iPhone 12 Repair Program: ఐఫోన్ 12 యూజర్లకు గుడ్​న్యూస్.. ఆ సమస్యలు తలెత్తితే ఫ్రీ సర్వీస్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ఐఫోన్​ 12, ఐఫోన్​ 12ప్రో(iPhone 12, iPhone 12 Pro) ఫోన్లలో సౌండ్​ సమస్యలు వస్తున్నట్లు ఇటీవల పలువురు యూజర్ల నుంచి యాపిల్‌(Apple)​ సంస్థకు ఫిర్యాదులు అందాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఈ సంస్థ యూజర్లకు ఉచిత సర్వీస్(Free Service)​ అందించనున్నట్లు తెలిపింది.

  • Share this:
ప్రముఖ మొబైల్​ తయారీ దిగ్గజం యాపిల్‌​ (Apple)​ తమ వినియోగదారుల కోసం కొత్త సర్వీస్ ప్రోగ్రామ్​ను ప్రారంభించింది. సాంకేతిక సమస్యలు తలెత్తే యాపిల్‌ ఐఫోన్లకు ఫ్రీ రిపేర్​ సర్వీసు అందిస్తామని తెలిపింది. ఐఫోన్​ 12, ఐఫోన్​ 12ప్రో (iPhone 12, iPhone 12 Pro) ఫోన్లలో సౌండ్​ సమస్యలు వస్తున్నట్లు కొంత మంది యూజర్ల నుంచి యాపిల్‌​కు ఫిర్యాదులు అందాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఈ సంస్థ.. యూజర్లకు ఫ్రీ సర్వీస్(Free Service)​ అందిస్తామని తెలిపింది. ఈ సమస్యను తాము కూడా గుర్తించామని, రిసీవర్​ మోడల్​లోని కాంపోనెంట్స్ పనితీరు విఫలం అవ్వడం వల్ల యాపిల్‌​ ఫోన్లలో సౌండ్​ సంబంధిత సమస్యలు వస్తున్నాయని తెలిపింది. అక్టోబర్​ 2020 ఏప్రిల్​ 2021 మధ్య తయారైన ఫోన్లలోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ సమస్య వచ్చినప్పటికీ యూజర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారికి ఉచితంగా సర్వీసు అందిస్తామని పేర్కొంది.

ఈ ఫోన్లకు మాత్రమే..
ఐఫోన్​ 12 యూజర్లు ఫోన్​ చేసినప్పుడు, లేదా వారికి ఫోన్​ వచ్చినప్పుడు సౌండ్ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అందువల్ల ఈ సమస్యలను పరిష్కరించడానికి మొబైల్​ ఫ్రీ సర్వీస్​ అందిస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. ఈ ఉచిత ప్రోగ్రామ్‌కు అర్హత సాధించడానికి, మీరు మీ ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 12 ప్రోని గత రెండేళ్లలోనే కొనుగోలు చేసి ఉండాలి. అంతకు ముందు కొనుగోలు చేసిన హ్యాండ్‌సెట్లకు ఈ ఆఫర్​ వర్తించదు.
Apple iPhone 13: మార్కెట్లోకి ఐఫోన్ 13.. సెప్టెంబ‌ర్ 14 నుంచి ప్రీఆర్డ‌ర్ బుకింగ్‌

ఇంతకు ముందు కూడా యాపిల్‌ ఫోన్లు, ఇతర డివైజెస్​లో ఇలాంటి సమస్యలను గుర్తించినట్లు సంస్థ తెలిపింది. యాపిల్‌​ ఎయిర్‌పాడ్స్ ప్రోలో క్రాక్లింగ్, ఐప్యాడ్ ఎయిర్‌లో ఫౌల్టీ స్క్రీన్​, ఐఫోన్​ 11లో అన్​రెస్పాన్సివ్​ డిస్​ప్లే వంటి సమస్యలను తలెత్తినట్లు చెప్పింది. ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు యూజర్లు యాపిల్‌​ సపోర్ట్‌ సెంటర్లను సంప్రదించాలని కోరింది.
Windows PC Audio Problems: ల్యాప్‌టాప్ స్పీకర్లు పనిచేయడం లేదా? .. అయితే ఇలా చేయండి

యాపిల్‌​ స్టోర్‌ లేదా అధీకృత యాపిల్‌ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సమస్యలకు పుల్​స్టాప్​ పెట్టొచ్చని తెలిపింది. అంతేకాదు, మీరు ఉపయోగించే ఐఫోన్లు ఈ రిపేర్​ ప్రోగ్రామ్​కు అర్హత ఉన్నాయో లేదో కూడా ఈ సెంటర్ల ద్వారానే తెలుసుకోవచ్చు. అయితే రిటైల్ సెంటర్లకు వెళ్లేవారు ముందుగా అపాయింట్​మెంట్ తీసుకొని వెళ్లాలని తెలిపింది. యాపిల్‌ అధికారిక సర్వీస్ సెంటర్ల నుంచి ఈ అపాయింట్​మెంట్ పొందవచ్చు. ఈ–మెయిల్ ద్వారా కూడా యాపిల్‌ సపోర్ట్ సర్వీస్​కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published: