Apple: యాపిల్ నుంచి కొత్త ఐఫోన్లు, స్మార్ట్‌వాచ్... రేపే రిలీజ్
Apple iPhone 11 Series | ఐఫోన్ 11 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 5 కూడా రిలీజ్ కానుంది. కొత్త స్మార్ట్‌వాచ్‌లో S5 చిప్సెట్ ఉంటుందని అంచనా.
news18-telugu
Updated: September 9, 2019, 5:18 PM IST

Apple: యాపిల్ నుంచి కొత్త ఐఫోన్లు, స్మార్ట్‌వాచ్... రేపే రిలీజ్ (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: September 9, 2019, 5:18 PM IST
యాపిల్ నుంచి కొత్త ప్రొడక్ట్స్ వచ్చేస్తున్నాయి. సెప్టెంబర్ 10న యాపిల్ హెడ్‌క్వార్టర్స్ క్యూపర్టినోలో జరిగే ఈవెంట్లో నెక్స్ట్-జెన్ ఐఫోన్స్‌తో మరిన్ని ప్రొడక్ట్స్ లాంఛ్ కానున్నాయి. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 10 రాత్రి 10.30 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. యూట్యూబ్‌లో లైవ్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. యూట్యూబ్‌తో పాటు యాపిల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో కూడా లైవ్ చూడొచ్చు. ఈ ఈవెంట్లో సరికొత్త ఫోన్లను ఆవిష్కరించనుంది యాపిల్. వీటిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఐఫోన్ 11 సిరీస్ ఫోటోలు, స్పెసిఫికేషన్స్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది యాపిల్ ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 మ్యాక్స్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తుందని అంచనా. ఈ లేటెస్ట్ ఫోన్లల్లో Wi-Fi 6 స్టాండర్డ్ కంపాటబిలిటీ ఉంటుంది. టాప్ ఎండ్ 2 ఫోన్ల ఓలెడ్ ప్యానెల్స్ యాపిల్ పెన్సిల్ సపోర్ట్ చేస్తాయి. లీకైన సమాచారం ప్రకారం యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్ల స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.
ఐఫోన్ 11 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 5 కూడా రిలీజ్ కానుంది. కొత్త స్మార్ట్‌వాచ్‌లో S5 చిప్సెట్ ఉంటుందని అంచనా. యాపిల్ వాచ్‌లో స్లీప్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉండబోతోంది. కొత్త స్ట్రాప్ కలర్స్ ఉంటాయని అంచనా. యాపిల్ వాచ్‌తో పాటు 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో కూడా రిలీజ్ అయ్యే అవకాశముంది. ఇక యాపిల్ టీవీ హార్డ్‌వేర్‌లో కొత్త అప్డేట్ రిలీజ్ చేసే అవకాశముంది.
Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Amazon Sale: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించిన అమెజాన్... ఎస్బీఐ కార్డుపై ఆఫర్లు
JioFiber: రూ.699 నుంచి జియోఫైబర్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
Smartphone: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...
యాపిల్ ఐఫోన్ 11 | యాపిల్ ఐఫోన్ 11 ప్రో | యాపిల్ ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ | |
డిస్ప్లే | 6.1 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, 3డీ టచ్ ఫార్మాట్ | 5.8 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే | 6.5 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే |
ఇంటర్నల్ స్టోరేజ్ | 512జీబీ | 512జీబీ | 512జీబీ |
ప్రాసెసర్ | ఏ13 ప్రాసెసర్ | ఏ13 ప్రాసెసర్ | ఏ13 ప్రాసెసర్ |
రియర్ కెమెరా | 12+12 మెగాపిక్సెల్ | 12+12+12 మెగాపిక్సెల్ | 12+12+12 మెగాపిక్సెల్ |
ఫ్రంట్ కెమెరా | 12 మెగాపిక్సెల్ | 12 మెగాపిక్సెల్ | 12 మెగాపిక్సెల్ |
బ్యాటరీ | 3,110 ఎంఏహెచ్ | 3,190 ఎంఏహెచ్ | 3,500ఎంఏహెచ్ |
ధర | సుమారు రూ.53,700 | సుమారు రూ.71,000 | సుమారు రూ.78,800 |