ఇంటర్నేషనల్ టెక్ కంపెనీల్లో యాపిల్ (Apple) ప్రస్థానం ప్రత్యేకమైంది. ప్రత్యేకంగా ఐఫోన్ (iPhone)కు ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పనవసరం లేదు. ఈ కంపెనీ ప్రొడక్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఏటా యాపిల్ వినియోగదారులకు కొత్త సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవలే ఐఫోన్‌లో 14 సిరీస్ తీసుకురాగా, రాబోయే రోజుల్లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. అయితే తేదీపై ఇంకా స్పష్టత లేదు. ఐఫోన్ 15 సిరీస్ ధరలు కూడా హై ఎండ్‌లో ఉంటాయని అనేక రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.
* పెరగనున్న ఐఫోన్ ధరలు
యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ కంపెనీ భవిష్యత్ ప్రణాళికలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను బ్లూమ్‌బెర్గ్ చెందిన మార్క్ గుర్మాన్ హైలైట్ చేశారు. ఐఫోన్ పెరుగుతున్న సగటు అమ్మకాల ధర స్థిరంగా ఉందా? అనే ప్రశ్నకు కుక్ స్పందనను ప్రధానంగా గుర్మాన్ హైలైట్ చేశారు. 2017లో ఐఫోన్ టాప్ మోడల్ ఐఫోన్X 256GB ధర రూ.94,825 కాగా, ఇప్పుడు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 1TB ధర రూ. 1,31,944 ఉందని , దీంతో ఐఫోన్ ధరలు భవిష్యత్తులోపెరుగుతున్నాయని కుక్ పేర్కొన్న విషయాన్ని గుర్మాన్ నొక్కి చెప్పారు.
* ప్రో మోడల్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్
గుర్మాన్ ప్రకారం, యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ లైనప్‌లో హై-ఎండ్ మోడల్‌లో హై రేంజ్ ఫీచర్స్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే స్టాండర్డ్ మోడల్స్ కంటే ప్రో మోడల్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ తీసుకురావడానికి యాపిల్ కృషి చేస్తోంది. దీంతో వీటి ధరలు భారీగా ఉండటానికి ఇది ఒక కారణం కావచ్చు.
* స్మార్ట్ పనులకు ఐఫోన్
ఐఫోన్ ప్రజల జీవితాలను బాగా ప్రభావితం చేస్తోందని, ఆన్‌లైన్ పేమెంట్స్, స్మార్ట్-హోమ్ యాక్సెసరీస్ నియంత్రణ, యూజర్ హెల్త్ మేనేజ్, బ్యాంకింగ్ డేటా స్టోర్ వంటి స్మార్ట్ పనులకు ఐఫోన్ బాగా ఉపయోగిస్తున్నారని టిమ్ కుక్ చెప్పుకొచ్చిన విషయాన్ని గుర్మాన్ పేర్కొన్నారు. దీంతో అప్‌కమింగ్ ఐఫోన్ 15 సిరీస్ ధర భారీగా ఉండే అవకాశం ఉంది.
* ఐఫోన్ 15 Plusలో కెమెరాను అప్‌గ్రేడ్
9To5Mac రిపోర్ట్ ప్రకారం.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 Plusలో కెమెరాను అప్‌గ్రేడ్ చేయాలని యాపిల్ యోచిస్తోందని పేర్కొంది. iPhone 14 ప్రో మోడల్స్ కోసం రిజర్వ్ చేసిన కెమెరా సెన్సార్స్ ఈ రెండు మోడల్స్‌లో ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 9To5Mac రిపోర్ట్ ప్రకారం ఐఫోన్ 15, iPhone 15 ఫ్లస్‌లో 48MP వైడ్ లెన్స్‌తో మూడు-స్టాక్డ్ బ్యాక్ కెమెరాలు ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : బాహుబలి పవర్ బ్యాంక్.. ఫోన్లకే కాదు ల్యాప్‌టాప్స్‌కు కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు!
* టైటానియం ఫ్రేమ్, సాలిడ్ స్టేట్ బటన్స్
ఐఫోన్ 15 సిరీస్‌పై మరో సంస్థ రిపోర్ట్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. MacRumors రిపోర్ట్ ప్రకారం.. యాపిల్ ఐఫోన్ 15 Pro , ఐఫోన్ 15 Pro Max టైటానియం ఫ్రేమ్, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో సాలిడ్ స్టేట్ బటన్స్, భారీ ర్యామ్‌తో రావచ్చని అంచనా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple, Apple iphone, New smartphone, Tech news