఉండటం లేదని తెలుస్తోంది. మంచి ఆడియో నాణ్యత కోసం సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజ్‌ ఫీచర్‌ను ఇందులో వాడుతున్నారట. అలాగే వాయిస్‌ అసిస్టెంట్‌ సిరి ఇంటిగ్రేషన్‌లో కొన్ని ఉపయుక్తమైన మార్పులు చేస్తున్నారట.

ఇక మ్యూజిక్‌ హైఫై గురించి చూస్తే... దీని ధర సుమారు 10 డాలర్లు ఉండబోతోందట. హైఫై అంటే ఇక్కడ హై ఫిడెలిటీ ఆడియో అంట. ఇందులో నాయిస్‌ తక్కువగా ఉంటూ, మంచి శబ్ద నాణ్యత ఇస్తున్నారట. అలాగే స్టీరియో క్వాలిటీ విషయంలోనూ మార్పులు చేస్తున్నారట. ముందుగా చెప్పినట్లు స్పాటిఫై ఇటీవల ఓ హైఫై టయర్‌ను అనౌన్స్‌ చేసింది. దానికి పోటీగానే యాపిల్‌ ఈ కొత్త మ్యూజిక్‌ హైఫై ను లాంచ్‌ చేస్తోందన్నమాట. అయితే వీటి విషయంలో యాపిల్‌ నుండి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
Published by:Krishna Adithya
First published: