Home /News /technology /

APPLE IPHONE 13 EXCHANGE OFFER ON AMAZON FLIPKART HOW TO BUY IPHONE 13 FOR AS LOW AS RS 56 490 HERE DETAILS NS GH

iPhone 13: ఐఫోన్ 13పై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్.. రూ.56,490కే సొంతం చేసుకునే అవకాశం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్‌ (Apple) లవర్స్‌కు గుడ్ న్యూస్. యాపిల్ ఐఫోన్ 13 (Apple Iphone13) ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి స్పెషల్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లను వినియోగించుకుంటే భారీ తగ్గింపుతో ఐఫోన్‌ 13ను సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు చూద్దాం.

ఇంకా చదవండి ...
యాపిల్‌ (Apple) లవర్స్‌కు గుడ్ న్యూస్. యాపిల్ ఐఫోన్ 13ను (Apple iPhone 13) కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి స్పెషల్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లను వినియోగించుకుంటే భారీ తగ్గింపుతో ఐఫోన్‌ 13ను సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు చూద్దాం. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్‌(Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో యాపిల్ ఐఫోన్‌ 13 (Apple iPhone 13) చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంచాయి. ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లతో సహా భారీ డిస్కౌంట్‌తో ఈ ఐఫోన్ లభిస్తోంది. యాపిల్‌ ఐఫోన్ 13 ప్రస్తుతం అమెజాన్‌లో రూ.72,990కి అందుబాటులో ఉంది. యాపిల్‌ ఐఫోన్ 13 అసలు ధర మాత్రం రూ.79,900గా ఉంది. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో iPhone 13పై ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ డిస్కౌంట్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.

యాపిల్‌ ఐఫోన్ 13పై అమెజాన్ 9 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతో స్మార్ట్‌ఫోన్ ధర రూ.72,990కి తగ్గుతుంది. కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) బ్యాంక్ కార్డ్‌లు లేదా ఈఎంఐ(EMI) లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.4,000 వరకు బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీంతో అమెజాన్‌లో యాపిల్‌ ఐఫోన్ 13 ధర రూ.68,990కి తగ్గుతుంది. పైగా అమెజాన్‌లో ఐఫోన్ 13పై రూ.12,550 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. దీన్ని ఉపయోగించుకుంటే బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 13 ధర రూ.56,490కి తగ్గుతుంది.
Flipkart Best Offer: ఫ్లిప్ కార్ట్ లో సీజన్ ఎండ్ సేల్.. ఈ 24 వేల Xiaomi 5G ఫోన్ కేవలం రూ.8 వేలకే.. ఇలా కొనేయండి

వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 ధర రూ.72,999గా ఉంది. ఐఫోన్ 13పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.15,500 తగ్గింపును పొందే అవకాశం ఉంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ను వినియోగించుకుంటే ఐఫోన్ 13 ధర రూ.57,499కి తగ్గుతుంది. న్యూ జనరేషన్‌ ఐఫోన్ మోడల్‌పై ఇది సూపర్ డీల్‌గా పేర్కొంటున్నారు.
Smart TV Offer: రూ.20 వేలకే 4K HDR ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ... ఆఫర్ వివరాలు తెలుసుకోండి


ఇంతకుముందు యాపిల్‌ రీసెల్లర్ ఇండియా ఐస్టోర్‌(iStore)లో ఇదే విధమైన ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్‌లకు క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. భారతదేశంలో iStore, వెనిలా iPhone 13పై రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. దీని వాస్తవ ధర రూ.79,900 కాగా, రూ.74,900కి తగ్గుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారులకు రూ.4,000 క్యాష్‌బ్యాక్ ఉంది. ఇది ఐఫోన్‌ 13 ధరను రూ.70,900కి తీసుకువస్తుంది. దానితో పాటు ఒక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీంతో యాపిల్‌ రీసెల్లర్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇక్కడ పాత స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించి ధరను మరింత తగ్గించుకోవచ్చు. India iStore వెబ్‌సైట్‌లో మంచి కండిషన్‌లో ఉన్న iPhone XRపై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ రూ.18,000 పొందవచ్చు. దీంతో ఐఫోన్ 13 ధర రూ.52,900కు తగ్గుతుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Amazon, Apple iphone, Flipkart, Iphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు