Apple iPhone 11: రిలీజ్‌కు ముందే లీకైన యాపిల్ ఐఫోన్ 11 ఫీచర్లు

Apple iPhone 11 Series | యాపిల్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం లేటెస్ట్ ఫోన్లల్లో Wi-Fi 6 స్టాండర్డ్ కంపాటబిలిటీ ఉంటుంది. టాప్ ఎండ్ 2 ఫోన్ల ఓలెడ్ ప్యానెల్స్‌ యాపిల్ పెన్సిల్ సపోర్ట్ చేస్తాయి.

news18-telugu
Updated: August 31, 2019, 5:51 PM IST
Apple iPhone 11: రిలీజ్‌కు ముందే లీకైన యాపిల్ ఐఫోన్ 11 ఫీచర్లు
Apple iPhone 11: రిలీజ్‌కు ముందే లీకైన యాపిల్ ఐఫోన్ 11 ఫీచర్లు
news18-telugu
Updated: August 31, 2019, 5:51 PM IST
యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు యాపిల్ పార్క్ హెడ్‌క్వార్టర్స్‌లో సెప్టెంబర్ 10న జరిగే ఈవెంట్‌లో రిలీజ్ కానున్నాయి. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 మ్యాక్స్ ఫోన్లు రిలీజ్ కావొచ్చని అంతా అంచనా వేస్తున్నారు. యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ స్పెసిఫికేషన్స్ అలా ఉంటాయి, ఇలా ఉంటాయని అని స్మార్ట్‌ఫోన్ యూజర్లు చర్చించుకుంటుండగానే... రిలీజ్‌కు ముందే ఆ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. చైనాకు చెందిన MyDrivers వెబ్‌సైట్ యాపిల్ ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్స్‌ని లీక్ చేశాయి. యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ఫోటోలను పోస్ట్ చేశాయి. దీంతో ఈ ఫోటోలు, వివరాలు వైరల్‌గా మారాయి. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 మ్యాక్స్ స్మార్ట్‌‌ఫోన్ల ఫీచర్లు ఇలా ఉన్నాయి.





యాపిల్ ఐఫోన్ 11 స్పెసిఫికేషన్స్
Loading...
డిస్‌ప్లే: 6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 3డీ టచ్ ఫార్మాట్
ఇంటర్నల్ స్టోరేజ్: 512జీబీ
ప్రాసెసర్: ఏ13 ప్రాసెసర్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,110 ఎంఏహెచ్
ధర: సుమారు రూ.53,700

యాపిల్ ఐఫోన్ 11 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.8 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 512జీబీ
ప్రాసెసర్: ఏ13 ప్రాసెసర్
రియర్ కెమెరా: 12+12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,190 ఎంఏహెచ్
ధర: సుమారు రూ.71,000

యాపిల్ ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే
ఇంటర్నల్ స్టోరేజ్: 512జీబీ
ప్రాసెసర్: ఏ13 ప్రాసెసర్
రియర్ కెమెరా: 12+12+12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,500ఎంఏహెచ్
ధర: సుమారు రూ.78,800

యాపిల్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం లేటెస్ట్ ఫోన్లల్లో Wi-Fi 6 స్టాండర్డ్ కంపాటబిలిటీ ఉంటుంది. టాప్ ఎండ్ 2 ఫోన్ల ఓలెడ్ ప్యానెల్స్‌ యాపిల్ పెన్సిల్ సపోర్ట్ చేస్తాయి. మరి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన స్పెసిఫికేషన్స్ నిజమేనా? కాదా అన్న విషయం తెలియాలంటే సెప్టెంబర్ 10 వరకు ఆగాల్సిందే.

Revolt: మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

WhatsApp Features: ఈ 4 ఫీచర్లు వస్తే మీ వాట్సప్ అదిరిపోవడం ఖాయం

DEET App: నిరుద్యోగులకు వరంగా డీట్ యాప్... 1,00,000 దాటిన డౌన్‌లోడ్స్

August Smartphones: ఆగస్ట్‌లో రిలీజైన 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... ఫీచర్స్ తెలుసుకోండి
First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...