Apple iPhone SE: కొత్త ఐఫోన్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలివే

Apple iPhone SE | యాపిల్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఐఫోన్ ఎస్ఈ 2020 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: April 16, 2020, 11:01 AM IST
Apple iPhone SE: కొత్త ఐఫోన్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలివే
యాపిల్ సంస్థ (image: Apple)
  • Share this:
యాపిల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఐఫోన్ 11 హార్డ్‌వేర్, ఐఫోన్ 8 బాడీ, ఏ13 బయానిక్ చిప్‌సెట్‌తో ఐఫోన్ ఎస్ఈని రూపొందించింది యాపిల్. టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఉంది. యూఎస్‌లో 64జీబీ వేరియంట్ ధర 399 డాలర్లు (రూ.30,600) కాగా, 128 జీబీ వేరియంట్ 499 డాలర్లు (రూ.38,200). ఇక హైఎండ్ వేరియంట్ 256జీబీ మోడల్ ధర 549 డాలర్లు(రూ.45,000). ఇండియాలో 64 జీబీ వేరియంట్ ధర రూ.42,500 కాగా 256 జీబీ వేరియంట్ ధర సుమారు రూ.58,300. యూఎస్‌లో ప్రీ ఆర్డర్ ఏప్రిల్ 17న, సేల్ ఏప్రిల్ 24న ప్రారంభమవుతుంది. ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు.


ఐఫోన్ ఎస్ఈ 2020 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 4.7 అంగుళాలు
వేరియంట్: 64జీబీ, 256జీబీ
ప్రాసెసర్: యాపిల్ ఏ13 బయానిక్ చిప్
రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 7 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 13
కలర్స్: బ్లాక్, వైట్, రెడ్
ధర:
64 జీబీ వేరియంట్- రూ.42,500
256 జీబీ వేరియంట్- రూ.58,300

ఇవి కూడా చదవండి:

PhonePe: ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ఫీచర్స్ వచ్చాయి

SBI: ఏటీఎం కార్డులు ఉన్నవారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్

PF Balance: పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఎంత నష్టమంటే
First published: April 16, 2020, 11:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading