Home /News /technology /

Re-sale Phone Value: రెండేళ్లలో స్మార్ట్‌ఫోన్ అమ్మాలా? ఏ బ్రాండ్ వాల్యూ తగ్గదో తెలుసుకోండి

Re-sale Phone Value: రెండేళ్లలో స్మార్ట్‌ఫోన్ అమ్మాలా? ఏ బ్రాండ్ వాల్యూ తగ్గదో తెలుసుకోండి

Re-sale Phone Value: రెండేళ్లలో స్మార్ట్‌ఫోన్ అమ్మాలా? ఏ బ్రాండ్ వాల్యూ తగ్గదో తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Re-sale Phone Value: రెండేళ్లలో స్మార్ట్‌ఫోన్ అమ్మాలా? ఏ బ్రాండ్ వాల్యూ తగ్గదో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Re-sale Phone Value | మీరు ఇప్పుడు ఓ స్మార్ట్‌ఫోన్ కొని రెండేళ్లలో అమ్మాలనుకుంటున్నారా? స్మార్ట్‌ఫోన్ రీసేల్ (Smartphone Resale) వ్యాల్యూ ఎక్కువ ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఏ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటే రీసేల్ వ్యాల్యూ ఎక్కువ వస్తుందో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
సాధారణంగా మనం మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి దాన్ని కొద్ది నెలల వ్యవధిలోనే అమ్మదలుచుకుంటే దాని ధర సగానికి సగం పలుకుతుంది. అదే సంవత్సరం లేదా రెండు సంవత్సరాల తర్వాత విక్రయించాలి (Smartphone Resale) అనుకుంటే అసలైన ధరలో 30 శాతం కంటే ఎక్కువ ధర పొందే అవకాశమే ఉండదు. పాతవి అవుతున్న కొద్దీ పరికరాల తరుగుదల, ఫోన్ పర్ఫామెన్స్ తగ్గిపోవడం, ఓఎస్ ఓల్డ్ అయిపోవడం వంటి కారణాల వల్ల స్మార్ట్‌ఫోన్‌ల వ్యాల్యూ విపరీతంగా పడిపోతుంది. అయితే ఐఫోన్ 12 ప్రో (iPhone 12 Pro) స్మార్ట్‌ఫోన్‌ల వాల్యూ మాత్రం ఆరు నెలల తర్వాత కూడా 32 శాతం కంటే తగ్గదని యూకే ఆధారిత రిపోర్టు వెల్లడించింది. విడుదలైన ఆరు నెలల్లో వాటి విలువను అధికంగా నిలుపుకోగల అన్ని ఫోన్లలో కెల్లా ఐఫోన్ 12 ప్రో మోడల్ నంబర్ 1 ఫోన్‌గా నిలుస్తోందని నివేదిక పేర్కొంది. యూకే ఆన్‌లైన్ రిఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్స్ రీటైలర్ సంస్థ మ్యూజిక్‌‌మ్యాగ్‌పై (musicMagpie) ఈ నివేదికను రూపొందించింది.

IRCTC-Truecaller: ట్రూకాలర్‌తో IRCTC ఒప్పందం... ఇక రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కి కాల్ చేస్తే...

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10(Samsung Galaxy Note 10) రిలీజైన మొదటి ఆరు నెలల్లో దాని విలువలో 50 శాతానికి పైగా కోల్పోయిందని నివేదిక తెలిపింది. అంటే రూ. 1,00,000కి శాంసంగ్ ఫోన్‌ని కొనుగోలు చేస్తే.. ఆరు నెలల తర్వాత దాని విలువ రూ.50,000 కంటే తక్కువకే పడిపోతుంది. మ్యూజిక్‌‌మ్యాగ్‌పై నివేదిక 5జీ యాపిల్, శాంసంగ్ ఫోన్‌లను కూడా పోల్చింది. 5జీ సపోర్ట్‌తో వచ్చే ఐఫోన్ 12 సిరీస్.. 5జీ శాంసంగ్ ఫోన్‌ల కంటే ఎక్కువ విలువను కలిగి ఉందని మ్యూజిక్‌‌మ్యాగ్‌పై సంస్థ నివేదించింది. యాపిల్ 5జీ-ఎనేబుల్డ్ మోడల్‌లు విడుదలైన ఆరు నెలల తరువాత సగటున వాటి విలువలో కేవలం 38 శాతాన్ని కోల్పోతాయి. శాంసంగ్ 5జీ-ఎనేబుల్డ్ మోడల్‌లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇది 62 శాతం విలువ కోల్పోతుందని నివేదిక తెలిపింది.

