Apple iPhone 13: టెక్ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన యాపిల్.. ఎవరూ ఊహించి ఉండరు..

ప్రతీకాత్మక చిత్రం

Apple Iphone13: ఐఫోన్ 13 సిరీస్ విడుదల తరువాత ఐఫోన్ 12 సిరీస్ ధరలను సంస్థ తగ్గించింది. వేరియంట్ల వారీగా ఈ రెండు సిరీస్‌లను పోలిస్తే.. ధరల్లో రూ.10 వేల నుంచి రూ.14 వేల వ్యత్యాసం ఉంది.

  • Share this:
ఇటీవల జరిగిన యాపిల్ ఈవెంట్‌లో ఆ  సంస్థ ఐఫోన్ 13 (Apple iPhone13) సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఎప్పుడూ లేనట్లు, ఈసారి ముందుగానే వీటిని భారత్‌లో ప్రీఆర్డర్లకు, అమ్మకానికి అందుబాటులో ఉంచి.. టెక్ ప్రియుకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లను యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో సెప్టెంబర్ 17 సాయంత్రం 5:30 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 24 నుంచి వీటి సేల్స్ ప్రారంభమవుతాయి. అయితే యాపిల్ సంస్థ మొదటిసారి కొత్త ఐఫోన్‌ సిరీస్‌లను.. మొదటి దశలోనే భారత్‌లో అందుబాటులోకి తీసుకురావడం విశేషం.

యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు.. యూఎస్‌తో సహా ఇతర మార్కెట్ల మాదిరిగా మొదటి దశలోనే భారతదేశంలో అమ్మకానికి వస్తున్నాయి. ఈసారి ఐఫోన్ 13 సిరీస్ ప్రీఆర్డర్, సేల్స్.. భారత్‌, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, జర్మనీ, జపాన్‌ సహా 30 దేశాల్లో మొదటి దశలోనే అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు కస్టమర్లు ఇప్పటికీ ఐఫోన్ 12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను సైతం కొనుగోలు చేయవచ్చు.

WhatsApp: వాట్సప్ యూజర్లకు కొత్త ఫీచర్ వచ్చేసింది... మీరూ వాడుకోవచ్చు

* ధరలు మార్చకపోవడం ఆశ్చర్యం
ఈసారి సిరీస్‌లోని డివైజ్‌ల ధరలను సైతం యాపిల్ స్థిరంగా ఉంచింది. ఈ నిర్ణయం టెక్ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల ధరలు.. గత సంవత్సరం విడుదలైన ఐఫోన్ 12 సిరీస్ డివైజ్‌ల మాదిరిగానే ఉన్నాయి. వీటి ధరలు రూ. 69,900 నుంచి ప్రారంభమవుతున్నాయి. కొత్త సిరీస్ రాకతో ఐఫోన్ 12 సిరీస్ ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే ఐఫోన్‌ 13 సిరీస్ ధరల విషయంలో వార్షిక ద్రవ్యోల్బణాన్ని ఈసారి యాపిల్ పరిగణనలోకి తీసుకోలేదు. ఇది మరో విశేషం. అన్ని ఐఫోన్‌లలో ఎంట్రీ-స్పెక్ స్టోరేజ్ సామర్ధ్యాన్ని పెంచినప్పటికీ, ధరలు మాత్రం స్థిరంగా ఉండటం గమనార్హం.

Ola S1: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సంచలనం... ఒక్క రోజులో రూ.600 కోట్ల అమ్మకాలు

* ధరలు ఎలా ఉన్నాయి?

ఐఫోన్ 13 మినీ 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 69,900గా ఉంది. ఇది ఎంట్రీ-స్పెక్ వేరియంట్. 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .79,900 కాగా 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.99,900గా ఉంది.

ఐఫోన్ 13 128GB వేరియంట్ ధర రూ. 79,900 నుంచి ప్రారంభమవుతుంది. 256GB వేరియంట్ ధర రూ .89,900 కాగా 512GB వేరియంట్ ధర రూ .1,09,900.

Best 5G Smartphones: 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.25,000 లోపు బెస్ట్​ మోడల్స్

ఐఫోన్ 13 ప్రో 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ .1,19,900. 256GB వేరియంట్ ధర రూ .1,29,900 కాగా 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .1,49,900.

ఈ లైనప్‌లో అతిపెద్ద, టాప్-స్పెక్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్. దీని ధరలు రూ .1,29,900 (128GB), రూ .1,39,900 (256GB), రూ .1,59,900 (512GB), రూ .1,79,900 (1TB)గా ఉన్నాయి.

Realme C25Y: తక్కువ ధరకే 50 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్...

అయితే ఐఫోన్ 13 సిరీస్ విడుదల తరువాత ఐఫోన్ 12 సిరీస్ ధరలను సంస్థ తగ్గించింది. వేరియంట్ల వారీగా ఈ రెండు సిరీస్‌లను పోలిస్తే.. ధరల్లో రూ.10 వేల నుంచి రూ.14 వేల వ్యత్యాసం ఉంది.
Published by:Shiva Kumar Addula
First published: