Apple Find My App: యాపిల్ పైండ్ మై యాప్‌ను ఎవరైనా వాడుకోవచ్చు

Apple Find My App: యాపిల్ పైండ్ మై యాప్‌ను ఎవరైనా వాడుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Apple Find My App | యాపిల్ ఫైండ్ మై యాప్‌ను థర్డ్ పార్టీ సంస్థలు కూడా ఉపయోగించుకునేలా సేవల్ని విస్తరిస్తోంది యాపిల్. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

  • Share this:
కస్టమర్లకు అందిస్తున్న సేవలను విస్తరించేందుకు టెక్ దిగ్గజం యాపిల్ ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుతం యాపిల్ ఎకో సిస్టమ్‌లో ఉన్నవారు.. తాము కోల్పోయిన, దొంగతనానికి గురైన డివైజ్‌లను ఫైండ్ మై యాప్ ద్వారా గుర్తించవచ్చు. ఈ సేవలను యాపిల్ ఇప్పుడు ఇతర కంపెనీలకు కూడా విస్తరిస్తోంది. థర్డ్ పార్టీ కంపెనీలకు కూడా ఈ సేవలను అందించాలని సంస్థ ఇటీవల నిర్ణయించింది. ఈ సేవల కోసం ఫైండ్ మై యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వినియోగదారులు ఫైండ్ మై నెట్‌వర్క్ యాక్ససరీ ప్రోగ్రామ్ ద్వారా థర్డ్ పార్టీ కంపెనీల డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్‌తో పాటు ఇతర కంపెనీ డివైజ్‌ల లొకేషన్‌ను గుర్తించడంతో పాటు ట్రాక్ చేయవచ్చు.

ఫైండ్ మై యాప్ ఎలా పనిచేస్తుంది?


కోల్పోయిన వస్తువులను గుర్తించడానికి యాపిల్ డివైజ్‌ల బ్లూటూత్ సిగ్నల్స్‌ను ఫైండ్ మై యాప్ ఉపయోగిస్తుంది. కస్టమర్ల యాపిల్ డివైజ్‌లు కనిపించకుండా పోయినప్పుడు ఈ వైర్‌లెస్ బ్లూటూత్ సిగ్నల్స్‌ ఆధారంగా అవి ఉన్న ప్రాంతాన్ని గుర్తించవచ్చు. వాటి యజమానులు డివైజ్‌ల లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. ఇది ఒక ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ టెక్నాలజీ అని యాపిల్ చెబుతోంది. ఈ వివరాలను ఇతర డివైజ్‌లు ట్రాక్ చేయలేవు. ఈ డేటాను యజమానులు తప్ప యాపిల్ కంపెనీ కూడా యాక్సెస్ చేసే అవకాశం లేదు. ఒకవేళ కస్టమర్ల యాపిల్ డివైజ్‌లు పోతే.. వేరే యాపిల్ డివైజ్‌లోని ఫైండ్ మై యాప్ మ్యాప్‌లో దాని లొకేషన్ చూడవచ్చు. ఇందుకు ఫైండ్ మై నెట్‌వర్క్‌ సెర్చ్‌లో పోయిన డివైజ్‌ను నమోదు చేయాలి. పోయిన డివైజ్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా ఈ వివరాన్నీ చూడవచ్చు. వేరే వ్యక్తుల చేతికి చిక్కిన డివైజ్‌లోని డేటాను వినియోగదారులు యాప్‌ ద్వారా డిలీట్ చేయవచ్చు. కానీ ఈ డేటాను మళ్లీ పొందే అవకాశం లేదు.

MFine: మీ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఎంత? స్మార్ట్‌ఫోన్‌లో తెలుసుకోండి ఇలా

Flash Sale: రూ.10,499 విలువైన స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే... కాసేపట్లో ఫ్లాష్ సేల్

వేరే కంపెనీలు ఎలా వాడుకుంటాయి?


యాపిల్ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని ఉపయోగించాలనుకునే కంపెనీలు మేడ్ ఫర్ ఐఫోన్ (MFi) ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవాలి. ఫైండ్ మై నెట్ వర్క్‌కు కొత్త లేదా ఇప్పటికే ఉన్న ప్రొడక్ట్‌ను కనెక్ట్ చేయాలనుకునే యాక్ససరీ డెవలపర్ కోసం యాపిల్ MFiని రూపొందించింది. దీన్ని యాక్సెస్ చేసుకునే థర్డ్ పార్టీ కంపెనీలు.. ఫైండ్ మై నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని ప్రైవసీ ప్రొటెక్షన్‌లకు కట్టుబడి ఉండాలని యాపిల్ తెలిపింది.
Published by:Santhosh Kumar S
First published: