iPhone SE: తక్కువ ధరకే యాపిల్ ఫోన్... ఐఫోన్ ఎస్ఈ 2020 విశేషాలివే

Apple iPhone SE 2020 | యాపిల్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేసింది. యాపిల్ తక్కువ ధరలో లాంఛ్ చేసిన ఈ ఫోన్ విశేషాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 11, 2020, 3:55 PM IST
iPhone SE: తక్కువ ధరకే యాపిల్ ఫోన్... ఐఫోన్ ఎస్ఈ 2020 విశేషాలివే
యాపిల్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేసింది. యాపిల్ తక్కువ ధరలో లాంఛ్ చేసిన ఈ ఫోన్ విశేషాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కొద్ది రోజుల క్రితం యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020 రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఇండియన్ యాపిల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న 'ఐఫోన్ ఎస్ఈ 2020' స్మార్ట్‌ఫోన్ భారతదేశానికి వచ్చేసింది. ఆథరైజ్డ్ రీసెల్లర్ స్టోర్ రెడింగ్టన్ ఇండియాలో 'ఐఫోన్ ఎస్ఈ 2020' స్మార్ట్‌ఫోన్‌ను అమ్ముతోంది. ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్స్‌లో కూడా ఈ ఫోన్ కొనొచ్చు. 'ఐఫోన్ ఎస్ఈ 2020' యూఎస్‌లో 64జీబీ, 128 జీబీ, 256జీబీ వేరియంట్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మూడు వేరియంట్లు ఇండియాలో కూడా రిలీజ్ అయ్యాయి. ప్రారంభ ధర రూ.42,500. అయితే ఈ ఫోన్ కొన్నవారికి డిస్కౌంట్ లభిస్తుంది. రెడింగ్టన్ ఆన్‌లైన్ స్టోర్‌లో కొంటే రూ.3,600 డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లాంటి సైట్లలో ఇలాంటి ఆఫర్లే ఉన్నాయి. 'ఐఫోన్ ఎస్ఈ 2020' స్మార్ట్‌ఫోన్‌లో ఐఫోన్ 11 హార్డ్‌వేర్, ఐఫోన్ 8 బాడీ, ఏ13 బయానిక్ చిప్‌సెట్‌ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇతర స్పెసిఫికేషన్స్, ధరల వివరాలు తెలుసుకోండి.

ఐఫోన్ ఎస్ఈ 2020 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 4.7 అంగుళాలు
వేరియంట్: 64జీబీ, 256జీబీ
ప్రాసెసర్: యాపిల్ ఏ13 బయానిక్ చిప్
రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 7 మెగాపిక్సెల్ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 13
కలర్స్: బ్లాక్, వైట్, రెడ్
ధర:
64 జీబీ వేరియంట్- రూ.42,500
128 జీబీ వేరియంట్- రూ.47,800
256 జీబీ వేరియంట్- రూ.58,300

ఇవి కూడా చదవండి:

Realme Narzo: రియల్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు రిలీజ్... ధర రూ.8,499 నుంచి

PhonePe: ఫోన్‌పే యాప్ ఉందా? డబ్బులు సంపాదించండి ఇలా

Mi 10: 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఎంఐ 10 రిలీజ్... ఎలా ఉందో చూడండి
First published: May 11, 2020, 3:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading