Home /News /technology /

APPLE IPHONE SE 2022 LAUNCHED IN INDIA WITH 5G SUPPORT KNOW PRICE AND SPECIFICATIONS SS

iPhone SE 2022: యాపిల్ నుంచి చీపెస్ట్ ఐఫోన్ వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే

iPhone SE 2022: యాపిల్ నుంచి చీపెస్ట్ ఐఫోన్ వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే
(image: Apple India)

iPhone SE 2022: యాపిల్ నుంచి చీపెస్ట్ ఐఫోన్ వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే (image: Apple India)

iPhone SE 2022 | మీరు ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? యాపిల్ నుంచి చీపెస్ట్ ఐఫోన్ రిలీజైంది. ఐఫోన్ ఎస్ఈ 2022 (iPhone SE 2022) మోడల్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు తెలుసుకోండి.

    ప్రీమియం టెక్ బ్రాండ్ అయిన యాపిల్ నుంచి మరో చీపెస్ట్ ఐఫోన్ రిలీజ్ అయింది. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (iPhone SE) సిరీస్‌లో తక్కువ ధరకే ఐఫోన్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్స్ రిలీజ్ అయ్యాయి. లేటెస్ట్‌గా ఐఫోన్ ఎస్ఈ 2022 (iPhone SE 2022) రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఉన్న ఐఫోన్ ఎస్ఈ లాగానే ఐఫోన్ ఎస్ఈ 2022 ఉండటం విశేషం. కానీ స్పెసిఫికేషన్స్‌లో మార్పులు ఉన్నాయి. కొత్త మోడల్ లేటెస్ట్ ఐఓఎస్ వర్షన్‌తో వస్తుంది. ఇందులో 5జీ సపోర్ట్ ఉంది. 5జీ సపోర్ట్ ఉన్న చీపెస్ట్ ఐఫోన్ ఇదే కావడం విశేషం. అంతేకాదు... ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌లో 5జీ సపోర్ట్ లభిస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో ఉన్న చిప్‌సెట్ ఇందులో ఉంది.

    ఐఫోన్ ఎస్ఈ 2022 ధర


    ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్ 64జీబీ, 128జీబీ, 256జీబీ వేరియంట్లలో రిలీజైంది. 64జీబీ వేరియంట్ ధర రూ.43,900 కాగా, 128జీబీ వేరియంట్ ధర రూ.48,900. ఇక హైఎండ్ వేరియంట్ 256జీబీ మోడల్ ధర రూ.58,900. మార్చి 11న ప్రీ-ఆర్డర్ ప్రారంభం అవుతుంది. మార్చి 18న సేల్ ప్రారంభం అవుతుంది. మిడ్‌నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్స్‌లో కొనొచ్చు.

    Poco M4 Pro 4G: పోకో ఎం4 ప్రో 4జీ సేల్ మొదలైంది... నెలకు రూ.572 చెల్లిస్తే చాలు

    ఐఫోన్ ఎస్ఈ 2022 స్పెసిఫికేషన్స్


    ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 4.7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం, గ్లాస్ డిజైన్‌తో ఉండటం విశేషం. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్లలో ఉన్నట్టు ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ముందు, వెనుకవైపు టఫెస్ట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫేస్ ఐడీ లేదు. టచ్ ఐడీ మాత్రమే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. పాత మోడల్ కన్నా బ్యాటరీ లైఫ్ ఎక్కువగా వస్తుందని కంపెనీ చెబుతోంది. వైర్‌సెల్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

    Samsung Galaxy F23 5G: స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, భారీ బ్యాటరీతో సాంసంగ్ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

    ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 12మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ఉంది. స్మార్ట్ హెచ్‌డీఆర్, ఫోటోగ్రఫిక్ స్టైల్స్, డీప్ ఫ్యూజన్, పోర్ట్‌రైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండటం విశేషం. చాలావరకు ఫీచర్స్ ఐఫోన్ 13 సిరీస్‌లో ఉన్నట్టుగానే ఉన్నాయి.

    ఇక ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్ కొంటే ఫోన్‌తో పాటు యూఎస్‌బీ సీ టు లైటెనింగ్ కేబుల్ మాత్రమే లభిస్తుంది. పవర్ అడాప్టర్, ఇయర్ పాడ్స్ లభించవు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Iphone, Mobile News, Mobiles, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు