హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ డేట్ ప్రకటించిన యాపిల్.. లాంచ్ ఈవెంట్ ప్రత్యేకతలు ఇవే..

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ డేట్ ప్రకటించిన యాపిల్.. లాంచ్ ఈవెంట్ ప్రత్యేకతలు ఇవే..

iPhone 14

iPhone 14

iPhone 14: ప్రతిష్టాత్మక యాపిల్ పార్క్ (Apple Park) నుంచి లైవ్ రికార్డింగ్ ప్లే అవుతుంది. ప్రతి ఒక్కరూ యాపిల్ ఈవెంట్ పేజీ నుంచి లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఐఫోన్లను విడుదల చేస్తుంటుంది. ఇప్పటికే ఐఫోన్ 13 సిరీస్‌ వరకు వివిధ రకాల ఫీచర్లతో ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ సంవత్సరం ఐఫోన్ 14 సిరీస్‌ను (iPhone 14 series) కంపెనీ లాంచ్ చేయనుంది. అయితే వీటి లాంచ్ డేట్‌ను తాజాగా ప్రకటించింది యాపిల్. 2022 సెప్టెంబర్ 7 బుధవారం నాడు ఐఫోన్ 14 లాంచింగ్ ఈవెంట్‌ను (iPhone 14 launch event) నిర్వహించనున్నట్లు ధ్రువీకరించింది. ఈ ఏడాది కూడా ఈవెంట్‌ను వర్చువల్‌ విధానంలోనే నిర్వహించనున్నారు.


ప్రతిష్టాత్మక యాపిల్ పార్క్ (Apple Park) నుంచి లైవ్ రికార్డింగ్ ప్లే అవుతుంది. ప్రతి ఒక్కరూ యాపిల్ ఈవెంట్ పేజీ నుంచి లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. లేదా యూట్యూబ్‌లోని యాపిల్ పేజీ నుంచి కూడా ఈవెంట్‌ను లైవ్‌లో చూడవచ్చు. యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 7న రాత్రి 10:30 నుంచి ప్రారంభమవుతుంది.


* లాంచ్ ఈవెంట్‌లో ఏమేం ఆశించవచ్చు?
యాపిల్ కొత్త ఐఫోన్ 14 లైనప్‌లో నాలుగు మోడళ్లు ఉంటాయి. ఐఫోన్ 14 సిరీస్‌తో ఉన్న నాలుగు మోడళ్ల పేర్లు.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్. ఈ సంవత్సరం ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్ డివైజ్‌లలో మాత్రమే కొత్త యాపిల్ A16 బయోనిక్ చిప్‌ ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ డివైజ్‌లు మాత్రం గత ఏడాది వచ్చిన యాపిల్ A15 బయోనిక్ చిప్ ట్వీక్డ్ వెర్షన్‌తో రావచ్చని తెలుస్తోంది.* ఇతర ప్రొడక్ట్స్

ఇదే లాంచ్ ఈవెంట్‌లో మూడు కొత్త ఐప్యాడ్ మోడళ్లను కూడా కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది. వీటితో పాటు కొత్త యాపిల్ వాచ్ సిరీస్ 8ను కూడా లాంచ్ చేయవచ్చు. ఈ సంవత్సరం ఈ లైనప్‌లో కొత్త ప్రో వేరియంట్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. తాజా ఐప్యాడ్ లైనప్ సరికొత్త 10వ ఐప్యాడ్‌ను కలిగి ఉంటుంది.


ఇది కూడా చదవండి : స్వాతంత్ర్య పోరాటం గురించి తెలిపే మొబైల్ గేమ్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం


ఇది ఈ సిరీస్‌లో అత్యంత సరసమైనదిగా వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు కొత్త M2-పవర్డ్ ఐప్యాడ్ ప్రో వెర్షన్‌ కూడా లాంచ్ కావచ్చు. ఈ ఈవెంట్‌లో iOS 16, watchOS 8, iPadOS 16 వెర్షన్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌ గురించి యాపిల్ మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇలా మొత్తం ఏడు కొత్త ప్రొడక్ట్స్‌ను యాపిల్ లాంచ్ చేయనుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple iphone, Iphone 14, Tech news

ఉత్తమ కథలు