Diwali Gifts: దీపావళి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? బెస్ట్ 20 స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

ఐఫోన్‌లు విడుదలైన 12 నెలల్లో సగటున వాటి విలువలో 41 శాతం.. 24 నెలల స్టాండర్డ్ కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసే సమయానికి 60 శాతం కోల్పోతాయని నివేదిక వివరించింది. శాంసంగ్ ఫోన్‌లు, లాంచ్ అయిన 12 నెలల్లో వాటి విలువలో 64 శాతం కోల్పోతాయని.. ఇది 24 నెలల తర్వాత 77 శాతానికి పెరుగుతుందని వార్షిక ఫోన్ తరుగుదల నివేదిక 2021(Annual Phone Depreciation Report 2021) తెలిపింది. ఈ నివేదిక యాపిల్, శాంసంగ్ మాత్రమే కాకుండా గూగుల్, వన్‌ప్లస్‌, హువావే ఫోన్‌ల వ్యాల్యూని కూడా లెక్కించింది. కొనుగోలు చేసి అమ్మడం (ట్రేడ్-ఇన్‌) ద్వారా వినియోగదారులు సాధారణంగా ఎంత డబ్బు కోల్పోతారో ఈ నివేదిక చక్కగా వివరించింది.

Jio eSIM: ఆ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? జియో ఇ-సిమ్ ఎలా పొందాలంటే

వన్‌ప్లస్‌ ఫోన్‌ల విషయానికొస్తే.. వన్‌ప్లస్‌ ఫోన్‌లు 24 నెలల తర్వాత సగటున 78 శాతం.. గూగుల్ పిక్సెల్ ఫోన్‌లు విడుదలైన 24 నెలల్లో సగటున 83 శాతం కోల్పోతాయని నివేదిక పేర్కొంది. యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్‌, గూగుల్ ఫోన్‌లతో పోలిస్తే హువావే స్మార్ట్‌ఫోన్‌ల ధరలు అత్యంత వేగంగా పడిపోతాయని నివేదిక పేర్కొంది. అంతేకాదు, ఐఫోన్‌లు విడుదలైన 12 నెలల తర్వాత అతి తక్కువ విలువను కోల్పోతాయని.. ఆ జాబితాలో ఐఫోన్ 11 నుంచి ఐఫోన్ 7 వరకు ఉన్నాయని తెలిపింది. అయితే హువావే మేట్ 30 ప్రో, హువావే P20, వన్‌ప్లస్‌ 8, శాంసంగ్ ఫ్లిప్, వన్‌ప్లస్‌ 8 ప్రో విడుదలైన 12 నెలల తర్వాత వాటి విలువలను అత్యధికంగా కోల్పోతున్నట్లు నివేదిక తెలిపింది.

WhatsApp: అలర్ట్... ఈరోజు నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదు

12 నెలల్లో వాటి విలువలో అత్యధికంగా వ్యాల్యూ నిలుపుకున్న 10 ఫోన్‌లలో అన్నీ ఐఫోన్‌లే ఉన్నాయని.. వాటిని అప్‌గ్రేడ్ చేయడానికి ప్రతి సంవత్సరం తమ యజమానులకు అవి మంచి పెట్టుబడిగా మారుతున్నాయని నివేదిక జోడించింది. తదుపరి ఉత్తమ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్‌ 7టీ అని.. ఇది అమ్మకానికి వచ్చిన మొదటి 12 నెలల తర్వాత 50 విలువ కోల్పోతుందని నివేదిక తెలిపింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు