స్మార్ట్ ఫోన్లు(Smart Phone) రిలీజ్(Release) అవుతున్నాయంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక పెద్ద కంపెనీల(Big Companies) ఫోన్లయితే వాటి ఫీచర్లు, డిజైన్ గురించి రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో(Social Media) చర్చోపచర్చలు చేస్తారు. ప్రతి నెలలో అనేక రకాల కంపెనీల ఫోన్లు లాంచ్ అవుతాయి. అదే విధంగా ఈ నెలలో కూడా చాలా కంపెనీల(Companies) స్మార్ట్ ఫోన్లు లాంచ్(Launch) అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక పెద్ద కంపెనీ యాపిల్ నుంచి రీసెంట్ గా మాంచి ఫామ్ లో ఉన్న వన్ ప్లస్ వరకు అన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్లు ఈ నెలలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి స్మార్ట్ ఫోన్ మార్కెట్లు(Markets) ఢీలా పడ్డాయి. ఇప్పుడిప్పుడే స్మార్ట్ ఫోన్ మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. ఇక ఈ నెలలో అనేక స్మార్ట్ ఫోన్లు రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇక వినియోగదారులదే(Consumers) వంతు అనే విధంగా కంపెనీలు ముందడుగు వేశాయి. చాలా రోజులుగా కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతున్న వేళలో వివిధ రకాల స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. కానీ ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వరుసగా స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసేందుకు కంపెనీలు సై అంటున్నాయి. ఈ నెలలో వచ్చే టాప్ 5 స్మార్ట్ ఫోన్ల మీద ఓ సారి లుక్కేస్తే..
యాపిల్ ఎస్3
యాపిల్ కంపెనీ ఈ నెలలో తన ఫోన్ యాపిల్ SE 3ని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. యాపిల్ అంటేనే పెద్ద ఫోన్లకు మారుపేరు. ఇక ఈ ఫోన్ కూడా ఓ రేంజ్ లో హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ ఫోన్ నెక్ట్స్ జెనరేషన్ కు యూజ్ అయ్యేలా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు.
వన్ ప్లస్
వన్ ప్లస్ 10 ప్రో ఫోన్ మొదట చైనా మార్కెట్ లో లాంచ్ చేయబడింది. కానీ తదుపరి ఈ ఫోన్ ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ పెద్ద డిస్ ప్లేని కలిగి ఉంటుంది. ఇది ఆక్సిజన్ ఓఎస్ 12, స్నాప్ డ్రాగ్ టెక్నాలజీతో వర్క్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది.
రెడ్ మీ
రెడ్ మీ సంస్థ అయిన షావోమీ తన స్మార్ట్ ఫోన్లయిన 11 ప్రో, 11 ప్రో ప్లస్ ఫోన్లను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. మార్చి 9 వ తేదీన వీటిని రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ ఫోన్లు గ్లోబల్ మార్కెట్ లో రిలీజ్ అయ్యాయి. ఈ ఫోన్లలో 108 పిక్సెల్ కెమెరా ఉండనుంది. 5000 ఎం.ఏ.హెచ్
సామ్ సంగ్..
సామ్ సంగ్ కూడా తన గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే కరెక్ట్ డేట్ చెప్పకపోయినా ఎలాగైనా ఈ నెలలోనే రిలీజ్ ఉంటుందని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone