యాపిల్ కంపెనీ(Apple Company) తాజాగా WWDC 2022 ఈవెంట్‌ను(Event) నిర్వహించింది. కొత్తగా తీసుకొస్తున్న వివిధ ప్రాడక్ట్స్(Products), సాఫ్ట్వేర్ అప్డేట్స్(Software Updates) పరిచయం చేసింది. ఈ ఈవెంట్లో iOS 16, WatchOS 9, MacOS వెంచురా, iPadOS 15 సాఫ్ట్వేర్లను ప్రవేశపెట్టింది. హార్డ్‌వేర్ పరంగా న్యూ మ్యాక్‌బుక్ ఎయిర్, 13-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో(MacBook pro), న్యూ M2 చిప్‌సెట్‌ను(Chipset) పరిచయం చేసింది. ఈ ఈవెంట్ హైలైట్స్(Highlights), ఈ సందర్భంగా apple కంపెనీ కొత్తగా అనౌన్స్ చేసిన ప్రొడక్ట్స్(Products) గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
* iOS 16
యాపిల్ కంపెనీ కొత్త iOS 16ను లాంచ్ చేసింది. ఇందులో మొదటిసారి లాక్‌స్క్రీన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు లాక్ స్క్రీన్, ఫాంట్ శైలిని మార్చుకోవచ్చు. విడ్జెట్లను యాడ్ చేయడం, తీసివేయడం చేయవచ్చు. లాక్ స్క్రీన్‌పై ఫోటోలను షఫుల్ చేయగలరు, సెల్ఫ్ చేంజెస్ చేసే అవకాశం ఉంది. యాపిల్ మెసేజ్‌లలో కూడా మార్పులు చేస్తోంది. పంపిన మెసేజ్‌లను వినియోగదారులు మార్చే సదుపాయం ఉంది. అన్‌రీడ్ మెసేజ్‌లను కూడా గుర్తించగలరు.
SharePlay ద్వారా ఇద్దరు వినియోగదారుల యాప్‌లను సింక్రనైజ్ చేయవచ్చు. FaceTimeలో ఉన్నప్పుడు SharePlayని ఉపయోగించగలరు. iOS 16 ఇప్పుడు వాయిస్, టచ్ మధ్య మారడానికి కొత్త డిక్టేషన్ పద్ధతులకు సపోర్ట్ చేస్తుంది. డిక్టేషన్ కూడా ఆటోమేటిక్‌గా పంక్చుయేషన్ మార్క్‌లను యాడ్ చేస్తుంది. iOS 16 వీడియోల కోసం లైవ్ టెక్ట్స్‌ను కూడా పరిచయం చేసింది. లైవ్‌లో కూడా ట్రాన్స్‌లేట్ చేస్తుంది. Google లెన్స్ లాంటి ఫీచర్ కూడా ఉంది. Apple Maps 3D వివరాలతో కొత్త ఫీచర్లను పొందుతోంది. Appleలో 16 స్టాప్‌లను సెట్ చేయగలరు. స్టాప్‌లను యాడ్ చేయడానికి సిరిని కూడా ఉపయోగించవచ్చు. Apple iCloud షేర్డ్ ఫోటో లైబ్రరీ షేర్డ్ లైబ్రరీలను ఉపయోగించి ఇతర వ్యక్తులతో iCloud ఆల్బమ్‌ను షేర్ చేసుకునేందుకు సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా షేర్ చేయడానికి ఫేస్ రికగ్నిషన్‌ని ఉపయోగించే ఆటోమేటిక్ షేరింగ్‌ని కూడా ఎంచుకోవచ్చు.
WWDC 2022 ఈవెంట్లో Apple Home యాప్ లాంచ్ చేశారు. స్మార్ట్ హోమ్ ప్రాడక్ట్లతో కనెక్ట్ అవ్వడానికి Apple కొత్త హబ్‌ను లాంచ్ చేసింది. ఇది స్మార్ట్ హోమ్ యాక్సెసరీలకు కనెక్ట్ అయ్యేలా వినియోగదారులను అవకాశం కల్పిస్తుంది. కొత్తగా లాంచ్ చేసిన Apple CarPlay ఇంటర్ఫేస్ విడ్జెట్లకు సరిపోయేలా కారు స్క్రీన్కు అనుగుణంగా ఉంటుంది.
