హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart: ఆ ఆఫర్ తో ఫూల్ చేసిన ఫ్లిప్‌కార్ట్.. ఈ తిరకాసు ఏంటో మీరు కూడా తెలుసుకోండి

Flipkart: ఆ ఆఫర్ తో ఫూల్ చేసిన ఫ్లిప్‌కార్ట్.. ఈ తిరకాసు ఏంటో మీరు కూడా తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫెస్టివల్ సేల్‌కు ముందు రూ.1,12,900 ధర ఉన్న మ్యాక్‌బుక్ ఎయిర్ M1 (MacBook Air M1) 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను కేవలం రూ.69,490 లేదా అంతకన్నా తక్కువ ధరతో తీసుకొస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే అందులో ఒక పెద్ద తిరకాసు ఉందని తేలింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్స్‌లో ఫెస్టివల్స్ సేల్స్ కొనసాగుతున్నాయి. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale) సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో యాపిల్ ప్రొడక్ట్స్ (Apple Products) తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సేల్‌కు ముందు రూ.1,12,900 ధర ఉన్న మ్యాక్‌బుక్ ఎయిర్ M1 (MacBook Air M1) 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను కేవలం రూ.69,490 లేదా అంతకన్నా తక్కువ ధరతో తీసుకొస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే అందులో ఒక పెద్ద తిరకాసు ఉందని తేలింది. దీంతో డైరెక్ట్‌గా రూ.70 వేలలోపే ల్యాప్‌టాప్‌ దొరుకుతుందని నమ్మిన వారంతా పిచ్చోళ్లైనంత పనయ్యింది.

MacBook Air M1 ల్యాప్‌టాప్ 2020లో లాంచ్ అయ్యింది. దీని 8GB RAM + 256GB SSD స్టోరేజ్ వేరియంట్‌ను రూ.99,900 స్టిక్కర్ ధరతో కంపెనీ రిలీజ్ చేసింది. కాగా ప్రస్తుతం ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.92,890కి లభిస్తోంది. ఇక MacBook Air 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.99,890 ధరతో ఫ్లిప్‌కార్ట్ అమ్ముతోంది. ఈ మోడల్ రూ.1,12,900 స్టిక్కర్ ధరతో రాగా 11 శాతం డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ప్రీమియం ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.70 వేల కంటే తక్కువ ధరతో వస్తుందని ముకుల్ శర్మ అనే టిప్‌స్టర్ వెల్లడించారు. అలాగే ఫ్లిప్‌కార్ట్ వెట్‌సైట్‌కి సంబంధించి ఒక స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేశారు. ఈ స్క్రీన్‌షాట్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M1 16GB వేరియంట్‌ రూ.70 వేల కంటే తక్కువ ధరతో వస్తున్నట్లు కనిపించింది.

Flipkart Big Billion Days Sale: రూ.7 వేలకే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్ లో కనీవినీ ఎరగని ఆఫర్లు.. ఓ లుక్కేయండి

సాధారణంగా ముకుల్ శర్మ లీక్ చేసే వివరాలు దాదాపు నిజమవుతాయి. దాంతో చాలా డిజిటల్ మీడియా సంస్థలు ఫ్లిప్‌కార్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 16GB వేరియంట్‌ను రూ.70 వేలలోపే తీసుకొస్తుందని వార్తలు రాశాయి. దీంతో దాన్ని దక్కించుకోవాలని ఎందరో ఎదురు చూశారు. తీరా ఇప్పుడు అలాంటి డైరెక్ట్ సేల్ డిస్కౌంట్ ఏమీ లేదని తెలుసుకొని తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నిజానికి ముకుల్ శర్మ షేర్ చేసిన సమాచారం నిజమే. కాకపోతే డిస్కౌంట్ ప్రైస్ దక్కించుకోవాలంటే ఏదైనా ఓల్డ్ MacBook Air ల్యాప్‌టాప్ ఎక్స్ఛేంజ్‌ (Exchange) చేయాలనే తిరకాసు పెట్టింది ఫ్లిప్‌కార్ట్. దీంతో ఎలాంటి ఎక్స్ఛేంజ్‌ లేకుండా ఈ యాపిల్ ల్యాప్‌టాప్ రూ.70 వేలలోపే వస్తుందని అనుకున్న వారందరూ ఇప్పుడు డిసప్పాయింట్ అవుతున్నారు.

ఇక ఇప్పుడున్న ఆఫర్స్‌ చూసుకుంటే.. MacBook Airపై రూ.100 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1,750 తగ్గింపు పొంది 8GB మోడల్‌ను రూ.91,080కి కొనుగోలు చేయవచ్చు. 16GB మోడల్‌ను రూ.98,040కి సొంతం చేసుకోవచ్చు. M1 చిప్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లను పాత ల్యాప్‌టాప్‌లతో ఎక్స్ఛేంజ్‌ చేసి రూ.23,100 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు 8GB RAM వేరియంట్‌ ల్యాప్‌టాప్ ధర కనీసం రూ.67,980కి 16GB వేరియంట్‌ ధర రూ.74,940కి తగ్గుతుంది. వాస్తవానికి ఈ-కామర్స్ సంస్థలు ప్రకటించే తగ్గింపులన్నీ ఊరికే రావు. ఇవి కొనుగోలుదారులు ఏదైనా అందిస్తేనే వాటికి వాల్యూ కట్టి తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తాయి. కానీ ప్రకటనల్లో మాత్రం జస్ట్ ప్రైస్ మాత్రమే మెన్షన్ చేస్తూ అందర్నీ తన వెబ్‌సైట్స్‌కి రప్పించుకొని.. సేల్స్ రెట్టింపు చేసుకుంటాయి.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Flipkart, Flipkart Big Billion Days, Latest offers

ఉత్తమ కథలు