ఐఫోన్ల తయారీని 10% తగ్గించనున్న యాపిల్

జనవరి-మార్చి త్రైమాసికంలో 4.3 కోట్ల యూనిట్స్ తయారు చేయాల్సి ఉంది. కానీ ఉత్పత్తిని 4 కోట్లకు తగ్గించారు. జనవరి-మార్చి త్రైమాసికానికి ఉత్పత్తిని తగ్గించాలని కోరడం ఈ ఏడాది యాపిల్‌కు మరింత గడ్డు పరిస్థితులకు కారణం కావచ్చు.

news18-telugu
Updated: January 9, 2019, 12:58 PM IST
ఐఫోన్ల తయారీని 10% తగ్గించనున్న యాపిల్
ఐఫోన్ల తయారీని 10% తగ్గించనున్న యాపిల్
  • Share this:
గత త్రైమాసికంలో ఆశించినంత లాభాన్ని ఆర్జించలేకపోయిన యాపిల్... జనవరి-మార్చి క్వార్టర్‌లో కొత్త ఐఫోన్ల తయారీని 10% తగ్గించనుంది. గతంలో చెప్పినదాని కంటే తక్కువగా కొత్త ఐఫోన్లను తయారు చేయాలంటూ తమ సప్లయర్స్‌ను కోరింది యాపిల్ యాజమాన్యం. ఇలా యాపిల్ తమ ఉత్పత్తిని తగ్గించుకోవడం ఇదే మొదటిసారి కాదు. రెండు నెలల్లో ఇది రెండో సారి. గతంలో చెప్పిన 89-93 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా 84 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని మాత్రమే కంపెనీ ఆశిస్తున్నట్టు జనవరి 2న ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. యాపిల్ లాభాలు తగ్గడానికి చైనాలో ఐఫోన్ అమ్మకాలు తగ్గిపోవడం, అక్కడ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటం లాంటి కారణాలున్నాయన్నది ఆ కంపెనీ వాదన.

మార్కెట్‌లో మరిన్ని కంపెనీలు ఐఫోన్ లాంటి ఫీచర్లతో తక్కువ ధరకే ఫోన్లు తయారుచేస్తున్నాయి. మిగతా ఫోన్లకు, ఐఫోన్లకు పెద్దగా తేడాలు ఉండకపోవడం, మిగతా బ్రాండ్ల ఫోన్లు ఐఫోన్ కన్నా తక్కువ ధరకే రావడంతో యాపిల్ సేల్స్ తగ్గుతున్నాయి. అమ్మకాలు తగ్గినందుకే ఉత్పత్తి కూడా తగ్గించాలనుకుంటోంది. వాస్తవానికి జనవరి-మార్చి త్రైమాసికంలో 4.3 కోట్ల యూనిట్స్ తయారు చేయాల్సి ఉంది. కానీ ఉత్పత్తిని 4 కోట్లకు తగ్గించారు. జనవరి-మార్చి త్రైమాసికానికి ఉత్పత్తిని తగ్గించాలని కోరడం ఈ ఏడాది యాపిల్‌కు మరింత గడ్డు పరిస్థితులకు కారణం కావచ్చు. ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఎక్స్ఎస్, ఎక్స్ఆర్ లాంటి కొత్త మోడల్స్‌ ఉత్పత్తి తగ్గనుంది.

ఇవి కూడా చదవండి:

ALERT: ఈ పాలసీలను నిలిపేసిన ఎల్ఐసీ... అవి మీ దగ్గర ఉంటే ఏం చేయాలి?

రూ.4,000 తగ్గింపుతో రెడ్‌మీ నోట్ 5 ప్రో

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ నుంచి గుడ్‌ న్యూస్

ఎస్‌బీఐ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌తో మీకు లాభమెంతో తెలుసుకోండి...మీకు పేటీఎం నుంచి ఆ మెసేజ్ వచ్చిందా? క్షమాపణలు చెప్పిన ఇ-వ్యాలెట్
Published by: Santhosh Kumar S
First published: January 9, 2019, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading