హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 14 Pro: బ్లాక్‌బాస్టర్ డీల్.. ఈ ఫోన్లపై రూ.58 వేల తగ్గింపు!

iPhone 14 Pro: బ్లాక్‌బాస్టర్ డీల్.. ఈ ఫోన్లపై రూ.58 వేల తగ్గింపు!

iPhone 14 Series

iPhone 14 Series

iPhone 14 Pro Max | ఐఫోన్ కొంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకని అనుకుంటున్నారా? మీరు అందుబాటులో ఉన్న ఆఫర్లను ఉపయోగించుకుంటే కొత్త ఐఫోన్ కొనుగోలపై భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి ఉన్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  iPhone 14 Plus| మీరు కొత్తగా ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అది కూడా యాపిల్ (Apple) ఐఫోన్ కొనే యోచనలో ఉన్నారా? ఇందులో కూడా లేటెస్ట్ ఐఫోన్ మోడళ్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు కూడా సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఐఫోన్ (iPhone 14 Series) లేటెస్ట్ మోడళ్లను కొనుగోలు చేస్తే రూ. 50 వేలకు పైగా డిస్కౌంట్ అందుబుటలో ఉంది.

  యాపిల్ కంపెనీ ఇటీవలనే ఐఫోన్ 14 సిరీస్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో నాలుగు ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అనేవి ఇవి. ఈ ఫోన్ల ప్రిబుకింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ ఐఫోన్స్ కొనుగోలు చేయాలని భావించే వారు ముందుగానే ఆర్డర్ ఇవ్వొచ్చు. తర్వాత ఇవి కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి.

  సూపర్ డూపర్ ఆఫర్.. రూ.57,999 ఫోన్ రూ.27 వేలకే కొనండి!

  అయితే ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లు కొనాలని భావించే వారికి ట్రేడ్ ఇన్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే మీరు మీ వద్ద ఉన్న పాత ఐఫోన్‌ను ఇచ్చేసి కొత్త ఐఫోన్ కొంటే భారీ తగ్గింపు పొందొచ్చు. అలాగే ఇతర కంపెనీల స్మార్ట్‌ఫోన్స్ కూడా మీరు ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే తగ్గింపు మాత్రం తక్కువగానే ఉంటుంది. యాపిల్ ట్రేడ్ ఇన్ ఆఫర్ కింద మీరు ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కొంటే గరిష్టంగా రూ. 58,730 వరకు తగ్గింపు లభిస్తుంది.

  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ను మించేలా షావోమి దద్ధరిల్లే ఆఫర్లు.. ఉచితంగానే టీవీలు, స్మార్ట్‌ఫోన్స్!

  అంతేకాకుండా క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ మోడళ్లను కొనుగోలు చేస్తే రూ. 6 వేల వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. అయితే రూ.54,900 విలువైన ట్రాన్సాక్షన్ నిర్వహిస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంకా ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ఇవి కాకుండా కస్టమర్లు వారి క్రెడిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఈ కొత్త ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే ఎక్కువ వడ్డీ పడుతుంది. అందువల్ల డబ్బులు ఉంటే ఒకేసారి చెల్లించి ఐఫోన్ సొంతం చేసుకోవడం ఉత్తమం. డబ్బులు లేకపోతే ఈ ఫోన్‌కు దూరంగా ఉండటం చాలా మంచిది. లేదంటే అనవసరంగా ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకుంటారు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Apple, Apple iphone, Apple store, Iphone, Iphone 14

  ఉత్తమ కథలు