హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Apple iPhone 14 Pro: ఐఫోన్‌ 14 కెమెరాతో ఇబ్బందులు.. లేటెస్ట్ డివైజెస్‌లో యూజర్లు గుర్తించిన సమస్యలు ఇవే..

Apple iPhone 14 Pro: ఐఫోన్‌ 14 కెమెరాతో ఇబ్బందులు.. లేటెస్ట్ డివైజెస్‌లో యూజర్లు గుర్తించిన సమస్యలు ఇవే..

Apple iPhone 14 Pro: ఐఫోన్‌ 14 కెమెరాతో ఇబ్బందులు.. లేటెస్ట్ డివైజెస్‌లో యూజర్లు గుర్తించిన సమస్యలు ఇవే..

Apple iPhone 14 Pro: ఐఫోన్‌ 14 కెమెరాతో ఇబ్బందులు.. లేటెస్ట్ డివైజెస్‌లో యూజర్లు గుర్తించిన సమస్యలు ఇవే..

Apple iPhone 14 Pro: ఐఫోన్‌ 14 ప్రో డివైజ్‌ను వినియోగిస్తున్నప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయని యూజర్లు సోషల్‌ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు తమ కొత్త ఐఫోన్ 14 ప్రో(iPhone 14 Pro) కెమెరా షేక్‌ అవుతోందని తెలిపారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

చాలా కాలంగా యాపిల్‌ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 14 సిరీస్‌(iPhone 14 Series)ను ఇటీవలే యాపిల్‌ కంపెనీ (Apple Company) లాంచ్‌ చేసింది. భారీ అంచనాల మధ్య ఐఫోన్‌ 14 సిరీస్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు ఐఫోన్‌ 14 ప్రో డివైజ్‌ను వినియోగిస్తున్నప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయని యూజర్లు సోషల్‌ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు తమ కొత్త ఐఫోన్ 14 ప్రో(iPhone 14 Pro) కెమెరా షేక్‌ అవుతోందని తెలిపారు.

స్నాప్‌చాట్(Snapchat), ఇన్‌స్టాగ్రామ్(Instagram), టిక్‌టాక్(Tiktok) వంటి థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌లు ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్‌ నుంచి నాయిస్‌ వినిపిస్తోందని మరి కొందరు పేర్కొన్నారు. కొత్త ఐఫోన్ 14 ప్రో వినియోగదారులు తమ సమస్యలను రెడ్డిట్, ట్విట్టర్‌ వేదికగా పంచుకొన్నారు. కొందరు ఫోన్‌లో తలెత్తుతున్న సమస్యలను వివరించే వీడియోలను పోస్ట్‌ చేశారు.

ఐఫోన్‌ 14 ప్రో వినియోగిస్తున్నప్పుడు కెమెరా షేక్‌ అవుతుండటం, కొన్ని రకాల థర్డ్‌ పార్టీ యాప్‌లు వినియోగిస్తున్నప్పుడు ఫోన్‌ నుంచి నాయిస్‌ వస్తుండటాన్ని వినియోగదారులు పోస్ట్‌ చేసిన వీడియోలలో స్పష్టంగా చూడవచ్చు. AppleInsider తెలిపిన వివరాల ప్రకారం.. ఐఫోన్ 14 ప్రోకి యాపిల్‌ కంపెనీ కొన్ని అప్‌డేట్‌లను యాడ్‌ చేసింది. 48MP సెన్సార్, సాఫ్ట్‌ వీడియోను రూపొందించడానికి యాక్షన్ మోడ్‌తో సహా అనేక మార్పులు చేసింది. అయితే కెమెరాను ఉపయోగించే థర్డ్-పార్టీ యాప్‌లు కొత్త హార్డ్‌వేర్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదిక తెలిపింది.

* షేక్‌ అవుతోన్న కెమెరా

ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్‌ వంటి యాప్‌లను వినియోగిస్తున్నప్పుడు కెమెరా మాడ్యూల్ షేక్‌ అవుతోందని చాలా మంది వినియోగదారులు పేర్కొన్నారు. ఈ సమస్య కారణంగా యాప్‌లలోని కెమెరాను ఉపయోగించి రికార్డ్ చేసిన వీడియో సక్రమంగా రావడం లేదని, పబ్లిష్‌ చేయడానికి వీలు లేని విధంగా షేక్‌ అవుతూ రికార్డ్‌ అవుతోందని తెలిపారు. రెడ్డిట్‌తో సహా సోషల్ మీడియాలో పోస్ట్‌లు.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS) సిస్టమ్‌లో సమస్య తలెత్తుతున్నట్లు చెబుతున్నారు.

* ఎన్ని ఫోన్లు ఎఫెక్ట్‌ అయ్యాయి?

ఐఫోన్ 14 ప్రోలో 48MP ప్రైమరీ కెమెరా యాపిల్‌ సెకండ్‌ జనరేషన్‌ సెన్సార్-షిఫ్ట్ OISని కలిగి ఉంది. ఇది సెన్సార్‌ను ఫిజికల్‌గా మూవ్‌ చేస్తుంది. మరొకటి ఓల్డ్‌, ట్రెడిషనల్‌ OIS సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. కొంతమంది వినియోగదారులు థర్డ్-పార్టీ యాప్ కెమెరా ఫీచర్‌లను ఉపయోగించినప్పుడు షేక్‌ అవడం, మెకానికల్ మూవ్‌మెంట్స్‌ కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

సమస్యను వివరిస్తే పోస్ట్‌ చేసిన ఓ వీడియోలో ఐఫోన్ కొద్దిగా కదులుతోంది, గ్రౌండింగ్ శబ్దాన్ని సృష్టిస్తోంది. ఈ సమస్య ఎన్ని ఐఫోన్‌లను ప్రభావితం చేస్తుందో తెలియదని, బగ్‌ను స్వతంత్రంగా రీప్రొడ్యూస్‌ చేయడానికి ప్రయత్నించి, విఫలమైనట్లు AppleInsider నివేదిక పేర్కొంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Apple iphone, Iphone 14, Tech news

ఉత్తమ కథలు