హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung vs Apple: యాపిల్ ఐఫోన్లపై శామ్‌సంగ్​ సెటైర్లు.. కొత్త ప్రొడక్ట్స్‌ను ట్రోల్ చేసిన కంపెనీ..

Samsung vs Apple: యాపిల్ ఐఫోన్లపై శామ్‌సంగ్​ సెటైర్లు.. కొత్త ప్రొడక్ట్స్‌ను ట్రోల్ చేసిన కంపెనీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దిగ్గజ మొబైల్ కంపెనీ శామ్‌సంగ్ (Samsung).. యాపిల్ ఐఫోన్లను ఎప్పుడూ పోటీగా భావిస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు యాపిల్ ప్రొడక్ట్స్‌ను ట్రోల్ చేస్తుంది. తాజాగా ఐఫోన్ 14 సిరీస్ విడుదలైన సమయంలో శామ్‌సంగ్ ఇలాంటి పనే మరోసారి చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దిగ్గజ మొబైల్ కంపెనీ శామ్‌సంగ్ (Samsung).. యాపిల్ ఐఫోన్లను (Apple I phone) ఎప్పుడూ పోటీగా భావిస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు యాపిల్ ప్రొడక్ట్స్‌ను ట్రోల్ చేస్తుంది. ఐఫోన్లను చులకనగా చేస్తూ తమ కంపెనీ ఫోన్లే బెటర్ అంటూ ఈ కొరియన్ కంపెనీ యాడ్స్ కూడా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఐఫోన్ 14 సిరీస్ (IPhone 14 Series) విడుదలైన సమయంలో శామ్‌సంగ్ ఇలాంటి పనే మరోసారి చేసింది. కొత్త ఐఫోన్లలో సరికొత్త ఇన్నొవేషన్, టెక్నాలజీ ఏమీ అందించలేదని ట్రోలింగ్ చేస్తూ, కొత్త మార్కెటింగ్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

శామ్‌సంగ్ కూడా ఐఫోన్లకు ధీటుగా ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ (Flagship Mobiles) లాంచ్‌ చేస్తుంటుంది. అయినా ఐఫోన్లకు ఉన్నంత క్రేజ్ ఈ కంపెనీ ప్రొడక్ట్స్‌కు రాదు. ఇదే శామ్‌సంగ్ అసూయకు కారణం. అందుకే బహిరంగంగానే ఐఫోన్లు బాలేవంటూ ఎగతాళి (Satires) చేస్తోంది. వీటికి బదులుగా తమ కంపెనీ ఫోన్లను కొనుగోలు చేయాలంటూ పరోక్షంగా ప్రచారాలు మొదలుపెడుతుంది. యాపిల్ మాత్రం వీటన్నింటినీ మౌనంగా చూస్తూ హుందాగా ప్రవర్తిస్తుంటుంది.

* పోటాపోటీగా ప్రొడక్ట్స్

శామ్‌సంగ్, యాపిల్ కంపెనీలు కొన్ని నెలల కాలంలోనే తమ హై-ఎండ్ మోడళ్లను విడుదల చేశాయి. యాపిల్ ఐఫోన్ 14 డిజైన్ యూజర్లను అంతగా మెప్పించలేకపోయింది. మరోవైపు శామ్‌సంగ్ ఫోల్డబుల్ సిరీస్‌లోని అవాంట్-గార్డ్ ఇన్నొవేషన్‌కు ప్రశంసలు కురిశాయి. అయితే ఇప్పటివరకు యాపిల్ ఫోల్డబుల్ మొబైల్‌ను లాంచ్ చేయలేదు. 14 సిరీస్ లైనప్‌లో కూడా ఫ్లెక్సిబుల్ ఫోన్లను రిలీజ్ చేయలేదు. దాంతో ఒక కొత్త వీడియో కమర్షియల్‌లో యాపిల్‌ని శామ్‌సంగ్ విమర్శించింది. శామ్‌సంగ్ తన యూఎస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ @Samsung Mobile US ద్వారా యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను తక్కువ చేస్తూ వీడియోలు పెట్టింది.

ఇంకెప్పుడు ఫోల్డబుల్ ఫోన్‌ను యాపిల్ రిలీజ్ చేస్తుందో అన్నట్లు.. ‘యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేసినప్పుడు మమ్మల్ని కాస్త అలర్ట్ చేయండి’ అని ప్రజలను అభ్యర్థిస్తూ శామ్‌సంగ్ వ్యంగ్యంగా ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ ట్వీట్ ద్వారా యాపిల్‌కి డిజైన్ క్రియేటివిటీ లేదని శామ్‌సంగ్ డైరెక్ట్‌గా కామెంట్ చేసింది. కాగా యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌ను ఇంకా లాంచ్ చేయలేదు కానీ 2023 నాటికి ఫోల్డబుల్ ట్యాబ్లెట్‌ తీసుకు రావచ్చని తెలుస్తోంది. శామ్‌సంగ్ మడత పెట్టే ఫోన్ తీసుకొచ్చి రెండేళ్లకు పైగా గడుస్తోంది.

శామ్‌సంగ్ ఐఫోన్ల కెమెరాకు సంబంధించిన మరో జోక్ కూడా పేల్చింది. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ కొత్త 48MP తో వస్తున్నాయి. అయితే, శామ్‌సంగ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ “ఇంకా 48 మెగాపిక్సెల్‌యేనా? 2020లోనే గెలాక్సీ ఎస్20 అల్ట్రాతో 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను మేం తీసుకొచ్చాం" అని పరిహాసం ఆడింది. బీటీఎస్ నుంచి ఇన్‌స్పైర్ అయి డీప్ పర్పుల్ కలర్‌లో ఐఫోన్‌ 14 ప్రోని యాపిల్ కంపెనీ లాంచ్ చేసిందని నెటిజన్లు అంటుండగా దీనిపై కూడా శామ్‌సంగ్ ఒక జోక్ వేసింది. కూల్ స్టోరీ బ్రో అని పర్పుల్ కలర్‌ ఏమోజీలతో ఒక ట్వీట్ పోస్ట్ చేసింది. మరొక ట్వీట్‌లో యాపిల్ బాక్సీ డిజైన్‌ను శామ్‌సంగ్ బాగుంది అని పొగడటం విశేషం.

ఈ సంస్థ ఇలాంటి జోకులతో తన ప్రచారాన్ని కేవలం సోషల్ మీడియా కే పరిమితం చేయలేదు. యాపిల్ ఐఫోన్‌లపై జోకులు వేస్తూ బిల్‌బోర్డ్‌లను కూడా ఏర్పాటు చేసింది. గెలాక్సీ డివైజ్‌లు రెండేళ్ల నుంచే 8Kలో వీడియోను రికార్డ్ చేయగలిగాయని, ఐఫోన్ 14 ప్రో ఇప్పటికీ 4K వీడియోకే పరిమితమైందని ఒక బిల్‌బోర్డ్‌లో శామ్‌సంగ్ రాసుకొచ్చింది.

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Apple iphone, Samsung, Smart phones, Trolling

ఉత్తమ కథలు