Quran App: అక్కడి ముస్లింలకు బిగ్​ షాక్​.. ఖురాన్ యాప్‌ను తొలగించిన యాపిల్

ప్రతీకాత్మక చిత్రం

Quran app banned in China: ఇస్లాం మతాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా గుర్తించింది. అయినా చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ముఖ్యంగా చైనాలోని జింజయాంగ్ రీజియన్​లోని ముస్లిం ఉయ్‌ఘుర్ జాతిపై ప్రభుత్వం మారణ హోమానికి పాల్పడుతుందనే ఆరోపణలు ఎందుర్కొంటోంది.

  • Share this:
ఖురాన్ (Quran).. ముస్లింలకు పవిత్రమైన గ్రంథం. ఐతే ఈ ఖురాన్ విషయంలో చైనా (China)లోని ముస్లిం (Muslim)కు యాపిల్ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది.  ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖురాన్ యాప్‌ను చైనాలో తొలగించింది. ఆ దేశ అధికారుల అభ్యర్ధన మేరకు ఖురాన్ యాప్ ను తొలగించినట్టు యాపిల్ (Apple) ప్రకటించింది. ఖురాన్ మజీద్ (Quran majeed app) యాప్ ప్రపంచంలో అన్ని దేశాల్లో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు ఈ యాప్ వాడుతున్నారు. దీనికి దాదాపుగా 1,50,000 రివ్యూలు కూడా వచ్చాయి. అయితే, చట్ట విరుద్దమైన మతాలకు సంబంధించిన కంటెంట్ ప్రచారం చేయడం వల్లే ఈ యాప్​ను తొలగిస్తున్నట్లు యాపిల్​ సంస్థ స్పష్టం చేసింది.అయితే దీనిపై స్పందించాలని బీబీసీ చైనా ప్రభుత్వాన్ని కోరినా వారు ఎలాంటి ప్రకటన చేయలేదు.ఈ యాప్ తొలగించినట్టు ముందుగా యాపిల్ తన సెన్సార్ షిప్ వ్యవస్థ ద్వారా వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ సెన్సార్ షిప్ (Apple censorship)  వెబ్ సైట్.. యాపిల్ స్టోర్ (Apple store) యాప్‌లను పర్యవేక్షిస్తుంది. ఈ యాప్ లో ఉన్న కంటెంటు ప్రకారం, చైనా అధికారుల నుంచి కొన్ని అదనపు పత్రాలు తమకు అందాల్సి ఉందని, అవి అందించకపోవడంతోనే ఖురాన్ మజీద్ యాప్​ను తొలగించినట్లు యాప్​ రూపరకర్తపీడీఎంఎస్ ( PDMS) సంస్థ వెల్లడించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి చైనా సైబర్ స్పేస్ పాలనా సంస్థతో పాటు, సంబంధిత చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.ఈ యాప్​కు ఒక్క చైనాదేశంలోనే పది లక్షల మంది యూజర్లు ఉన్నట్లు కంపెనీ చెప్పింది.

UK MP: ఉగ్రవాదంలో మరో మెట్టు -పట్టపగలు, జనం మధ్యే ఎంపీని పొడిచి చంపేశారు..

మత విద్వేశాలు రెచ్చగొట్టే యాప్స్​పై నిషేధం..

ఇస్లాం మతాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా గుర్తించింది. అయినా చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ముఖ్యంగా చైనాలోని జింజయాంగ్ రీజియన్​లోని ముస్లిం ఉయ్‌ఘుర్ జాతిపై ప్రభుత్వం మారణ హోమానికి పాల్పడుతుందనే ఆరోపణలు ఎందుర్కొంటోంది.ఈ ఏడాది ప్రారంభంలో జింజియాంగ్ రీజియన్​లో ఉఘుర్ ఇమాములను లక్ష్యంగా చేసుకొని చైనా కమ్యూనిస్ట్​ ప్రభుత్వందాడులు చేసిందని బీబీసీ తన నివేదికలో తేలిపింది. మరోవైపు ముస్లింలకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానేచైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు యాపిల్ సంస్థ ఖురాన్ యాప్​ను తొలగించాలని నిర్ణయించింది.ఈ విషయాన్ని ఈఏడాది మొదట్లోనే ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

అమెరికాకు తాలిబన్ల షాక్​.. బుష్​ మార్కెట్​ పేరు.. ముజాహిదీన్​ బజార్​గా మార్పు

కాగా,ప్రస్తుతం యాపిల్సెన్సార్ షిప్ బ్యూరో ఆఫ్ బీజింగ్ గా మారబోతోందని యాపిల్ సెన్సార్ షిప్ ప్రాజెక్టు డైరెక్టర్ బెంజిమిన్ ఇస్మాయిల్ చెప్పారు. సెన్సార్​షిప్​లో అనేక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని.అయితే, దీని ప్రతిస్పందన కూడా చైనా ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని బెంజమన్ ఇస్మాయిల్ గుర్తు చేశారు.ఖురాన్ యాప్ తో పాటు, ప్రఖ్యాత బైబిల్ యాప్ ఆలివ్ ట్రీస్యాప్​నుకూడా ఈ వారం తొలగించామని పీడీఎంఎస్ సంస్థ బీబీసీకి తెలిపింది.
Published by:Shiva Kumar Addula
First published: