హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Low-cost iPad: అతి తక్కువ ధరకే యాపిల్ నుంచి ఐప్యాడ్‌.. ఆ కంపెనీలకు ధీటుగా కొత్త ప్రొడక్ట్..

Low-cost iPad: అతి తక్కువ ధరకే యాపిల్ నుంచి ఐప్యాడ్‌.. ఆ కంపెనీలకు ధీటుగా కొత్త ప్రొడక్ట్..

Low-cost iPad: అతి తక్కువ ధరకే యాపిల్ నుంచి ఐప్యాడ్‌..

Low-cost iPad: అతి తక్కువ ధరకే యాపిల్ నుంచి ఐప్యాడ్‌..

Low-cost iPad: వచ్చే ఏడాది తక్కువ ధరతో ఒక ఐప్యాడ్‌ (Low-cost iPad)ను తీసుకొచ్చే పనిలో పడిందని బ్లూమ్‌బర్గ్ లేటెస్ట్ నివేదిక వెల్లడించింది. ఈ ఐప్యాడ్ మోడల్‌ను మాగ్నెటిక్ ఫాస్టెనర్లను ఉపయోగించి గోడలపై ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్ కంప్యూటర్లు, ఎయిర్‌పాడ్స్‌తో సహా ఇంకా తదితర ప్రొడక్ట్స్ తయారు చేస్తోంది. అలానే ఆయా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లలో తానే నంబర్.1గా రాణించాలని తపన పడుతోంది. అందుకు తన ప్రొడక్ట్స్‌ను చవక ధరల్లో కూడా తీసుకొస్తుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది తక్కువ ధరతో ఒక ఐప్యాడ్‌ (Low-cost iPad)ను తీసుకొచ్చే పనిలో పడిందని బ్లూమ్‌బర్గ్ లేటెస్ట్ నివేదిక వెల్లడించింది. ఈ ఐప్యాడ్ మోడల్‌ను మాగ్నెటిక్ ఫాస్టెనర్లను ఉపయోగించి గోడలపై ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. యూజర్లు దీనితో లైట్లను కంట్రోల్ చేయవచ్చు. వీడియోలను ప్లే చేయవచ్చు, FaceTime కాల్స్‌ సైతం చేసుకోవచ్చు. ఇంకా ఇతర స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కంట్రోల్ చేయవచ్చు.

యాపిల్ చవకైన ఐప్యాడ్‌తో పాటు స్మార్ట్ డిస్‌ప్లేతో కూడిన హోమ్‌పాడ్ లాంటి ఒక డివైజ్ తీసుకొచ్చేందుకు కూడా కృషి చేస్తుందని నివేదిక పేర్కొంది. స్మార్ట్‌స్క్రీన్‌ డివైజ్‌ల మార్కెట్లో గూగుల్ తీసుకొచ్చిన నెస్ట్ హబ్ మ్యాక్స్‌, అమెజాన్ పరిచయం చేసిన ఎకో షో తక్కువ ధరలకే లభిస్తున్నాయి.

వీటితో పోల్చుకుంటే ప్రస్తుత ఐప్యాడ్‌ ధర చాలా ఎక్కువ. ఈ కారణంగా స్మార్ట్ హోమ్ డివైజ్‌ తీసుకునే వారిలో దీనిని ఎక్కువమంది ప్రిఫర్ చేయడం లేదు. అందుకే యాపిల్ వర్సటైల్ ఫీచర్లతో వచ్చే తన స్మార్ట్ డిస్‌ప్లే డివైజ్ & ట్యాబ్లెట్ కంప్యూటర్ అయిన ఐప్యాడ్‌ను తక్కువ ప్రైస్ ట్యాగ్‌తో రిలీజ్ చేయాలని కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ రోజుల్లో టెక్నాలజీని అన్ని పనుల్లోనూ వాడేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే స్మార్ట్ హోమ్ డివైజ్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్రస్తుత ఐప్యాడ్‌ల లైన్‌ను ఉపయోగించవచ్చని యాపిల్ కంపెనీ గుర్తించింది. అలానే అప్‌కమింగ్ ఐప్యాడ్‌ను ఆల్రెడీ ఉన్న యాపిల్ సర్వీసులతో తక్కువ ధరకే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది.

3

కాగా తక్కువ ప్రైస్‌తో వచ్చే దీనిలో ఇంటర్నల్ స్పీకర్లు ఉండకపోవచ్చు, కానీ స్టాండ్ మాత్రం ఉండొచ్చు. దీని స్క్రీన్ హై-రిజల్యూషన్‌తో రాకపోవచ్చు. యాపిల్ ఈ డివైజ్‌లో మరిన్ని హ్యాండ్స్-ఫ్రీ కమాండ్‌లకు మద్దతు ఇవ్వడానికి అప్‌గ్రేడెడ్ సిరిని ఇవ్వొచ్చు. ఈ కంపెనీ జూన్‌లో జరగనున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్ (WWDC) 2023లో ఈ కొత్త ప్రొడక్ట్ గురించి ప్రస్తావించవచ్చు.

అంతేకాకుండా, ఐప్యాడ్‌లను స్మార్ట్ హోమ్ డిస్‌ప్లేలుగా ఉపయోగించడానికి హోమ్ స్టాండ్ (Home Stand) అనే ఒక డివైజ్‌ ఆపిల్ డెవలప్ చేస్తోందని రూమర్స్ వస్తున్నాయి. అయితే దీనిని కంపెనీ నిజంగా విడుదల చేస్తుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక యాపిల్ ఫాస్టెస్ట్ ప్రాసెసర్‌తో యాపిల్ టీవీను లాంచ్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ టీవీ 8K ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేయాలని సమాచారం. ఈ కొత్త ఉత్పత్తులు వచ్చే ఏడాది లేదా ఆ తర్వాత విడుదల కావచ్చు.

First published:

Tags: Apple, Google, Ipod, Tech news

ఉత్తమ కథలు