యాపిల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్. ఐఫోన్ 12 సిరీస్‌లో ఏకంగా నాలుగు స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేసింది యాపిల్. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. అక్టోబర్ 30న సేల్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఫ్యాన్స్ ఐఫోన్ 12 సిరీస్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా సెప్టెంబర్‌లోనే కొత్త ప్రొడక్ట్స్‌ని పరిచయం చేస్తూ ఉంటుంది యాపిల్. కానీ ఈసారి కరోనా వైరస్ సంక్షోభం కారణంగా రిలీజ్ ఆలస్యమైంది. గత నెలలో యాపిల్ వాచ్ సిరీస్ 6, యాపిల్ వాచ్ ఎస్ఈ, ఐప్యాడ్ ఎయిర్ 2020 ప్రొడక్ట్స్‌ని పరిచయం చేసింది కంపెనీ. ఇప్పుడు యాపిల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 12 సిరీస్ లాంఛ్ చేసింది. ఈ సిరీస్‌లో 4 మోడల్స్ రిలీజ్ అయ్యాయి. వీటి ప్రారంభ ధర రూ.69,900. అన్నీ 5జీ కనెక్టివిటీ సపోర్ట్ చేస్తాయి. ఇక వీటితో పాటు యాపిల్ స్మార్ట్ స్పీకర్ హోమ్‌పాడ్ మినీని కూడా రిలీజ్ చేసింది యాపిల్. ధర రూ.9,990. ఇండియాలో ఇటీవల ప్రారంభమైన యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్స్ దగ్గర ఈ ఫోన్లు కొనొచ్చు.
ఐఫోన్ 12 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: ఏ14 బయోనిక్ చిప్‌సెట్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 14
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్, ప్రొడక్ట్ రెడ్
ధర:
64జీబీ- రూ.79,900
128జీబీ- రూ.84,900
256జీబీ- రూ.94,900
Online Shopping Tricks: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏమైనా కొంటున్నారా? ఈ టిప్స్ మీ కోసమే
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 5 పోకో స్మార్ట్‌ఫోన్లపై మొదటిసారి డిస్కౌంట్స్
ఐఫోన్ 12 మినీ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.4 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: ఏ14 బయోనిక్ చిప్‌సెట్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 14
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్, ప్రొడక్ట్ రెడ్
ధర:
64జీబీ- రూ.69,900
128జీబీ- రూ.74,900
256జీబీ- రూ.84,900
ఐఫోన్ 12 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.1 అంగుళాల డిస్‌ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ, 512జీబీ
ప్రాసెసర్: ఏ14 బయోనిక్ చిప్‌సెట్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 14
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ
ధర:
128జీబీ- రూ.1,19,900
256జీబీ- రూ.1,29,900
512జీబీ- రూ.1,49,900
Samsung Galaxy M31 Prime: సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ వచ్చేసింది... ధర ఎంతంటే
Amazon Great Indian Festival Sale: అమెజాన్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్
ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.7 అంగుళాల డిస్‌ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ, 512జీబీ
ప్రాసెసర్: ఏ14 బయోనిక్ చిప్‌సెట్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఆపరేటింగ్ సిస్టమ్: ఐఓఎస్ 14
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ
ధర:
128జీబీ- రూ.1,29,900
256జీబీ- రూ.1,39,900
512జీబీ- రూ.1,59,900
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple, Ios, Iphone, Smartphone