Apple WatchOS 9
Apple WatchOS 9 వివిధ క్యాలెండర్లు, ఛైల్డ్ ఫ్రెండ్లీ వాచ్ ఫేసెస్ పరిచయం చేసింది. WatchOS 9 స్క్రీన్ పైభాగంలో యాక్టివ్ యాప్‌లు ఉంటాయి. WatchOS 9 పాడ్‌క్యాస్ట్‌లను ఉపయోగించేందుకు అనుమతిస్తుంది. WatchOS 9 రన్నింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీల కోసం కొత్త మెట్రిక్‌లను తీసుకువస్తుంది. ఆపిల్ ఫిట్నెస్ యాప్ ఎక్కువ మంది ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ఐఫోన్లో కొన్ని కొత్త ఫీచర్లను కూడా అందిస్తోంది. ఈ ఫీచర్లను యాక్సెస్ చేయడానికి యూజర్లు Apple వాచ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు.
M2 చిప్
యాపిల్ కొత్త M2 చిప్‌సెట్‌ను లాంచ్ చేసింది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, మెరుగైన పనితీరును అందించే లక్ష్యంతో తయారు చేసింది. M2లో ఇప్పుడు 10 కోర్స్ GPU ఉంది. సేమ్ పవర్ లెవల్లో 25 శాతం మెరుగైన పనితీరును అందిస్తుంది. M2 కొత్త న్యూరల్ ఇంజిన్, 8Kకి సపోర్ట్ చేసే కొత్త మీడియా ఇంజిన్‌తో వస్తుంది. 20 బిలియన్ ట్రాన్సిస్టర్లు, 100GB/s యూనిఫైడ్ మెమరీ పనితీరుతో వస్తుంది. M1 కంటే 50% ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
13.6-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్
న్యూ మ్యాక్‌బుక్ ఎయిర్ WWDC 2022లో లాంచ్ అయింది. మ్యాక్‌బుక్ ఎయిర్ M2 చిప్‌తో వస్తుంది. కేవలం 1/2 అంగుళాల సన్నగా ఉంటుంది. నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది. MacBook Airకి MagSafe సపోర్ట్, రెండు థండర్‌బోల్ట్ పోర్ట్‌లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ లభిస్తాయి. ఫోటోషాప్‌లో ఇమేజ్ ఫిల్టర్లను యాడ్ చేయడంలో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ M1 మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే 20% వేగంగా ఉంటుంది.
* 13-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో
కొత్త 13-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో కూడా కొత్త M2 చిప్సెట్తో వస్తుంది. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే 40 శాతం మెరుగైన పనితీరును అందిస్తుంది. 30 శాతం వరకు మెరుగైన గేమింగ్ పనితీరుకు సపోర్ట్ చేస్తుంది.
macOS వెంచురా
MacOS వెంచురా వివిధ డిజైన్ అంశాలతో సిద్ధమైంది. MacOS వెంచురా కొత్త స్టేజ్ మేనేజర్‌తో వినియోగదారుకు మెరుగైన ఫోకస్‌ని అందిస్తుంది. స్పాట్లైట్ ఫీచర్ వివిధ ఫైల్‌లను వేగంగా సెర్చ్ చేసేలా చేస్తుంది. స్పాట్లైట్ బార్ని ఉపయోగించి యాప్‌లను వెతకవచ్చు. స్పాట్లైట్ iOS, iPadOSలకు కూడా వస్తోంది.
మెయిల్ యాప్ కొత్త అన్డు సెండ్ ఫీచర్‌తో వస్తుంది. ఫాలో అప్' రిమైండర్ ఆప్షన్ కూడా అందిస్తోంది. సఫారి మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని, ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. Safariలో షేర్డ్ ట్యాబ్ గ్రూప్‌లు కూడా ఉంటాయి. స్నేహితులతో ట్యాబ్‌ల సమూహాన్ని పంచుకోవచ్చు, కలిసి వెబ్ సెర్చ్ చేయవచ్చు.
iPadOS 16
iPadOS 16 స్టేజ్ మేనేజర్, ఎక్స్టెర్నల్ డిస్ప్లే సపోర్ట్‌తో మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మెసేజ్‌లతో కొలాబొరేట్ అవ్వడం మెయిల్, సఫారీకి అప్డేట్లుగా ఇచ్చింది. iCloud షేర్డ్ ఫోటో లైబ్రరీ, రిఫరెన్స్ మోడ్, డిస్ప్లే జూమ్‌తో సహా ప్రో ఫీచర్లతో వస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.