హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Foldable iPad: యాపిల్ నుంచి త్వరలో ఫోల్డబుల్ ఐప్యాడ్.. లాంచ్ ఎప్పుడంటే..

Foldable iPad: యాపిల్ నుంచి త్వరలో ఫోల్డబుల్ ఐప్యాడ్.. లాంచ్ ఎప్పుడంటే..

Foldable iPad: యాపిల్ నుంచి త్వరలో ఫోల్డబుల్ ఐప్యాడ్.. లాంచ్ ఎప్పుడంటే..

Foldable iPad: యాపిల్ నుంచి త్వరలో ఫోల్డబుల్ ఐప్యాడ్.. లాంచ్ ఎప్పుడంటే..

Foldable iPad: యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఐప్యాడ్‌ రానుంది. వచ్చే ఏడాది దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఐప్యాడ్ కార్బన్ ఫైబర్ కిక్‌స్టాండ్‌తో రానున్నట్లు సమాచారం.   

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టెక్ దిగ్గజం యాపిల్(Apple) ప్రొడక్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌ (Advanced Features)తో పాటు అదిరిపోయే లుక్‌లో వచ్చే యాపిల్ ప్రొడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే త్వరలో ఈ కంపెనీ నుంచి మొదటి ఫోల్డబుల్ ఐప్యాడ్‌ రానుంది. వచ్చే ఏడాది దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఐప్యాడ్ కార్బన్ ఫైబర్ కిక్‌స్టాండ్‌తో రానున్నట్లు సమాచారం. యాపిల్ ఫోర్డబుల్ ఐప్యా (Foldable iPad)డ్‌పై పాపులర్ టెక్ అనలిస్ట్ మింగ్ చి కువో ఓ ట్వీట్ చేశారు. 2024లో ఫోల్డబుల్ ఐప్యాడ్ లాంచ్ కావచ్చని ఆయన అంచనా వేశారు. ఈ కొత్త మోడల్‌కు మంచి ఆదరణ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఫోల్డబుల్ ఐప్యాడ్‌లో కార్బన్ ఫైబర్ కిక్‌స్టాండ్ ఉండొచ్చని, కార్బన్ ఫైబర్ మెటీరియల్ కారణంగా ఈ హ్యాండ్‌సె‌ట్ కిక్‌స్టాండ్‌ తేలికగా, ఎక్కువకాలం మన్నికగా ఉంటుందని చెప్పారు. అలాగే ఐప్యాడ్‌ల రవాణాకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని మింగ్- చి కువో ట్వీట్‌లో పేర్కొన్నారు.

* లాంచింగ్ ఎప్పుడు?

ఐప్యాడ్ షిప్‌మెంట్స్ ఇయర్-ఆన్-ఇయర్(YoY) 10-15 శాతం క్షీణత ఉంటుందని మింగ్- చి కువో అంచనా వేశారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో యాపిల్ కంపెనీ ఐప్యాడ్ మినీని రీడిజైన్‌తో భారీగా ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందని, దీంతో రాబోయే 9-12 నెలల్లో ఈ సరికొత్త ఫోర్డబుల్ ఐప్యాడ్‌ను లాంచ్ చేసే అవకాశం ఉండకపోవచ్చని కువో పేర్కొన్నారు.

* ధర ఎక్కువే..

ఫోల్డబుల్ ఐప్యాడ్ లాంచ్ తేదీ, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌కు సంబంధించిన వివరాలను యాపిల్ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ ఐప్యాడ్ ఫోల్డబుల్‌లో కార్బన్ ఫైబర్ కిక్‌స్టాండ్‌ ఉంటుందని ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ వెల్లడించాయి. ఈ డివైజ్ ఇతర ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌పై రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : ఫ్లిప్‌కార్ట్ దుమ్మురేపే ఆఫర్.. ఐఫోన్ 14 ప్లస్‌పై రూ. 12,000 డిస్కౌంట్..

ఐప్యాడ్ మినీ ప్లేస్‌లో కంపెనీ ఫోల్డబుల్ ఐప్యాడ్‌ను తీసుకొస్తుందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే అనలిస్ట్ మింగ్-చి కువో దీన్ని కొట్టిపారేశారు. ఐప్యాడ్ మినీతో పోలిస్తే ఐప్యాడ్ ఫోల్డబుల్ చాలా ఖరీదైనదని, ఒకదానితో మరో ప్రొడక్ట్‌కు సంబంధం లేనని వివరించారు.

* ఐప్యాడ్ మినీ గురించి

రాబోయే న్యూ ఐప్యాడ్ మినీలో కొత్త ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, అది సెల్లింగ్ పాయింట్‌గా ఉంటుందని ఇప్పటికే కువో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఐప్యాడ్ మినీ 2021 సెప్టెంబర్‌లో లాంచ్ అయింది. ఇందులో 8.3-అంగుళాల డిస్‌ప్లే, A15 బయోనిక్ చిప్ సెట్, USB-C పోర్ట్, టచ్ ID పవర్ బటన్, సెల్యులార్ మోడల్‌ల్లో 5G సపోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

First published:

Tags: Apple, Latest Technology, Tech news

ఉత్తమ కథలు