Home /News /technology /

APPLE IPHONE 12 PRICE LEAKED HERE IS HOW MUCH THE NEW IPHONES COULD COST BA

Apple iPhone 12 | ఆపిల్ ఐఫోన్ 12 రేట్లు లీక్... కెమెరా ఫీచర్లు కూడా..

(image: Apple)

(image: Apple)

Apple iPhone 12 price | . నిన్న మొన్నటి వరకు iPhone SE2020 కి సంబంధించిన లీకులు, చర్చలు నడిచాయి. ఇప్పుడు iPhone 12కి సంబంధించిన ధరలు లీక్ అవుతున్నాయి.

    Apple iPhone 12 ధరలు లీక్ అయినట్టు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు iPhone SE2020 కి సంబంధించిన లీకులు, చర్చలు నడిచాయి. ఇప్పుడు iPhone 12కి సంబంధించిన ధరలు లీక్ అవుతున్నాయి. ధరతో పాటు iPhone 12లో కెమెరా డిటెయిల్స్ కూడా లీక్ అవుతున్నాయి. iPhone 12 ఈ ఏడాది చివర్లో లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం లీక్ అయిన వివరాల ప్రకారం iPhone 12 ఎంట్రీ లెవల్ ఫోన్ ధర 649 డాలర్లు (భారత కరెన్సీలో రూ.49,100) ఉంటుందని అంచనా. ఇందులో D52G, 5.4 అంగుళాల OLED డిస్‌ప్లే, వెనుక వైపు రెండు కెమెరాలు ఉండొచ్చని యూట్యూబర్ జాన్ ప్రొసెర్ తెలిపారు. iPhone 12 5జీ సపోర్టివ్‌గా ఉంటుందని తెలిపారు. దీంతోపాటు మరో రెండు iPhone 12 మోడల్స్‌ 6.1 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటాయని చెప్పారు. అందులో ఒకటి నాన్ ప్రో వేరియంట్‌లో ఉంటుంది. దీనికి కూడా వెనుక వైపు రెండు కెమెరాలు, 5జీ సపోర్ట్ ఉంటుందని, దీని ధర 749 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.56,500) ఉంటుంది. iPhone డిస్ ప్లేను LCD నుంచి OLEDకి అప్ గ్రేడ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇక ‘ప్రో’ మోడల్స్‌కు వస్తే అందులో రెండు రకాలు ఉంటాయి. 6.1 అంగుళాలు ఉండే ఒక దాని ధర రూ.75300, 6.7 అంగుళాలు ఉండే మరోదాని ధర రూ.82,900 ఉంటుందని ప్రొసెర్ తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Apple, Iphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు