హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Photos: ఐఫోన్, ఐపాడ్ యూజర్లకు గూగుల్ ఫోటోస్‌ లేటెస్ట్ అప్‌డేట్‌

Google Photos: ఐఫోన్, ఐపాడ్ యూజర్లకు గూగుల్ ఫోటోస్‌ లేటెస్ట్ అప్‌డేట్‌

Google Photos: ఐఫోన్, ఐపాడ్ యూజర్లకు గూగుల్ ఫోటోస్‌ లేటెస్ట్ అప్‌డేట్‌
(ప్రతీకాత్మక చిత్రం)

Google Photos: ఐఫోన్, ఐపాడ్ యూజర్లకు గూగుల్ ఫోటోస్‌ లేటెస్ట్ అప్‌డేట్‌ (ప్రతీకాత్మక చిత్రం)

గూగుల్ ఫోటోస్‌లోని ఫేవరెట్ ఫోటోలు.. యాపిల్ ఫోటోస్‌లో ఫేవరెట్‌గా మారతాయి. యాప్‌ సెట్టింగ్స్‌ ద్వారా కస్టమర్లు ఆటోమేటిక్ సింకింగ్‌ ఫీచర్‌ను డిసెబుల్ చేసుకోవచ్చు. యాప్‌లో ప్రత్యేకంగా ‘ట్యాగ్ యాపిల్ ఫోటోస్‌’ ఆప్షన్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...

యూజర్ల కోసం గూగుల్ ఎప్పటికప్పుడూ కొత్త అప్‌డేట్స్ అందిస్తుంటుంది. తాజాగా గూగుల్ ఫోటోస్ కొత్త అప్‌డేట్‌ వచ్చింది. యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్ యాప్‌ వాడే వారు.. తమ డివైజ్‌లో స్టోర్ చేసుకున్న ఫోటోలను sync చేసుకోవచ్చని గూగుల్ ప్రకటించింది. ఇప్పుడు యాపిల్ కస్టమర్లు యాపిల్ ఫోటోస్, గూగుల్ ఫోటోస్ రెండు యాప్స్‌లలో ఒకదాని నుంచి మరొకదానికి ఫోటోలను ఆటోమేటిగ్గా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్‌ను తాజా అప్‌డేట్‌లో గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకు ముందు ఈ ఆప్షన్‌కు యాపిల్ అనుమతి ఇవ్వలేదు. దీంతో యాపిల్ యూజర్లు గూగుల్ ఫోటోస్‌కు మ్యాన్యువల్‌గానే ఫోటోలను అప్‌లోడ్ చేసుకునేవారు. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా ఐఫోన్‌, ఐపాడ్ వినియోగదారులు లబ్ధి పొందనున్నారు. మరోవైపు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన గూగుల్ ఫోటోస్‌ను వాడేవారి సంఖ్య పెరిగింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ డౌన్‌లోడ్‌లు ఐదు బిలియన్లకు చేరుకోవడం విశేషం.

WhatsApp Feature: మీ వాట్సప్ మెసేజెస్‌తో నిండిపోయిందా? వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి

5G Smartphones: Jio 5G వచ్చేస్తోంది... మార్కెట్లో రెడీగా ఉన్న 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే

ఎలా పనిచేస్తుంది?


స్టార్స్, ఫేవరెట్ ఆప్షన్లను ఎంచుకోవడం ద్వారా యాపిల్ ఫోటోస్, గూగుల్ ఫోటోస్ యాప్‌లలో.. ఒకదాన్నుంచి మరోదానికి ఆటోమేటిగ్గా సింక్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఈ అప్‌డేట్ తరువాత యాపిల్ ఫోటోస్‌లోని ఫేవరెట్‌ ఫోటోలు.. గూగుల్‌ ఫోటోస్‌లో ఫేవరెట్‌గా మారనున్నాయి. గూగుల్ ఫోటోస్‌లోని ఫేవరెట్ ఫోటోలు.. యాపిల్ ఫోటోస్‌లో ఫేవరెట్‌గా మారతాయి. యాప్‌ సెట్టింగ్స్‌ ద్వారా కస్టమర్లు ఆటోమేటిక్ సింకింగ్‌ ఫీచర్‌ను డిసెబుల్ చేసుకోవచ్చు. యాప్‌లో ప్రత్యేకంగా ‘ట్యాగ్ యాపిల్ ఫోటోస్‌’ ఆప్షన్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Nokia 3.4: నోకియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ధర ఎంతంటే

Earphones: ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడితే డేంజరే... ఎలాగో తెలుసా

ఆ విషయంలో రికార్డు..


గూగుల్ ఫోటోస్‌లో ఒక ఇమేజ్‌ను స్టార్‌గా మార్క్ చేసిన వెంటనే.. అది యాపిల్ ఫోటోస్ యాప్‌కు సింక్ అవుతుంది. కానీ యాపిల్ ఫోటోస్‌ నుంచి ఇలా గూగుల్‌ ఫోటోస్‌కు సింక్ కావడానికి కాస్త సమయం పట్టవచ్చు. ఆండ్రాయిడ్ యాప్స్‌లో ఎక్కువమంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ల జాబితాలో గూగుల్ ఫోటోస్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో వాట్సాప్ ముందుంది. ఈ సంవత్సరం ఐదు బిలియన్ల డౌన్‌లోడ్‌ మార్కును అందుకున్న రెండో యాప్‌గా గూగుల్‌ ఫోటోస్‌ నిలిచింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ ఫోటోస్‌ యాప్‌ ముందుగానే ఇన్‌స్టాల్ చేసి వస్తుంది. ఇటీవల గూగుల్ ఫోటోస్ క్లౌడ్ స్టోరేజ్‌ను పరిమితం చేసింది. అన్‌లిమిటెడ్‌ క్లౌడ్ స్టోరేజ్‌ కోసం కస్టమర్లు సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాలని నిబంధనలు విధించింది.

First published:

Tags: Apple, Google, Iphone, Playstore

ఉత్తమ కథలు