HOME »NEWS »TECHNOLOGY »apple iphone manufacturer pegatron to invest rs 1100 crore in india ss gh

iPhone: ఐఫోన్ల తయారీకి ఇండియాలో భారీ పెట్టుబడులు... యాపిల్ ఫోన్ల ధరలు తగ్గొచ్చు

iPhone: ఐఫోన్ల తయారీకి ఇండియాలో భారీ పెట్టుబడులు... యాపిల్ ఫోన్ల ధరలు తగ్గొచ్చు
iPhone: ఐఫోన్ల తయారీకి ఇండియాలో భారీ పెట్టుబడులు... యాపిల్ ఫోన్ల ధరలు తగ్గొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Apple iPhone | యాపిల్ ఐఫోన్లను ఇండియాలో తయారుచేసేందుకు పెగట్రాన్ కార్పొరేషన్ ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది.

  • Share this:
ఐఫోన్ తయారీదారైన పెగట్రాన్ కార్పొరేషన్ భారత్‌పై పట్టుబిగుస్తోంది. ఓవైపు ఐఫోన్‌లకు భారతదేశం అతిపెద్ద మార్కెట్‌గా అవతరించగా మరోవైపు మనదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పెగట్రాన్ ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా చేయలేదు. పెగట్రాన్ టెక్నాలజీ ఇండియా ద్వారా రూ.1,100 కోట్లు పెట్టేందుకు పెగట్రాన్ కార్పొరేషన్ సన్నాహాలు చేసుకుంది. ఆపిల్ ఐఫోన్ల్ తయారులో పెగట్రాన్ అతిపెద్ద మానుఫాక్చరర్ గా నిలవగా, ఇప్పటికే చెన్నై సమీపంలోని కాసా గ్రాండ్ ఇండస్ట్రియల్ పార్క్‌లో 500,000 స్క్వేర్ ఫీట్‌ను వీరు కొత్తగా లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. సుమారు 150 మిలియన్ అమెరికన్ డాలర్లను మనదేశంలో పెట్టుబడులుగా పెట్టేందుకు తైవాన్ కు చెందిన ఈ సంస్థ సిద్ధం అయింది. పెగట్రాన్ తన ఉత్పత్తి యూనిట్‌ను మరింత విస్తరించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందని ఇందుకు అవసరమైన లీజింగ్ వ్యవహారాలు కూడా పూర్తయ్యాయనే విషయాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ JLL మాత్రం ధ్రువీకరించింది.

Flipkart: స్మార్ట్‌ఫోన్ ఏడాది వాడిన తర్వాత 100 శాతం మనీబ్యాక్... ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైన ఆఫర్



Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 25 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

తమిళనాడు హాట్ చాయిస్


బెంగళూరులోని తమ విస్ట్రన్ యూనిట్ లో హింస చెలరేగటంతో చెన్నైనే పెగట్రాన్ ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. JLL సంస్థ చేసిన తాజా అధ్యయనంలోనూ తమిళనాడు ఇలాంటి సంస్థలకు హాట్ చాయిస్ గా ఉంది. కనెక్టివిటీ, ఇన్సెటివ్స్ వంటి విషయాల్లో చెన్నై బెస్ట్ అనేది జెయింట్ కంపెనీల అనుభవంగా మారటంతో మరిన్ని కొత్త సంస్థలు తమిళనాడులో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సై అంటున్నాయి. BYD, Flex, Foxconn, Motorola, Nokia, Samsung వంటి పెద్ద సంస్థలకు ఇప్పటికే తమిళనాడు హాట్ చాయిస్ గా నిలవగా, తమిళనాడు రాష్ట్రం ఎలక్ట్రానిక్ హబ్‌గా వెలిగిపోతోంది. తాజాగా టాటా ఎలక్ట్రానిక్స్ కూడా తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. సుమారు 676మిలియన్ డాలర్ల పెట్టుబడితో మొబైల్ పార్ట్స్ ఫెసిలిటీని హోసులో ప్రారంభించేందుకు టాటా సంస్థ జోరుగా సన్నాహాలు చేస్తోంది.

Amazon Great Republic Day Sale: అమెజాన్ సేల్‌లో ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

WhatsApp: ఈ రెండు సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ సేఫ్... ఇలా మార్చేయండి

చైనా వద్దు, ఇండియా ముద్దు


చైనా-యూఎస్ సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో చైనాకు మించి ఆపిల్ ఉత్పత్తి స్థావరాన్ని విస్తరించేందుకు ఈ తాజా చర్యలు వేగం పుంజుకున్నాయి. తమ తయారీని ఇండియాలో విస్తరించాలనుకుంటున్నట్టు గతంలోనే యాపిల్ సంస్థ వెల్లడించింది. 'మేక్ ఇన్ ఇండియా' చొరవతో ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు తక్కువ ధరకే తమ ప్రాడక్ట్స్ ఉత్పత్తి చేసేందుకు మనదేశాన్ని ఎంచుకుంటున్నాయి. చెన్నై సమీపంలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్లో ఫ్లాగ్‌షిప్‌ ఐఫోన్ 11ను పెగట్రాన్ ఉత్పత్తి చేస్తోంది. మేడ్ ఇన్ ఇండియా యూనిట్లతో పోలిస్తే దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చెన్నైలో తయారయ్యే ఐఫోన్ల ధరలు భవిష్యత్తులో దిగి రానున్నాయి. ఆపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌కు ఇదో పెద్ద గుడ్‌న్యూస్‌.
Published by:Santhosh Kumar S
First published:January 20, 2021, 12:03 IST

टॉप स्टोरीज