హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 15: ఐఫోన్‌ 15లో Wi-Fi 6E, USB-C పోర్ట్ సపోర్ట్స్.. వెల్లడించిన లేటెస్ట్‌ రిపోర్ట్స్‌

iPhone 15: ఐఫోన్‌ 15లో Wi-Fi 6E, USB-C పోర్ట్ సపోర్ట్స్.. వెల్లడించిన లేటెస్ట్‌ రిపోర్ట్స్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం యాపిల్‌ కంపెనీ iPhone 15 సిరీస్‌పై దృష్టి పెట్టింది. లేటెస్ట్‌ సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్‌ చేసే అవకాశం ఉంది. 2023లో రానున్న ఈ కొత్త ఐఫోన్ మోడల్స్‌లో పెద్ద మార్పులు ఉంటాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

యాపిల్‌ లాంచ్‌ చేయనున్న ప్రొడక్టులపై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ప్రతి సిరీస్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించే యాపిల్‌.. కొత్తగా ఎలాంటి అప్‌డేట్స్‌ లాంచ్‌ చేయనుందనే చర్చలు జరుగుతాయి. ప్రస్తుతం యాపిల్‌ కంపెనీ iPhone 15 సిరీస్‌పై దృష్టి పెట్టింది. లేటెస్ట్‌ సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్‌ చేసే అవకాశం ఉంది. 2023లో రానున్న ఈ కొత్త ఐఫోన్ మోడల్స్‌లో పెద్ద మార్పులు ఉంటాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా లభించిన సమాచారం మేరకు ఐఫోన్‌ 15 Wi-Fi 6Eకి సపోర్ట్‌ చేస్తుంది. దీనికి సంబంధించి కొన్ని నివేదికలు అందజేసిన వివరాలు చూద్దాం.

కొన్ని డివైజ్‌లలో Wi-Fi 6E

బార్క్లేస్ విశ్లేషకులు బ్లేన్ కర్టిస్, టామ్ ఓ'మల్లే షేర్‌ చేసిన రీసెర్చ్‌ నోట్‌ ప్రకారం.. ఐఫోన్‌ 15 Wi-Fi 6Eని అందిస్తుంది. ఈ ఫీచర్ అన్ని మోడల్స్‌లో ఉంటుందా లేదా ప్రో మోడల్‌లకు మాత్రమే పరిమితం అవుతుందా? అనే విషయాన్ని విశ్లేషకులు పేర్కొనలేదు. యాపిల్‌ కంపెనీ లేటెస్ట్‌ 11-అంగుళాల, 12.9-అంగుళాల యాపిల్‌ ఐపాడ్‌ ప్రో(Apple iPad Pro), 14-అంగుళాల, 16-అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో(MacBook Pro), Mac మినీ మోడల్‌ల వంటి కొన్ని డివైజ్‌లకు ఇప్పటివరకు Wi-Fi 6E సపోర్ట్‌ అందింది. అన్ని iPhone 14 మోడల్‌లు స్టాండర్డ్‌ Wi-Fi 6కి పరిమితం అయ్యాయి.

భారీ అంచనాలు

Wi-Fi 6 2.4GHz, 5GHz బ్యాండ్‌లపై పనిచేస్తుంది. అయితే Wi-Fi 6E 6GHz బ్యాండ్‌పై కూడా పని చేస్తుంది. ఇది వేగవంతమైన వైర్‌లెస్ స్పీడ్‌, లోయర్‌ లేటెన్సీ, లెస్‌ సిగ్నల్‌ ఇంటెర్ఫెరెన్స్‌ అందిస్తుంది. ఈ ప్రయోజనాలు పొందడానికి, డివైజ్‌ తప్పనిసరిగా Wi-Fi 6E రూటర్‌కి కనెక్ట్ చేయాలి. ఇది TP-Link, Asus, Netgear వంటి బ్రాండ్‌ల ద్వారా అందుబాటులో ఉంటుందని MacRumors నివేదిక పేర్కొంది. వాస్తవానికి ఐఫోన్ 13, ఐఫోన్ 14 మోడల్స్‌లో Wi-Fi 6E అప్‌డేట్‌ వస్తుందని ఊహించారు, కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు యాపిల్‌ కంపెనీ లేటెస్ట్‌ డివైజ్‌లకు Wi-Fi 6E సపోర్ట్‌ అందించడం ప్రారంభించింది. iPhone 15లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఐఫోన్‌ 15 ఫీచర్లు

యాపిల్‌ ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ను డైనమిక్ ఐలాండ్, USB-C పోర్ట్‌తో పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. అదనంగా, ప్రో మోడల్‌లు Apple తాజా A17 బయోనిక్ చిప్, టైటానియం ఫ్రేమ్, సాలిడ్-స్టేట్ వాల్యూమ్, పవర్ బటన్‌లు వంటి మరిన్ని అప్‌డేట్‌లను అందజేయవచ్చు.

MacRumors నుంచి వచ్చిన మరొక నివేదిక మేరకు.. iPhone 14 Pro మోడల్‌లతో పోలిస్తే iPhone 15 Pro మోడల్స్ సన్నగా, కర్వ్‌డ్‌ బెజెల్స్‌తో వస్తుంది. ఫలితంగా Apple వాచ్ లాంటి రూపాన్ని పొందవచ్చని వెల్లడించింది. ShrmpApplePro ప్రకారం.. నెక్స్ట్‌ జనరేషన్‌ ప్రో ఐఫోన్ మోడల్‌లు ఫ్లాట్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. బెజెల్స్ మాత్రమే కర్వ్‌డ్‌గా ఉండాలి. స్లిమ్మెర్ బెజెల్స్, కర్వ్డ్ ఎడ్జ్‌ల కలయిక యాపిల్‌ వాచ్ సిరీస్ 7, సిరీస్ 8 లాగా రూపాన్ని పొందవచ్చని పేర్కొంది.

First published:

Tags: Apple iphone, Iphone, Smartphone

ఉత్తమ కథలు