ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో iPhone 12 సేల్... ప్రీఆర్డర్స్ ఎప్పట్నుంచంటే

iPhone 12 | మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి కొత్త ఆపిల్ ఐఫోన్ను తీసుకోవాలనుకుంటే మీకు ట్రేడ్-ఇన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. మీ పాత స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా మీకు రూ. 22,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

news18-telugu
Updated: October 23, 2020, 6:03 PM IST
ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో iPhone 12 సేల్... ప్రీఆర్డర్స్ ఎప్పట్నుంచంటే
ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో iPhone 12 సేల్... ప్రీఆర్డర్స్ ఎప్పట్నుంచంటే
  • Share this:
ఆపిల్ సంస్థ ఇటీవలే ఐఫోన్12 సిరీస్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఐఫోన్ 12 యొక్క అన్ని కలర్ మరియు స్టోరేజ్ వేరియంట్లను ఆపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్లో ప్రీఆర్డర్ కోసం సిద్ధంగా ఉంచింది ఆపిల్ సంస్థ. ఆపిల్ ఇటీవల తన ఐఫోన్ సిరీస్ లైనప్‌లో నాలుగు -నూతన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఇందులో ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో మరియు ఐఫోన్ 12 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. కాగా ఈ ప్రీఆర్డర్లు మరియు డెలివరీలు అక్టోబర్ 31 నుండి ప్రారంభమవుతాయని ఆపిల్ పేర్కొంది. ఐఫోన్ 12 సరీస్ 64GB, 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లతో పాటు బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్ మరియు రెడ్ కలర్ వేరియంట్లతో అందుబాటులో ఉంటుంది. 64 జీబీ వేరియంట్ రూ .79,900లకు, 128 జీబీ రూ .84,900లకు, 256 జీబీ రూ. 94,900లకు కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్లో ప్రీఆర్డర్ చేసిన బ్లాక్, గ్రీన్ మరియు రెడ్ కలర్ వేరియంట్ల డెలివరీ అక్టోబర్ 31 నుంచి, వైట్ కలర్ వేరియంట్ డెలివరీ నవంబర్ 3 నుంచి, బ్లూ కలర్ షిప్స్ నవంబర్ 6 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. అయితే, ఆపిల్ ఐఫోన్ 12 మినీ మరియు ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ప్రీఆర్డర్లు మాత్రం నవంబర్ 6న ప్రారంభమవుతాయి. వీటి డెలివరీ నవంబర్ 13న ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

iQoo U1x: రూ.10,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన ఐకూ

WhatsApp: వాట్సప్ యూజర్లకు అద్భుతమైన ఫీచర్... ఇక ఆ టెన్షన్ ఉండదు

ఆపిల్‌కేర్ ప్లస్ కవరేజీతో డ్యామేజ్ ప్రొటక్షన్


మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి కొత్త ఆపిల్ ఐఫోన్ను తీసుకోవాలనుకుంటే మీకు ట్రేడ్-ఇన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. మీ పాత స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా మీకు రూ. 22,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఆ డిస్కౌంట్ ధర మీరు ఎక్స్చేంజ్ చేసే స్మార్ట్ఫోన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ట్రేడ్ ఇన్ ఆప్షన్ ద్వారా మీరు ఏ స్మార్ట్‌ఫోన్ను అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని ఆపిల్ తెలిపింది. ఆపిల్ సంస్థ ఐఫోన్ ప్రొటెక్షన్ కోసం ఆపిల్‌కేర్ ప్లస్ కవరేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ కింద ఐఫోన్ 12 కొనుగోలు చేసిన తేదీ నుండి రెండు సంవత్సరాల వరకు వారంటీ ఎక్స్టెన్షన్ సదుపాయం ఉంటుంది. ఈ ప్యాకేజీతో యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటక్షన్, బ్యాటరీ కవరేజ్ వంటివి లభిస్తాయి. కాగా, ఆపిల్‌కేర్ ప్లస్ ప్యాకేజీ రూ.16,900లకు అందుబాటులో ఉంటుంది.

OPPO A33 2020: ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ33 స్మార్ట్‌ఫోన్... ధర ఎంతంటే

JioPages Web Browser: అదిరిపోయే ఫీచర్స్‌తో జియోపేజెస్ బ్రౌజర్... డౌన్‌లోడ్ చేయండిలా

కోవిడ్–19 కారణంగా నో క్యాష్ ఆన్ డెలివరీ


ఐఫోన్–12 సిరీస్ కోసం విస్తృతమైన చెల్లింపు మరియు ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు, కార్డ్ ఆన్ డెలివరీ మరియు రూపే కార్డుల కోసం ఈఎంఐ ఆప్షన్లు ఇవ్వబడతాయి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా కాంటాక్ట్‌లెస్ డెలివరీకి అనుగుణంగా ఆపిల్ క్యాష్ ఆన్ డెలివరీ సుదుపాయాన్ని ఇవ్వడం లేదు. ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఉన్న అన్ని ఆర్డర్‌లు కాంటాక్ట్‌లెస్ డెలివరీతో డెలివరీ చేయబడతాయని ఆపిల్ సంస్థ స్పష్టం చేసింది. కాగా, ఐఫోన్ 12 డెలివరీ భారతదేశం అంతటా అందుబాటులో ఉంటుందని ఆపిల్ పేర్కొంది. ఐఫోన్ 12 సిరీస్ వేరియంట్ల గురించి మీకు ఏమైనా సందేహాలుంటే ఐఫోన్ స్పెషలిస్ట్‌తో చాట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఆపిల్ స్పెషలిస్టులతో సంభాషించి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: October 23, 2020, 6:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading