యాపిల్ గాడ్జెట్స్‌కు(Apple Gadgets) ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ కంపెనీ(Company) నుంచి వచ్చే ఐఫోన్, ఇయర్ ఫోన్స్, కంప్యూటర్లు ప్రీమియం ఫీచర్లతో(Premium Features) టాప్ రేంజ్లో ఉంటాయి. కస్టమర్లకు(Customers) సరికొత్త యూజర్ ఎక్స్పీరియన్స్(Experience) అందించడంపై యాపిల్(Apple) దృష్టిపెడుతుంది. అందుకే కొత్త ప్రొడక్ట్స్ ధర(Products Cost) భారీగా ఉన్నా.. వాటికి డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే కొత్త యూజర్ ఎక్స్పీరియన్స్(Experience) కోసం యాపిల్ ఎప్పటికప్పుడు కొత్త ఐఫోన్ మోడల్స్ రిలీజ్(Models Release) చేస్తోంది. అయితే ఈ కంపెనీ ఈసారి నాచ్ లేని ఐఫోన్‌ను డిజైన్iPhone Design) చేయడంపై దృష్టి సారించింది. నాచ్-లెస్ ఐఫోన్‌గా ఈ డివైజ్ మరింత ఎట్రాక్టివ్‌గా(Attractive) కనిపించనుంది. అయితే దీని లాంచింగ్‌కు మరో రెండేళ్లు పట్టవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
యాపిల్ కంపెనీ ఐఫోన్లలో ఫ్రంట్ కెమెరా, ఫేస్ ఐడీని డిస్ప్లే కింద ఇచ్చి, వీటిని మెరుగుపరిచే పనిలో ఉంది. అంటే ఇక ఐఫోన్లకు పూర్తిగా నాచ్ తీసివేయవచ్చు. ఈ సరికొత్త ఐఫోన్ 2024లో విడుదల కావచ్చని చెబుతున్నారు యాపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో. డిస్ప్లే కింద నాణ్యమైన కెమెరాల సెట్‌ను అందించాలనే ఆశయంతో కంపెనీ దీనిపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఈ ఫీచర్ iPhone 16 సిరీస్‌లో రావచ్చని తెలుస్తోంది. కెమెరా ఇంటిగ్రేషన్ కోసం ఉత్తమమైన మార్గాన్ని గుర్తించడానికి కంపెనీ ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నట్లు మింగ్ పేర్కొన్నారు.
ఈ ఐఫోన్ లైనప్‌లో ఇన్-డిస్ప్లే టచ్ ఐడీ ఉండవచ్చని మింగ్ సూచించలేదు కానీ.. నాచ్-లెస్ ఐఫోన్ డిజైన్ అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని చెప్పారు. ఇప్పటికే కొన్ని ఫోన్లు కెమెరాను డిస్ప్లే కింద అందించాయి. అయితే వీటికి మంచి ఆదరణ దక్కలేదనే చెప్పాలి. నెగిటివ్ రివ్యూస్ చూస్తే.. ఈ ఫీచర్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉన్నట్లు అర్థమవుతోంది. సాధారణంగా ఇలాంటి వాటి కోసం యాపిల్ ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంది. 2024 నాటికి ఐఫోన్ స్క్రీన్ కింద ఫేస్ ID సెన్సార్, ఫ్రంట్ కెమెరా రెండింటినీ ఏకీకృతం చేసే మార్గాన్ని కంపెనీ కనుగొనే అవకాశం ఉంది.
ఐఫోన్లు, ఇతర యాపిల్ ప్రొడక్ట్స్ గురించి గత కొన్ని వారాలుగా మింగ్ చాలా వివరాలను వెల్లడించారు. తదుపరి ఎయిర్‌పాడ్స్ ప్రో ఈ సంవత్సరం చివర్లో లేదా 2023 ప్రారంభంలో విడుదల కావచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. కంపెనీ ఉత్పత్తి లక్ష్యాన్ని స్పష్టంగా సెట్ చేస్తోంది. అంటే లాంచ్ టైమ్‌లైన్ మనం ఊహించిన దాని కంటే కొంచెం ముందే ఉండవచ్చు. మార్కెట్ వర్గాలు కూడా ఈ వివరాలను ధ్రువీకరించాయి. రాబోయే రెండేళ్లలో కొత్త ప్రొడక్ట్స్‌ను కంపెనీ రిలీజ్ చేయనుంది. ప్రస్తుతానికి యాపిల్ 2022 లైనప్ ప్రొడక్ట్స్‌ను విడుదల చేయడంపై దృష్టి పెట్టింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.