హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Apple Watch Ultra: వారెవ్వా అదిరే ఫీచర్లతో యాపిల్ వాచ్ అల్ట్రా లాంచ్.. ప్రత్యేకతలు తెలిస్తే సూపర్ అంటారు..

Apple Watch Ultra: వారెవ్వా అదిరే ఫీచర్లతో యాపిల్ వాచ్ అల్ట్రా లాంచ్.. ప్రత్యేకతలు తెలిస్తే సూపర్ అంటారు..

Apple Watch Ultra (Photo : Apple)

Apple Watch Ultra (Photo : Apple)

Apple Watch Ultra: యాపిల్‌ వాచ్ అల్ట్రా టెక్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది హై-ఎండ్ ఫీచర్లతో వచ్చిన దృఢమైన వాచ్‌గా నిలుస్తోంది. యాపిల్ వాచ్ సిరీస్ 8తో పోలిస్తే యాపిల్ వాచ్ అల్ట్రాలో ఎక్కువ బ్యాటరీ లైఫ్, పెద్ద స్క్రీన్, రగ్గెడ్‌ డిజైన్‌తో పాటు ఎడిషనల్ ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

యాపిల్ టెక్‌ ఈవెంట్‌ 'ఫార్ అవుట్' (Apple Far Out) ఎట్టకేలకు సెప్టెంబర్ 7, బుధవారం జరిగింది. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14)తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్‌ను కంపెనీ లాంచ్ చేసింది. వీటిలో యాపిల్‌ వాచ్ అల్ట్రా (Apple Watch Ultra) టెక్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది హై-ఎండ్ ఫీచర్లతో వచ్చిన దృఢమైన వాచ్‌గా నిలుస్తోంది. యాపిల్ వాచ్ సిరీస్ 8తో పోలిస్తే యాపిల్ వాచ్ అల్ట్రాలో ఎక్కువ బ్యాటరీ లైఫ్, పెద్ద స్క్రీన్, రగ్గెడ్‌ డిజైన్‌తో పాటు ఎడిషనల్ ఫీచర్లు ఉన్నాయి. దీని ఫీచర్లు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.

* యాపిల్‌ వాచ్ అల్ట్రా స్పెసిఫికేషన్లు

యాపిల్ వాచ్ అల్ట్రాను ఏరోస్పేస్-గ్రేడ్ టైటానియంతో తయారు చేశారు. 200 నిట్స్ పీక్‌ బ్రైట్నెస్‌ ఇచ్చే రెటీనా డిస్‌ప్లే దీని సొంతం. ఇది ఫ్లాట్ సెఫైర్‌ ఫ్రంట్ క్రిస్టల్‌ కేస్‌తో వస్తుంది. యాపిల్‌ అల్ట్రా వాచ్‌ అనేక అడ్వాన్స్‌డ్ టెంపరేచర్ మానిటరింగ్ పీచర్లతో వస్తుంది. -4° F (-20° C) వద్ద గడ్డకట్టే మంచు పర్వతాలు, 131° F (55° C) వద్ద మండే ఎడారి వేడిని కూడా ఇది తట్టుకోగలదు.

* బెస్ట్ సౌండ్ క్వాలిటీ

ఏ పరిస్థితుల్లోనైనా వాయిస్ కాల్స్‌లో సౌండ్ క్వాలిటీని మెరుగుపరచడానికి యాపిల్‌ వాచ్‌ అల్ట్రాలో మూడు ఇంటర్నల్‌ మైక్రోఫోన్లు ఉన్నాయి. ఇది అడాప్టివ్ బీమ్‌ఫార్మింగ్ అల్గారిథమ్‌ని కూడా ఉపయోగిస్తుంది. యాంబియంట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ సౌండ్స్‌ను తగ్గించేటప్పుడు వాయిస్‌ను క్యాప్చర్ చేయడానికి మైక్రోఫోన్లను ఉపయోగిస్తుంది, దీని ద్వారా అద్భుతమైన సౌండ్ క్లారిటీ వస్తుంది.

* స్పెషల్ ‘యాక్షన్‌’ బటన్

యాపిల్‌ వాచ్ అల్ట్రా రోజువారీ వినియోగానికి 36 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. యాపిల్‌ వాచ్‌ అల్ట్రాలో కొత్త యాక్షన్ బటన్ ఉంది. ఇది వర్కౌట్‌లు, కంపాస్ వే పాయింట్‌లు, బ్యాక్‌ట్రాక్ వంటి మరిన్ని ఫీచర్‌లకు ఇన్‌స్టంట్‌ యాక్సెస్‌ అందిస్తుంది. యాపిల్‌ వాచ్ అల్ట్రా డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPSను కూడా ఉపయోగిస్తుంది. L1, L5 ఫ్రీక్వెన్సీలతో యాపిల్‌ కొత్త పొజిషనింగ్ అల్గారిథమ్‌ల ద్వారా అత్యంత కచ్చితమైన GPS లొకేషన్‌లను అందిస్తుంది.

ఇది కూడా చదవండి : ఐఫోన్ 14 సిరీస్‌లో 4 స్మార్ట్‌ఫోన్స్... భారతదేశంలో ధర ఎంతో తెలుసా?

* ధర ఎంత?

యాపిల్ వాచ్ అల్ట్రాను ఇప్పుడు ప్రీ ఆర్డర్లలో బుక్‌ చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, జపాన్, యూఏఈ, యూకే, యూఎస్‌ వంటి 40 కంటే ఎక్కువ దేశాల కస్టమర్లు దీన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఇండియాలో ఈ వాచ్‌ అన్ని వేరియంట్‌లను రూ. 89,900తో సొంతం చేసుకోవచ్చు. యాపిల్‌ వాచ్ అల్ట్రా సెప్టెంబర్ 23 నుంచి అమ్మకానికి వస్తుంది. వాచ్‌ ట్రయిల్ లూప్, ఆల్పైన్ లూప్, ఓషన్ బ్యాండ్ వంటి మూడు బ్యాండ్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Apple iphone, Iphone 14, Smart watch, Tech news

ఉత్తమ కథలు