iPhone 14 Plus : సాధారణంగా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఆయా కంపెనీలు, స్టోర్‌లు, ఈకామర్స్ కంపెనీలు ఆఫర్‌లు ప్రకటిస్తాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక డీల్స్‌తో ముందుకొస్తాయి. ఈ క్రమంలో నూతన సంవత్సరం 2023 సందర్భంగా, అనేక బ్రాండ్లు, రిటైల్ దుకాణాలు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారంలు గాడ్జెట్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై ఆఫర్‌లను ప్రకటించాయి. అలాంటి ఒక అదిరిపోయే డీల్‌పై యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలోని ఇమాజిన్ స్టోర్‌లలో రూ.9,000 వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. మంచి డీల్‌పై ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని వెయిట్ చేస్తున్న వాళ్లు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు.
రూ.9 వేల డిస్కౌంట్
ఐఫోన్ 14 ప్లస్ 128GB, 256GB మోడల్‌లు వరుసగా రూ.89,900, రూ.99,900 ధరతో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు 128GB మోడల్‌ను రూ.3,000 స్టోర్ డిస్కౌంట్, HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ.5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఈ ఆఫర్‌ల వినియోగంతో ఫోన్ ధర రూ.81,900కి చేరుతుంది. అదే విధంగా 256GB వేరియంట్ రూ.4,000 ఇన్‌స్టంట్ స్టోర్ డిస్కౌంట్, రూ.5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ తర్వాత రూ.90,900కి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం రిటైలర్ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్లు
ఐఫోన్ 14 ప్లస్ ఐదు కలర్స్‌లో స్లీక్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం డిజైన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది A15 బయోనిక్ చిప్, iOS 16తో రన్ అవుతుంది. అంతేకాకుండా డివైజ్ థర్మల్ పెర్ఫార్మెన్స్ కోసం అప్‌టేడెట్ ఇంటర్నల్ డిజైన్‌తో వస్తుంది. సూపర్ రెటినా XDR OLED స్క్రీన్‌లు, 1200 nits పీక్ HDR బ్రైట్నెస్, డాల్బీ విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ రెండూ సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ ద్వారా కామన్ స్పిల్స్, నీటి యాక్సిడెంట్స్, డస్ట్ రెసిస్టెన్స్ పొందుతాయి.
2023లో జాంబీ వైరస్, యుగాంతం.. భవిష్యత్తు చెబుతున్న ఆధునిక నోస్ట్రడామస్
ఈ హ్యాండ్‌సెట్‌లో 12MP ప్రైమరీ లెన్స్ ఉంది, ఇందులో పెద్ద సెన్సార్, పెద్ద పిక్సెల్‌లు ఉన్నాయి. తక్కువ-లైట్‌లో కూడా f/1.9 అపర్చర్, కొత్త 12MP ఫ్రంట్ ట్రూడెప్త్ కెమెరా ద్వారా బెస్ట్ ఇమేజెస్‌ను అందిస్తుంది. యాపిల్ మృదువైన వీడియో కోసం కొత్త యాక్షన్ మోడ్ అందుబాటులో ఉంది. ఇది వీడియో క్యాప్చర్ చేసినప్పుడు షేక్స్, మోషన్, వైబ్రేషన్‌లను సర్దుబాటు చేస్తుంది. అదనంగా స్మార్ట్‌ఫోన్ సినిమాటిక్ మోడ్‌ను కలిగి ఉంది. దీని ద్వారా వినియోగదారులు 30 fps, 24 fps వద్ద 4K క్యాప్చర్ చేయవచ్చు.
ఈ వేరియంట్‌లోనే మొత్తం iPhone 14 లైనప్‌లో క్రాష్ డిటెక్షన్, శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOS ఉన్నాయి. iphoneలో ఈ క్రాష్ డిటెక్షన్ తీవ్రమైన కార్ క్రాష్‌ని గుర్తించి, అత్యవసర సేవలకు డయల్ చేస్తుంది. శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOS అనేది సెల్యులార్ కవరేజ్ వెలుపల ఉన్నప్పుడు కూడా మెసేజ్‌లను పంపడానికి శాటిలైట్‌తో కనెక్ట్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లలో 5G సపోర్ట్, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, రీడర్ మోడ్‌తో NFC వంటి ఆప్షన్‌లు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple iphone, Iphone, Iphone 14