APPLE IPHONE 11 SERIES SMARTPHONES SPECIFICATIONS AND PRICE DETAILS LEAKED IN ONLINE AHEAD OF LAUNCH SS
Apple iPhone 11: రిలీజ్‌కు ముందే లీకైన యాపిల్ ఐఫోన్ 11 ఫీచర్లు
Apple iPhone 11: రిలీజ్‌కు ముందే లీకైన యాపిల్ ఐఫోన్ 11 ఫీచర్లు
Apple iPhone 11 Series | యాపిల్ వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం లేటెస్ట్ ఫోన్లల్లో Wi-Fi 6 స్టాండర్డ్ కంపాటబిలిటీ ఉంటుంది. టాప్ ఎండ్ 2 ఫోన్ల ఓలెడ్ ప్యానెల్స్ యాపిల్ పెన్సిల్ సపోర్ట్ చేస్తాయి.
యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్లు యాపిల్ పార్క్ హెడ్‌క్వార్టర్స్‌లో సెప్టెంబర్ 10న జరిగే ఈవెంట్లో రిలీజ్ కానున్నాయి. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 మ్యాక్స్ ఫోన్లు రిలీజ్ కావొచ్చని అంతా అంచనా వేస్తున్నారు. యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ స్పెసిఫికేషన్స్ అలా ఉంటాయి, ఇలా ఉంటాయని అని స్మార్ట్‌ఫోన్ యూజర్లు చర్చించుకుంటుండగానే... రిలీజ్‌కు ముందే ఆ ఫోన్ ఫీచర్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. చైనాకు చెందిన MyDrivers వెబ్సైట్ యాపిల్ ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్స్‌ని లీక్ చేశాయి. యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్ల ఫోటోలను పోస్ట్ చేశాయి. దీంతో ఈ ఫోటోలు, వివరాలు వైరల్‌గా మారాయి. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 మ్యాక్స్ స్మార్ట్ఫోన్ల ఫీచర్లు ఇలా ఉన్నాయి.
This is the new iPhones, if case makers are right about Apple logo placement.
If you think that this looks wrong, trust me, this is just a matter of habit. pic.twitter.com/5ekqZWfsox
యాపిల్ వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం లేటెస్ట్ ఫోన్లల్లో Wi-Fi 6 స్టాండర్డ్ కంపాటబిలిటీ ఉంటుంది. టాప్ ఎండ్ 2 ఫోన్ల ఓలెడ్ ప్యానెల్స్ యాపిల్ పెన్సిల్ సపోర్ట్ చేస్తాయి. మరి ఆన్లైన్లో వైరల్‌గా మారిన స్పెసిఫికేషన్స్ నిజమేనా? కాదా అన్న విషయం తెలియాలంటే సెప్టెంబర్ 10 వరకు ఆగాల్సిందే.
Revolt: మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.