Home /News /technology /

APPLE LAUNCHES AIRPODS MAX WIRELESS HEADPHONES AT RS 59900 AND NETIZENS REACTING WITH JOKES SS GH

AirPods Max: యాపిల్ రిలీజ్ చేసిన కొత్త ఎయిర్‌పాడ్స్‌పై ఇంటర్నెట్‌లో జోకులు

AirPods Max: యాపిల్ రిలీజ్ చేసిన కొత్త ఎయిర్‌పాడ్స్‌పై ఇంటర్నెట్‌లో జోకులు

AirPods Max: యాపిల్ రిలీజ్ చేసిన కొత్త ఎయిర్‌పాడ్స్‌పై ఇంటర్నెట్‌లో జోకులు

AirPods Max Headphones | యాపిల్ నుంచి మొదటిసారిగా హెడ్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. ధర రూ.59,990. ఈ ధర చూసి నెటిజన్లు ఇంటర్నెట్‌లో జోకులు వేసుకుంటున్నారు.

యాపిల్ సంస్థ విడుదల చేసే ప్రొడక్ట్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆధరణ ఉంది. లగ్జరీ డివైజెస్‌కు యాపిల్ సంస్థ మారుపేరుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్కెట్‌లో పోటీని తట్టుకుంటూ, వినియోగదారుల ఆసక్తులకు తగ్గట్టు నాణ్యమైన ప్రొడక్ట్స్‌ను ఆ సంస్థ అందుబాటులోకి తీసుకొస్తుంది. కానీ వాటి ధరలు మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటాయి. తాజాగా యాపిల్ సంస్థ కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎయిర్‌పాడ్స్ ఎయిర్‌పాడ్స్ సిరీస్‌ నుంచి సరికొత్త ఎయిర్‌పాడ్స్ మాక్స్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. యాపిల్ ఎయిర్‌పాడ్స్ విభాగంలో మొదటి ఓవర్ ఇయర్ హెడ్‌ఫోన్స్ ఇవే కావడం విశేషం. యాపిల్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్‌ను ను సరికొత్త ఫీచర్లతో రూపొందించారు. హై ఫైడిలిటీ ఆడియో, అడాప్టివ్ ఈక్యూ, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్, స్పేటియల్ ఆడియో వంటి ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

WhatsApp Feature: మీ వాట్సప్ మెసేజెస్‌తో నిండిపోయిందా? వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి

5G Smartphones: Jio 5G వచ్చేస్తోంది... మార్కెట్లో రెడీగా ఉన్న 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే

అంత ధర పెట్టి కొంటారా?


యాపిల్ గతంలో విడుదల చేసిన యాపిల్ మ్యాక్ ప్రో వీల్స్ కిట్‌ను రూ.50,000గా నిర్ణయించి ఆశ్చర్యపరిచింది. దీంతోపాటు కొత్త ప్రొడక్ట్స్‌పై ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. భారత్‌లో యాపిల్ ఎయిర్ పాడ్స్ మ్యాక్ ధర రూ.59,900గా ఉంది. దీంతో ఈ ధరలపై వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. ఇంత ధర పెట్టి వాటిని ఎవరు కొంటారని సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు. యాపిల్ ఉత్పత్తులపై ఇంటర్నెట్లో జోక్స్, ఫన్నీ మీమ్స్ షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

























హెడ్‌ఫోన్‌లతో పాటు దాని రక్షణ కవర్‌పై కూడా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. యాపిల్ వాచ్ ఆధారంగా ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్‌ను తయారు చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. డిజిటల్ కంట్రోల్స్ సాయంతో వీటిల్లో వాల్యూమ్ ఛేంజెస్, మ్యూజిక్ ప్లే, పాజ్, స్కిప్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Apple

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు