హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 14 Pro Max: ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్ 1TB వేరియంట్ అన్‌బాక్సింగ్.. అత్యంత ఖరీదైన ఐఫోన్‌ 14 మోడల్‌ ప్రత్యేకతలు..

iPhone 14 Pro Max: ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్ 1TB వేరియంట్ అన్‌బాక్సింగ్.. అత్యంత ఖరీదైన ఐఫోన్‌ 14 మోడల్‌ ప్రత్యేకతలు..

Image: Debashis Sarkar/News18

Image: Debashis Sarkar/News18

iPhone 14 Pro Max: ఐఫోన్ 14 ప్రో మోడళ్లు ఏకంగా 1TB స్టోరేజ్‌తో వస్తాయి. ఈ లగ్జరీ మోడళ్లపై అందరి దృష్టి నెలకొన్న నేపథ్యంలో.. టాప్ ఎండ్ వెర్షన్స్ అయిన ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్ 1TB వేరియంట్ ప్రత్యేకతలు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

యాపిల్ కంపెనీ (Apple) ఇటీవలే ఐఫోన్‌ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్ ఫోన్లు ఇండియా (India)లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటి రివ్యూలు (Reviews) కూడా ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. ఐఫోన్‌ 14 ప్రో డివైజ్‌లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని చాలామంది యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేయడం మినహా.. ఈ సిరీస్ ఫోన్లపై ఎలాంటి ఇతర రిమార్క్ లేదు. ఐఫోన్ 14 ప్రో మోడల్‌ను రూ.1,79,900కి సొంతం చేసుకోవచ్చు. అయితే టాప్-ఎండ్ ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ (iPhone 14 Pro Max) వెర్షన్‌ కోసం మరో రూ.10,000 అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్‌ ఏకంగా 1TB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ లగ్జరీ మోడళ్లపై అందరి దృష్టి నెలకొన్న నేపథ్యంలో.. టాప్ ఎండ్ వెర్షన్స్ అయిన ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్ 1TB వేరియంట్ ప్రత్యేకతలు తెలుసుకుందాం.

* ఐఫోన్‌ 14 ప్రో, ప్రో మ్యాక్స్‌ ధరలు

కొత్త యాపిల్‌ ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ ఇండియాలో 128GB, 256GB, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ డీప్ పర్పుల్, సిల్వర్, గోల్డ్, స్పేస్ బ్లాక్ వంటి నాలుగు కలర్స్‌లో లభిస్తున్నాయి. ఇండియాలో యాపిల్‌ ఐఫోన్‌ 14 ప్రో(128GB) ధర రూ.1,29,900గా ఉంది. ఐఫోన్‌ 14 ప్రో(256 GB) ధర రూ.1,39,900, ఐఫోన్‌ 14 ప్రో(512 GB) ధర రూ.1,59,900, ఐఫోన్‌ 14 ప్రో(1TB) ఫోన్‌ ధర రూ.1,79,900గా ఉంది.

మన దేశంలో యాపిల్‌ ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌(128GB) వేరియంట్‌ను రూ.1,39,900కి సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌(256GB) ధర రూ.1,49,900గా ఉంది. ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌(512GB) వేరియంట్‌ రూ.1,69,900కు లభిస్తుంది. ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌(1TB) ధరను అత్యధికంగా రూ.1,89,900గా నిర్ణయించారు.

* ఆకట్టుకుంటున్న డైనమిక్‌ ఐలాండ్‌

ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌లో యాపిల్‌ కంపెనీ కొత్తగా లాంచ్‌ చేసిన డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌ ఆకట్టుకుంటోంది. ఇది అన్ని రకాల సిస్టమ్‌ అప్‌డేట్‌లను, నోటిఫికేషన్లను డిస్‌ప్లే చేస్తుంది. నోటిఫికేషన్‌ను బట్టి డిస్‌ప్లే సైజ్‌ను మారుస్తుంది. ఐఫోన్ 14 ప్రో సిరీస్ ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్‌లో క్వాడ్-పిక్సెల్ సెన్సార్, ఫోటోనిక్ ఇంజిన్‌తో కూడిన 48MP ప్రైమరీ కెమెరాతో సరికొత్త A16 బయోనిక్ చిప్‌సెట్.. శాటిలైట్, క్రాష్ డిటెక్షన్ ద్వారా ఎమర్జెన్సీ SOS ఆప్షన్ ఉన్నాయి.

* ఫీచర్లు ఇవే..

ఐఫోన్‌ 14 ప్రో (6.1-inch), ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌(6.7-inch) స్టెయిన్‌లెస్ స్టీల్, టెక్చర్డ్‌ మాట్టే గ్లాస్ డిజైన్‌తో రూపొందాయి. రెండు మోడల్స్‌ ప్రోమోషన్‌తో కూడిన కొత్త సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. iPhoneలో మొదటిసారిగా ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. కొత్త 1Hz రిఫ్రెష్ రేట్, మల్టిపుల్‌ పవర్‌ ఎఫిసియంట్‌ టెక్నాలజీలతో లాంచ్‌ అయింది. ఇది కొత్త లాక్ స్క్రీన్‌ను మరింత ఉపయోగకరంగా చేస్తుంది, సమయం, విడ్జెట్‌లు, లైవ్ యాక్టివిటీలను ఒక్క గ్లాన్స్‌లో చూసేలా అందుబాటులో ఉంచుతుంది.

ఇది కూడా చదవండి : వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారని డౌట్‌గా ఉందా..? ఈ టిప్స్‌తో తెలుసుకోండి..

* ఫోటోనిక్‌ ఇంజిన్‌తో కెమెరా సిస్టమ్‌

ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌లోని ప్రో కెమెరా సిస్టమ్ ఫోటోనిక్ ఇంజిన్‌తో వస్తుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ డీప్‌ ఇంటిగ్రేషన్‌ ద్వారా అన్ని కెమెరాలలో మిడ్‌ టూ లో లైట్‌ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రైమరీ కెమెరాలో 2x వరకు, అల్ట్రా వైడ్ కెమెరాలో 3x వరకు, టెలిఫోటో కెమెరాలో 2x వరకు, TrueDepth కెమెరాలో 2x వరకు ఉంటుంది. ప్రో లైనప్ కొత్త 48MP ప్రధాన కెమెరాను క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది.

అది క్యాప్చర్ చేసిన ఫోటోకు అనుగుణంగా ఉంటుంది, రెండవ తరం సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కలిగి ఉంది. చాలా ఫోటోల కోసం, క్వాడ్-పిక్సెల్ సెన్సార్ ప్రతి నాలుగు పిక్సెల్‌లను 2.44 µmకి సమానమైన ఒక పెద్ద క్వాడ్ పిక్సెల్‌గా మిళితం చేస్తుంది. దీని ఫలితంగా తక్కువ-కాంతి క్యాప్చర్ మెరుగ్గా ఉంటుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Apple iphone, Iphone 14, Tech news

ఉత్తమ కథలు