హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

భారత్ లో iPhoneల ఉత్పత్తిని పెంచనున్న Apple.. ఇక చైనాకు గుడ్ బై చెప్పినట్లేనా?

భారత్ లో iPhoneల ఉత్పత్తిని పెంచనున్న Apple.. ఇక చైనాకు గుడ్ బై చెప్పినట్లేనా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా చైనాలో తమ ఐఫోన్ తయారీ యూనిట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా చైనాలో తమ ఐఫోన్ తయారీ యూనిట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే తరుణంలో ఐఫోన్ల వినియోగంలో పెద్ద మార్కెట్ గా ఉన్న భారత్లో ఉత్పత్తి పెంచడంపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది. ఐఫోన్ 12 ఉత్పత్తితో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మధ్యలో కర్ణాటకలో ఐఫోన్ 12 ఉత్పత్తిని ప్రారంభించి, ఐఫోన్ మోడళ్ల ఉత్పత్తిని వేగవంతం చేయాలని భావిస్తుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆపిల్ తన ఎయిర్‌పాడ్స్ మోడళ్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. ఈ త్రైమాసికంలోనే భారత్లో ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని ప్రారంభించాలని తలపెట్టింది. భారతదేశంతో పాటు వియత్నాంలో కూడా ఐఫోన్, ఐప్యాడ్ లైనప్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆగ్నేసియాలో స్మార్ట్ స్పీకర్లు, హెడ్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తిని కూడా పెంచనున్నట్లు ఆపిల్ తన నివేదికలో పేర్కొంది.

భారతదేశంలో ఐఫోన్ల ఉత్పత్తి వేగవంతం..

తమ ఉత్పత్తుల తయారీలో చైనాపై ఆధారపడాన్ని తగ్గించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ఆపిల్ సంస్థ.. తాజాగా, ఆపిల్ ఐప్యాడ్ తయారీని చైనా నుంచి వియత్నాంకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు వియత్నాంలో రూ. 9,900 విలువ చేసే హోమ్‌ పాడ్ మినీ ఉత్పత్తిని విస్తరించేందుకు కంపెనీ తన సప్లయర్స్ ను సమీకరిస్తున్నట్లు రిపోర్టులో పేర్కొంది. కాగా, గత ఏడాది చివరలో ఆపిల్ తన సప్లయర్ అయిన ఫాక్స్కాన్ వియత్నాం దేశంలో 270 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,969 కోట్లు) పెట్టుబడి పెట్టింది.

ఈ సంస్థ ఇప్పటికే ఎయిర్‌పాడ్స్‌ సప్లయర్ గా ఉంది. కాగా, ఈ మధ్యకాలంలో, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, దాని ఉత్పత్తిని విస్తృతం చేయడానికి ఆపిల్ అనేక చర్యలు తీసుకుంది. కంపెనీ గత ఏడాది జూలైలో భారతదేశంలో ఐఫోన్ 11 తయారీని ప్రారంభించింది. భారత్లో ఐఫోన్ సప్లయర్ అయిన విస్ట్రాన్ ఇప్పటికే ఐఫోన్ SE (2020) తయారీని ప్రారంభించినట్లు రిపోర్టు స్పష్టం చేసింది. విస్ట్రాన్‌తో పాటు, ఫాక్స్‌కాన్, పెగాట్రాన్లు ప్రస్తుతం- ఆపిల్ పరికరాల కీలక సప్లయర్స్గా ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా ఐఫోన్‌ను భారత మార్కెట్లో ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపించాయి. ఈ మూడు సప్లయర్లు కలిసి భారత్లో ఐఫోన్ల తయారీని వేగవంతం చేయనున్నాయి.

First published:

Tags: Apple, India, India-China, Iphone

ఉత్తమ కథలు