5G iPhones: అతి తక్కువ ధరలో యాపిల్​ నుంచి 5G బడ్జెట్ స్మార్ట్​ఫోన్లు.. 4G మోడళ్లను తగ్గించనున్న సంస్థ..

ప్రతీకాత్మక చిత్రం

5G iPhones: కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే యాపిల్​ ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5జి ఫోన్ల హవా నడుస్తుండటంతో వచ్చే ఏడాది బడ్జెట్​ 5జి ఐఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే యాపిల్​ ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5జి ఫోన్ల హవా నడుస్తుండటంతో వచ్చే ఏడాది బడ్జెట్​ 5జి ఐఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ బడ్జెట్ 5G ఐఫోన్లను 2022 మొదటి అర్ధభాగంలోనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ 12 లైనప్ అప్‌డేట్ వెర్షన్​లో ఈ 5G టెక్నాలజీని అందించాలని యోచిస్తోంది. దీనికి అనుగుణంగానే ఈ ఐఫోన్​లో A14 బయోనిక్ చిప్‌ డిజైన్​పై దృష్టిసారించింది. మరోవైపు, ఈ 5జీ ఐఫోన్లలో యాపిల్ సొంత A15 ప్రాసెసర్​ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది విడుదల కానున్న ప్రీమియం ఐఫోన్లలోనూ ఇదే చిప్​ వాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బడ్జెట్​ ఫోన్లలోనూ 5జి టెక్నాలజీ అందించనుండటం విశేషం.

ఇక, 2022లో రానున్న కొత్త 5జి బడ్జెట్ ఫోన్లు కూడా ప్రస్తుతం ఉన్న ఎస్​ఈ మోడల్​లాగే ఐఫోన్​ 8 రిఫ్రెష్​ వెర్షన్​​లో రానుంది. క్వాల్కమ్ X60 మోడెమ్ చిప్​సెట్​ ద్వారా ఈ ఫోన్​లో 5జి ఎనేబుల్​ చేయనున్నారు. 2022లో విడుదల కానున్న ఐఫోన్‌లు 5జి సామర్థ్యం కలిగివుంటాయని, ఇవి ఐఫోన్​ 8 రిఫ్రెష్​ వెర్షన్​గా విడుదలవుతాయని నివేదికలు పేర్కొంది. ఏదేమైనా, ఈ బడ్జెట్​ ఐఫోన్లలో మునుపటి SE మోడళ్ల మాదిరిగానే ఫీచర్లను అందించనున్నారు. ఐఫోన్​ 8 రిఫ్రెష్​ వెర్షన్​లో 4.7 అంగుళాల లిక్విడ్​ క్రిస్టల్ డయోడ్​ (ఎల్​ఈడీ) డిస్​ప్లే అందించనున్నారు.

క్వాల్కమ్ X60 మోడెమ్ చిప్​సెట్​తో..
ప్రపంచ టెక్​ మార్కెట్​లో 5జి స్మార్ట్​ఫోన్ల హవా కొనసాగుతుండటంతో యాపిల్​ తన 4జీ మోడళ్ల అమ్మకానికి స్వస్తి చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం, వచ్చే ఏడాది యాపిల్​ నుంచి కొత్త 4 జి మోడళ్లు విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ. వాటికి బదులుగా బడ్జెట్ 5జి హ్యాండ్‌సెట్ వెర్షన్‌ను అమ్మడం ప్రారంభిస్తుంది. ఇదిలా ఉంటే, గ్లోబల్​ మార్కెట్​లో 5జి టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు స్మార్ట్​ఫోన్​ తయారీ​ సంస్థలు పోటీ పడుతున్నాయి. శామ్‌సంగ్, ఒప్పో, షియోమి వంటి కంపెనీలు 2019లోనే 5జి ఆధారిత స్మార్ట్​ఫోన్లను ప్రవేశపెట్టాయి. ఈ విషయంలో యాపిల్​ కాస్త వెనుకబడిందనే చెప్పాలి. 2020లో యాపిల్ తన మొట్టమొదటి 5 జి ఐఫోన్​ను లాంచ్​ చేసింది.
Published by:Veera Babu
First published: