APPLE IPOD APPLES KEY DECISION ANNOUNCING THE CESSATION OF IPOD PRODUCTION KNOW FULL DETAILS HERE GH VB
Apple iPod: యాపిల్ కంపెనీ కీలక నిర్ణయం.. ఐపాడ్(iPod) ఉత్పత్తి ఆపేస్తున్నట్లు ప్రకటన.. వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
యాపిల్ (Apple) కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో సంస్థ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసి విడుదల చేసిన ఐపాడ్ (iPod) ఉత్పత్తిని ఆపేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇకనుంచి యాపిల్ ఐపాడ్‌లను తయారు చేయదు.
యాపిల్ (Apple) కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో సంస్థ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసి విడుదల చేసిన ఐపాడ్ (iPod) ఉత్పత్తిని ఆపేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇకనుంచి యాపిల్ ఐపాడ్‌లను తయారు చేయదు. అయితే యాపిల్ స్టోర్స్ నుంచి ఇప్పటికే ఉన్న సప్లై స్టాక్ ఉండేంత వరకు ఐపాడ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఐపాడ్ (iPod)20 సంవత్సరాల క్రితం లాంచ్ అయింది. మ్యూజిక్ లవర్స్‌కు (Music Lovers) ఒక స్టైలిష్ ఐకాన్‌గా(Stylish Icon) మారిన ఐపాడ్, ఒకప్పుడు ఎంతో పాపులర్ (Popular) అయింది. ఈ 20 ఏళ్లలో యాపిల్ మొత్తం 7 ఐపాడ్‌లను పరిచయం చేసింది. మొదటి ఐపాడ్‌ను 2021 అక్టోబర్ 23న లాంచ్ చేసింది. ఇది 1,000 పాటల స్టోరేజ్, 10-గంటల బ్యాటరీ కెపాసిటీతో వచ్చిన మొదటి MP3 ప్లేయర్. ఐపాడ్ మినీని కంపెనీ 2004 ఫిబ్రవరి 20న పరిచయం చేసింది.
ఐపాడ్ ఫీచర్లను ట్రెండ్‌కు(Trend) తగ్గట్లు చిన్న డిజైన్‌లోకి తీసుకువచ్చి మినీ డివైజ్‌ను కంపెనీ విడుదల చేసింది. 2006 సెప్టెంబరు 25న లాంచ్ అయిన ఐపాడ్ నానో (2వ తరం) డివైజ్.. సన్నని డిజైన్, బ్రైట్ కలర్ డిస్‌ప్లే, ఆరు స్టైలిష్ రంగులు, 24 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించింది. ఇది 2,000 పాటల వరకు స్టోర్ చేయగలిగే కెపాసిటీతో వచ్చింది. 2007 సెప్టెంబరు 5న యాపిల్ మొదటిసారి ఐపాడ్ టచ్ డివైజ్‌ను లాంచ్ చేసింది. ఇందులో మల్టీ-టచ్ ఇంటర్‌ఫేస్‌ను తీసుకువచ్చింది. 3.5-అంగుళాల వైడ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో ఐపాడ్‌కు కొత్త లుక్‌ను అందించింది. 2012 సెప్టెంబరు 12న లాంచ్ అయిన ఐపాడ్ నానో (7వ తరం).. కేవలం 5.4 మి.మీ మందంతో వచ్చిన సన్నని ఐపాడ్. దీనికి 2.5-అంగుళాల మల్టీ-టచ్ డిస్‌ప్లే ఉంది.
2015 జూలై 15న యాపిల్ లాంచ్ చేసిన ఐపాడ్ షఫుల్ (4వ తరం).. 15 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌తో కూడిన స్టైలిష్ డిజైన్‌తో వచ్చింది. 2GB స్టోరేజ్, వాయిస్‌ఓవర్ బటన్ వంటి ఫీచర్లతో ఇది యూజర్లను ఆకట్టుకుంది. 2019 మే 28న పరిచయం చేసిన ఐపాడ్ టచ్ (7వ తరం) డివైజ్, A10 ఫ్యూజన్ చిప్‌తో వస్తుంది. ఇది 256GB స్టోరేజ్‌తో పాటు ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎక్స్‌పీరియన్స్, ఇతర ఫీచర్లతో రిలీజ్ అయింది.
‘యాపిల్‌లో కోర్‌లో మ్యూజిక్ ఎల్లప్పుడూ ఒక భాగమై ఉంది. ఐపాడ్ డివైజ్‌లు కోట్ల మంది యూజర్లకు సేవలు అందిస్తూ మ్యూజిక్ ఇండస్ట్రీపై ఎంతో ప్రభావం చూపాయి.’ అని చెప్పారు యాపిల్ వరల్డ్‌వైడ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్వియాక్.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.