Home /News /technology /

APPLE EVENT APPLE IPAD AIR 2020 APPLE WATCH SERIES 6 LAUNCHED ALONGSIDE BUDGET IPAD 8TH GEN SS

Apple Event Highlights: యాపిల్ వాచ్, ఐప్యాడ్ రిలీజ్... ధర ఎంతో తెలుసా?

Apple Event Highlights: యాపిల్ వాచ్, ఐప్యాడ్ రిలీజ్... ధర ఎంతో తెలుసా?
(image: Apple)

Apple Event Highlights: యాపిల్ వాచ్, ఐప్యాడ్ రిలీజ్... ధర ఎంతో తెలుసా? (image: Apple)

Apple Event Highlights | యాపిల్ ఐఫోన్ 12 కోసం ఎదురుచూస్తున్నవారు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. టైమ్ ఫ్లైస్ ఈవెంట్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 6, యాపిల్ వాచ్ ఎస్ఈ, ఐప్యాడ్ ఎయిర్ లాంటి ప్రొడక్స్ లాంఛ్ చేసింది కంపెనీ.

    యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. యాపిల్ వాచ్ సిరీస్ 6 లాంఛైంది. దీంతో పాటు యాపిల్ వాచ్ ఎస్ఈ, ఐప్యాడ్ ఎయిర్ 2020 కూడా రిలీజ్ అయ్యాయి. ఈ ప్రొడక్ట్స్‌తో పాటు సెప్టెంబర్ 16 నుంచి వాచ్ ఓఎస్7, ఐప్యాడ్ ఓఎస్ 14, ఐఓఎస్ 14 సెప్టెంబర్ 16న రిలీజ్ అవుతాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. ఇక వీటితో పాటు యాపిల్ వాచ్‌కు ఫిట్‌నెస్ ప్లస్, యాపిల్ వన్ సబ్‌స్క్రిప్షన్ సర్వీసెస్‌ను ప్రకటించింది యాపిల్.

    యాపివ్ వాచ్ సిరీస్ 6 స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో ఎస్6 చిప్ ఉంది. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్‌ని మానిటర్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, స్లీప్ ట్రాకింగ్, ఆటోమెటిక్ హ్యాండ్ వాషింగ్ డిటెక్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రెగ్యులర్‌గా ఉండే బకల్ స్ట్రాప్‌తో పాటు మరో రెండు వేరియంట్స్ తీసుకొచ్చింది యాపిల్. కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్, మెమొజీ ఫెసెస్ కూడా ఉన్నాయి. ఇందులో ఫ్యామిలీ సెటప్ ఫీచర్ ఉంటుంది. దీంతో యూజర్లు తమ కుటుంబ సభ్యుల దగ్గర ఐఫోన్ లేకపోయినా వాచెస్‌తో కనెక్ట్ కావొచ్చు. పిల్లల కోసం డీఎన్‌డీ మోడ్ కూడా ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 6 జీపీఎస్ వేరియంట్ ధర రూ.40,900 కాగా జీబీఎస్ సెల్యులార్ వేరియంట్ ధర రూ.49,900.

    ఇక యాపిల్ వాచ్ ఎస్ఈలో రెటీనా డిస్‌ప్లే, ఎస్5 డ్యూయెల్ కోర్ ఎస్ఐపీ, ఫాల్ డిటెక్షన్, స్లీప్ ట్రాకర్, హ్యాండ్ వాష్ రిమైండర్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక రన్నింగ్, వాకింగ్, యోగా, సైక్లింగ్, డ్యాన్స్ లాంటి వర్క్ అవుట్ మోడ్స్ కూడా ఉన్నాయి. డిస్టెన్స్, పేస్, ల్యాప్స్, కేలరీస్, హార్ట్ రేట్ లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. యాపిల్ వాచ్ ఎస్ఈ ధర ప్రకటించలేదు. అమెరికాలో మాత్రం 279 డాలర్లు. అంటే సుమారు రూ.20,500.

    ఐప్యాడ్ ఎయిర్ ఫీచర్స్ చూస్తే 10.9 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే ఉంది. ఏ14 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. వెనుక వైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. టచ్ ఐడీ, యాపిల్ పెన్సిల్, మ్యాజిక్ కీబోర్డ్ లాంటివి సపోర్ట్ చేస్తాయి. స్కై బ్లూ, రోజ్ గోల్డ్, గ్రీన్ సిల్వర్, స్పేస్ గ్రే కలర్స్‌లో లభిస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ ధర రూ.44,000. ఐప్లాడ్ 8వ జనరేషన్ ఏ12 బయోనిక్ చిప్‌తో పిచేస్తుంది. టాప్ సెల్లింగ్ విండోస్ ల్యాప్‌టాప్ కన్నా రెండు రెట్లు, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కన్నా మూడు రెట్లు, క్రోమ్ బుక్ కన్నా ఆరు రెట్లు వేగంగా పనిచేస్తుందని యాపిల్ చెబుతోంది. ఐప్యాడ్ 8వ జనరేషన్ ధర రూ.24,000.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Apple, Ios, Ipad, Iphone

    తదుపరి వార్తలు