Home /News /technology /

APPLE GIVIG CHANCE TO IPHONE 12 IPHONE 12 PRO USERS FOR FREE SEVICE WHO FACING SOUND ISSUE EVK

iPhone: మీరు ఈ మోడ‌ల్ యాపిల్ ఫోన్ వాడుతున్నారా.. అయితే ఉచింగా రిపేర్ చేస్తారు

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఐఫోన్​ 12, ఐఫోన్​ 12ప్రో(iPhone 12, iPhone 12 Pro) ఫోన్లలో సౌండ్​ సమస్యలు వస్తున్నట్లు ఇటీవల పలువురు యూజర్ల ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌ను యాపిల్‌(Apple)​ సంస్థ గుర్తించింది. యూజర్ల స‌మ‌స్య ప‌రిష్కారానికి ఉచిత సర్వీస్(Free Service)​ అందించనున్నట్లు తెలిపింది.

ఇంకా చదవండి ...
    ప్రముఖ మొబైల్​ తయారీ దిగ్గజం యాపిల్‌​ (Apple)​ తమ వినియోగదారుల కోసం కొత్త సర్వీస్ ప్రోగ్రామ్​ను ప్రారంభించింది.  ఐఫోన్​ 12, ఐఫోన్​ 12ప్రో (iPhone 12, iPhone 12 Pro) ఫోన్లలో సౌండ్​ సమస్యలు వస్తున్నట్లు కొంత మంది యూజర్ల నుంచి యాపిల్‌​కు ఫిర్యాదులు అందాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఈ సంస్థ.. యూజర్లకు ఫ్రీ సర్వీస్ (Free Service)​ అందిస్తామని తెలిపింది. అక్టోబర్​ 2020 ఏప్రిల్​ 2021 మధ్య తయారైన ఫోన్లలోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఈ సమస్యను తాము కూడా గుర్తించామని, రిసీవర్​ మోడల్ (Reciver Model)​లోని కాంపోనెంట్స్ పనితీరు విఫలం అవ్వడం వల్ల యాపిల్‌​ ఫోన్లలో సౌండ్​ సంబంధిత సమస్యలు వస్తున్నాయని తెలిపింది.  ఈ సమస్య వచ్చినప్పటికీ యూజర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారికి ఉచితంగా సర్వీసు అందిస్తామని పేర్కొంది.

    వారంటీ వివ‌రాలు తెలుసుకోండి..
    ఈ స‌మ‌స్య కాకుండా ఇత‌ర స‌మ‌స్య‌ల ఉంటే స‌ర్వీస్ సేవ‌ల ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ ఫోన్‌లో స‌మ‌స్య‌తో వ‌చ్చే వారు ముంద‌గా Phone ఇప్పటికీ వారంటీలో ఉందో లేదో తనిఖీ చేయడం ఉత్తమమ‌ని తెలిపింది.

    JP Morgan Jobs: జేపీ మోర్గాన్ హైదరాబాద్ బ్రాంచ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌


    వారంటీ తెలుసుకొనేందుకు వినియోగదారులు ముందుగా సెట్టింగ్‌లు > జనరల్ ? ఎబౌంట్‌ ద్వారా వారంటీ సేవ‌ల కాల ప‌రిమితి తెలుసుకోవ‌చ్చు. ఈ వివ‌రాలు తెలుసుకొన్న త‌రువాత checkcoverage.apple.com కి వెళ్లి, ఫోన్ క్రమ సంఖ్య మరియు ప్రత్యేక కోడ్ వంటి వివరాలను నమోదు చేయ‌డం ద్వారా పూర్తి వివ‌రాలు వ‌స్తాయి.

    గ‌తంలోనూ ఇలాంటి స‌మ‌స్య‌లు..
    ఇంతకు ముందు కూడా యాపిల్‌ ఫోన్లు, ఇతర డివైజెస్​లో ఇలాంటి సమస్యలను గుర్తించినట్లు సంస్థ తెలిపింది. యాపిల్‌​ ఎయిర్‌పాడ్స్ ప్రోలో క్రాక్లింగ్, ఐప్యాడ్ ఎయిర్‌లో ఫౌల్టీ స్క్రీన్​, ఐఫోన్​ 11లో అన్​రెస్పాన్సివ్​ డిస్​ప్లే వంటి సమస్యలను తలెత్తినట్లు చెప్పింది.

    Cyber Security Alert: "జోక‌ర్" మ‌ళ్లీ వ‌చ్చేశాడు జాగ్ర‌త్త.. ఫోన్‌లో ఈ 15 యాప్స్ డెలిట్ చేయండి


    ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు యూజర్లు యాపిల్‌​ సపోర్ట్‌ సెంటర్లను సంప్రదించాలని కోరింది.

    అపాయింట్‌మెంట్‌తో వెళ్తే ఉత్త‌మం..
    యాపిల్‌​ స్టోర్‌ లేదా అధీకృత యాపిల్‌ సర్వీస్ (Apple Service) ప్రొవైడర్ల ద్వారా సమస్యలకు పుల్​స్టాప్​ పెట్టొచ్చని తెలిపింది. అంతేకాదు, మీరు ఉపయోగించే ఐఫోన్లు ఈ రిపేర్​ ప్రోగ్రామ్​కు అర్హత ఉన్నాయో లేదో కూడా ఈ సెంటర్ల ద్వారానే తెలుసుకోవచ్చు. అయితే రిటైల్ సెంటర్లకు వెళ్లేవారు ముందుగా అపాయింట్​మెంట్ తీసుకొని వెళ్లాలని తెలిపింది. యాపిల్‌ అధికారిక సర్వీస్ సెంటర్ల నుంచి ఈ అపాయింట్​మెంట్ (Appointment) పొందవచ్చు. ఈ–మెయిల్ (E-Mail) ద్వారా కూడా యాపిల్‌ సపోర్ట్ సర్వీస్​కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Apple, Apple store, Iphone, Smart phone

    తదుపరి వార్తలు