హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

MacBook Pro: యాపిల్ నుంచి త్వరలో టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రో.. లేటెస్ట్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు..

MacBook Pro: యాపిల్ నుంచి త్వరలో టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రో.. లేటెస్ట్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు..

MacBook Pro: యాపిల్ నుంచి త్వరలో టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రో.. లేటెస్ట్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు..

MacBook Pro: యాపిల్ నుంచి త్వరలో టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రో.. లేటెస్ట్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు..

MacBook Pro: మ్యాక్ కంప్యూటర్లలో టచ్ స్క్రీన్ ఫీచర్ తీసుకురావడానికి యాపిల్ కసరత్తు చేస్తోందని తాజాగా బ్లూమ్‌బర్గ్‌ లేటెస్ట్ రిపోర్టు వెల్లడించింది. ఫ్లాగ్‌షిప్ మ్యాక్‌బుక్ ప్రోకి పెద్ద అప్‌డేట్‌లో ఒక భాగంగా దీన్ని 2025లో తీసుకురావచ్చని ఆ రిపోర్టు అంచనా వేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన ప్రొడక్ట్స్‌లో తీసుకొచ్చే ప్రతి టెక్నాలజీ అందర్నీ మెప్పిస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన టెక్నాలజీలను పరిచయం చేసిన ఈ కంపెనీ ఇప్పుడు తన మ్యాక్ కంప్యూటర్లకు టచ్ స్క్రీన్ యాడ్ చేయడానికి సిద్ధమైంది. తన మ్యాక్ కంప్యూటర్లలో టచ్ స్క్రీన్ ఫీచర్ తీసుకురావడానికి యాపిల్ కసరత్తు చేస్తోందని తాజాగా బ్లూమ్‌బర్గ్‌ లేటెస్ట్ రిపోర్టు వెల్లడించింది. ఫ్లాగ్‌షిప్ మ్యాక్‌బుక్ ప్రోకి పెద్ద అప్‌డేట్‌లో ఒక భాగంగా దీన్ని 2025లో తీసుకురావచ్చని ఆ రిపోర్టు అంచనా వేసింది.

నిజానికి యాపిల్ కంపెనీ ఇప్పటివరకు తన మ్యాక్‌బుక్స్‌కి టచ్ స్క్రీన్ తీసుకురాలేదు. అందుకు బదులుగా ల్యాప్‌టాప్‌లలో టచ్ స్క్రీన్‌లు సరిగ్గా పనిచేయవని, టచ్ స్క్రీన్ ఇంటర్‌ఫేస్ కోసం వెతుకుతున్న వారికి ఐప్యాడ్ మంచి ఆప్షన్ అని చెబుతూ వచ్చింది.

ఇప్పుడు మాత్రం యాపిల్ ఇంజనీర్లు మ్యాక్‌బుక్స్‌కి టచ్ స్క్రీన్ తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారట. ఈ ప్రాజెక్ట్‌పై చురుకుగా ఇంజనీర్లు పనిచేస్తున్నారని.. 2025లో OLED, టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో కొత్త మ్యాక్‌బుక్ ప్రో రిలీజ్ కావచ్చని రిపోర్ట్ అభిప్రాయపడింది. టచ్-స్క్రీన్ తీసుకురావడానికి ప్రధాన కారణం ప్రధాన ప్రత్యర్థి కంపెనీలు ఈ పని ఆల్రెడీ చేయడమేనని కొందరు టెక్ నిపుణులు కామెంట్లు చేస్తున్నారు. రిపోర్ట్ ప్రకారం, యాపిల్ నుంచి వచ్చే తొలి టచ్ స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రో సాధారణ ల్యాప్‌టాప్ వలె ట్రెడిషనల్ డిజైన్‌, ట్రాక్ ప్యాడ్, కీబోర్డ్‌తో వస్తుంది. వీటికి అదనంగా స్క్రీన్ టచ్ ఇన్‌పుట్ ఫెసిలిటీ ఉంటుంది.

iPadOS, macOS కంబైన్ చేయడానికి యాపిల్ చురుకుగా పని చేయనందున మొదటి టచ్‌స్క్రీన్ మ్యాక్‌లు macOS ఉపయోగించే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. ఇక మరో రిపోర్ట్ ప్రకారం, యాపిల్ OLED డిస్‌ప్లేతో మ్యాక్‌బుక్ మోడల్‌ను ఆవిష్కరించాలని భావిస్తోంది. ప్రస్తుతానికి యాపిల్ కంపెనీ తన Macsలో LCD స్క్రీన్లను ఉపయోగిస్తోంది. ఐఫోన్లు, వాచ్‌లలో OLED స్క్రీన్లను వాడుతోంది.

ఐతే యాపిల్ బ్రాండ్ తన మ్యాక్‌బుక్ ప్రొడక్ట్స్ కోసం వివిధ రకాల డిజైన్లు, ఫారమ్ కారకాలను రూపొందించడం కోసం ఇప్పుడు OLED టెక్నాలజీ ఉపయోగించాలని యోచిస్తోంది. ప్రముఖ టెక్ విశ్లేషకుడు మింగ్-చి కువో ప్రకారం, ల్యాప్‌టాప్‌లలో OLED డిస్‌ప్లేల ఉపయోగం మినీ-LEDల కంటే అధిక ప్రయోజనాన్ని అందిస్తుంది.

ఇది కూడా చదవండి : ఫిబ్రవరి 1న శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ లాంచ్.. రూ.1999తో ముందుగానే బుక్ చేసుకోవచ్చు..!

యాపిల్ OLED మ్యాక్‌బుక్‌ను 2024 చివరి నాటికి రిలీజ్ చేయచ్చని సమాచారం. వాస్తవానికి యాపిల్ 2016 కాలంలో టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ ప్రోటోటైప్‌లతో ఇంటర్నల్ ప్రయోగాలు చేసింది. ఐతే మల్టీ-టచ్ ట్రాక్‌ప్యాడ్, కీబోర్డ్ ఇన్‌పుట్‌లు ఆల్రెడీ ఉన్నందున టచ్‌స్క్రీన్ అనేది ల్యాప్‌టాప్ ఫారమ్ ఫ్యాక్టర్‌లో పెద్దగా అవసరం లేనిదని కంపెనీ భావించి ఆ ప్రోటోటైప్‌లను కమర్షియల్ ప్రొడక్ట్స్‌గా తీసుకురాలేదు.

అయితే మ్యాక్‌బుక్‌లో టచ్‌స్క్రీన్ ఇస్తే పించ్-టు-జూమ్, స్వైప్ వంటి యూజ్‌ఫుల్ మల్టీ-టచ్ గెస్చర్స్‌ అందుబాటులో ఉంటాయి. డ్రాయింగ్, పెయింటింగ్ సాఫ్ట్‌వేర్స్‌ ఉపయోగించడం సులభం అవుతుంది. ట్రాక్‌ప్యాడ్ లేదా మౌస్‌పై ఆధారపడకుండా, మెనూల ద్వారా ఈజీగా, ఫాస్ట్‌గా నావిగేట్ చేయడం కుదురుతుంది.

First published:

Tags: Apple, Tech news

ఉత్తమ కథలు