Home /News /technology /

APPLE IPHONE 14 PRO IS SEEING MORE DEMAND THAN THE CHEAPER IPHONE 14 MODEL THIS YEAR FOR THIS REASON GH SRD

iPhone 14 Pro: ఐఫోన్ 14 కంటే ఐఫోన్ 14 ప్రో పైనే ఎక్కువమంది ఆసక్తి.. కారణం ఇదే..!

iPhone 14 Pro: ఐఫోన్ 14 కంటే ఐఫోన్ 14 ప్రో పైనే ఎక్కువమంది ఆసక్తి.. కారణం ఇదే..!

iPhone 14 Pro: ఐఫోన్ 14 కంటే ఐఫోన్ 14 ప్రో పైనే ఎక్కువమంది ఆసక్తి.. కారణం ఇదే..!

iPhone 14 Pro: యాపిల్‌ ఐఫోన్‌ 14కు ఆదరణ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని యాపిల్ ఎనలిస్ట్ కువో అన్నారు. ప్రత్యేకించి ఐఫోన్‌ 14 ప్రోకి డిమాండ్‌ పెరిగిందని చెప్పారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
టెక్ దిగ్గజం యాపిల్‌(Apple) ఇటీవలే ఐఫోన్‌ 14 (iPhone 14) సిరీస్‌ను లాంచ్‌ చేసింది. సాధారణంగానే ఈ ప్రభావం అంతకుముందు ఉన్న ఐఫోన్‌ మోడల్స్‌ ధరలపై కనిపిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ (Flipkart Big Billion Days Sale), అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ (Amazon Great Indian Festival Sale)లో ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఐఫోన్‌ 13, కొత్త ఐఫోన్‌ 14 ఒకే ప్రాసెసర్‌తో రూపొందాయి, వీటి మధ్య పెద్దగా మార్పులు లేకపోవడంతో ఎక్కువ మంది వినియోగదారులు ఐఫోన్‌ 13ను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఐఫోన్‌ 14 (iPhone 14) కంటే ఐఫోన్‌ 14 ప్రో (iPhone 14 pro) మోడల్‌కు డిమాండ్‌ ఎక్కువగా కనిపిస్తోందని సమాచారం. * ఐఫోన్‌ 14పై కనిపించని ఆసక్తి యాపిల్‌ ఐఫోన్‌ 14కు ఆదరణ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని యాపిల్ ఎనలిస్ట్ కువో అన్నారు. ప్రత్యేకించి ఐఫోన్‌ 14 ప్రోకి డిమాండ్‌ పెరిగిందని చెప్పారు. ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ ధరల్లో రూ.10,000 మాత్రమే తేడా ఉంది. అందుకే వినియోగదారులు 14 ప్రో మాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వట్లేదని కువో తెలిపారు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఐఫోన్ 14.. గత ఏడాది వచ్చిన ఐఫోన్ 13 మాదిరిగానే A15 బయోనిక్‌ ప్రాసెసర్‌తో వచ్చింది. ఇండియన్‌ మార్కెట్‌లో ఐఫోన్‌ 13 ప్రత్యేక డిస్కౌంట్లతో తక్కువ ధరకు లభిస్తోంది. ఫీచర్లలో కూడా పెద్దగా తేడాలు లేవు. అందులోనూ తక్కువ ధరకే ఐఫోన్‌ 13 అందుతోంది. కాబట్టి వినియోగదారులు కొత్త ఐఫోన్‌ 14పై ఆసక్తి చూపడం లేదని కువో వివరించారు. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ కూడా తక్కువ అమ్ముడయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఐఫోన్ 14 ప్రో మోడల్ అమ్మకాల పరంగా యాపిల్‌ సేల్స్‌పై కనిపించిన ప్రభావం తెలుసుకోవడానికి త్రైమాసికం ముగిసే వరకు వేచి ఉండాలని చెప్పారు. ఇది కూడా చదవండి : జీమెయిల్‌లో ప్రమోషనల్ ఈమెయిల్స్‌ ఒకేసారి డిలీట్ చేయాలా..? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.. * పెరిగిన ఐఫోన్‌ 14 ప్రో ప్రొడక్షన్‌ వివిధ దేశాల నుంచి ఐఫోన్ 14 ప్రో మోడల్‌కు డిమాండ్‌ పెరగడంతో, వీటిని సరఫరా చేయడానికి యాపిల్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ డిమాండ్‌ కారణంగా ఈ సంవత్సరానికి ఐఫోన్‌ల సగటు అమ్మకపు ధర(ASP)ని పెంచడానికి యాపిల్‌ కంపెనీకి అవకాశం లభించిందన్నారు. భారతదేశంలో ఐఫోన్‌ 14 ప్రో రూ.1,29,900కు అందుబాటులో ఉంది. ప్రీమియం ఫోన్‌కు లభిస్తున్న డిమాండ్‌ యాపిల్‌కు లాభాలను తెచ్చిపెడుతుందని కువో అభిప్రాయపడ్డారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంపెనీ తన ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తోందని వివరించారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Apple iphone, Iphone 14, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు