Home /News /technology /

APPLE IPHONE SE SPECIAL DISCOUNT ON APPLE SE 2020 ON FLIPKART AVAILABLE AT JUST A PRICE OF RS 27999 GH VB

Apple iPhone SE: ఫ్లిప్​కార్ట్​లో యాపిల్​ SE (2020)​పై స్పెషల్​ డిస్కౌంట్​.. కేవలం రూ. 27,999 ధరకే లభ్యం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఫోన్​ SE (2020) మోడల్​పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్​కార్ట్. ఈ ప్లాట్‌ఫారం​లో ఐఫోన్ SE 128GB స్టోరేజ్ మోడల్​ రెడ్ కలర్ ఆప్షన్​ను రూ. 27,999 డిస్కౌంట్​ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ప్రీమియం స్మార్ట్​ఫోన్ బ్రాండ్​ యాపిల్(Apple) ఇటీవలే ఐఫోన్​ SE (2020) మోడల్​ని అధికారికంగా నిలిపివేసింది. దీన్ని కొత్తగా ప్రారంభించిన మూడవ తరం ఐఫోన్​ SE (2022)తో భర్తీ చేసింది. దీంతో, ఐఫోన్​ SE (2020) మోడల్ ఇకపై యాపిల్ ఆన్‌లైన్(Online) ఐస్టోర్లలో(iStores) లభించదు. అయితే కొన్ని ఇతర షాపింగ్ పోర్టల్స్(Portals)​ ద్వారా దీన్ని డిస్కౌంట్​పై కొనుగోలు చేయవచ్చు. తాజాగా ఈ–కామర్స్(E Commerce) దిగ్గజం ఫ్లిప్​కార్ట్ ఐఫోన్​ SE (2020) మోడల్​పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఫ్లిప్​కార్ట్​లో(Flipkart) ఐఫోన్ SE 128GB స్టోరేజ్ మోడల్​ రెడ్ కలర్(Red Color) ఆప్షన్​ను రూ. 27,999 డిస్కౌంట్(Discount)​ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, సిటీ బ్యాంక్ క్రెడిట్(Credit), డెబిట్ కార్డ్(Debit Card) వినియోగదారులకు అదనంగా రూ. 1000 లేదా 10 శాతం ఇన్​స్టంట్​ డిస్కౌంట్​ పొందవచ్చు. తద్వారా యాపిల్​ ఐఫోన్​ ఎస్​ఈ(2020) మోడల్​ను కేవలం 26,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ విధానంలో కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 500 అదనపు ఫ్లాట్ డిస్కౌంట్​ను పొందవచ్చు. దీని వల్ల ఐఫోన్​ ఎస్​ఈ(2020) కేవలం రూ.26,499 ధర వద్ద లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ కూడా రూ. 13,000 వరకు ఎక్స్​ఛేంజ్​ డిస్కౌంట్​ను అందిస్తోంది. అయితే, ఈ ఎక్స్​ఛేంజ్​ డిస్కౌంట్​ మీరు ఎక్స్​ఛేంజ్​ చేయబోయే ఐఫోన్​ మోడల్​పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే.. అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్​ను పొందవచ్చు.

Xiaomi Mi Pad 5: షియోమి నుంచి త్వరలోనే ఎంఐ ప్యాడ్ 5 ట్యాబ్లెట్​ లాంచ్​.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు..


సిటీ బ్యాంక్​ క్రెడిట్​ కార్డుతో 10 శాతం డిస్కౌంట్​..
ఐఫోన్​ SE (2020) మోడల్​ మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది.64GB, 128GB ర్యామ్​ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వైట్​, రెడ్​ రంగుల్లోని 64GB ఐఫోన్​ SE మోడల్ రూ. 29,999 వద్ద లభిస్తుంది. మరోవైపు, బ్లాక్​, వైట్ రంగుల్లో లభించే 128GB స్టోరేజ్ మోడల్ రూ. 34,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ మూడు రంగులలో లభించే 256GB స్టోరేజ్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 44,999 వద్ద అందుబాటులో ఉంటుంది. కాగా, ఇతర ఆండ్రాయిడ్​ ఫోన్ల నుంచి యాపిల్​ ఐఫోన్లకు మారాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆఫర్​గా చెప్పవచ్చు.

ఎందుకంటే, ఫ్లిప్​కార్ట్ ఆఫర్ ద్వారా ఆండ్రాయిడ్​ ఫోన్ల ధరలోనే ప్రీమియం ఐఫోన్​ SE (2020) మోడల్​ను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఐఫోన్​ ఎస్​ఈ (2020) మోడల్​ 4.7 -అంగుళాల డిస్​ప్లేను కలిగి ఉంటుంది. ఇది A13 బయోనిక్ చిప్‌సెట్​పై పనిచేస్తుంది. సెల్ఫీల కోసం దీని ముందు భాగంలో 7- మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. ఇక, దీని వెనుక భాగంలో 12- మెగాపిక్సెల్ బ్యాక్​ కెమెరాను అందించింది.
Published by:Veera Babu
First published:

Tags: 5g smart phone, Apple store, Iphone, Smart phone

తదుపరి వార్తలు