Apple Electric Vehicle: త్వ‌ర‌లో మార్కెట్‌లోకి ఆపిల్ ఎల‌క్ట్రిక్ వెహికిల్‌!

(ప్రతీకాత్మక చిత్రం)

ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ దిగ్గ‌జం ఎల‌క్ట్రిక్(Electric) వాహ‌నాల త‌యారీ రంగంలోకి ప్ర‌వేశించ‌నుందా.. దీనిపై ప్రముఖ నోబెల్(Nobel) బహుమతి గ్రహీత అకిరా యోషినో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

  • Share this:
    ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ దిగ్గ‌జం ఎల‌క్ట్రిక్(Electric) వాహ‌నాల త‌యారీ రంగంలోకి ప్ర‌వేశించ‌నుందా.. దీనిపై ప్రముఖ నోబెల్(Nobel) బహుమతి గ్రహీత అకిరా యోషినో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాయిట‌ర్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆపిల్(Apple) ఈ ఏడాది చివ‌రి క‌ల్లా ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ రంగంలోకి అడుగు పెట్ట‌నుంద‌ని వెల్ల‌డించారు.
    ప్ర‌స్తుతం అన్ని దిగ్గ‌జ కంపెనీలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ రంగంలోకి అడుగు పెడుతున్నాయి. భ‌విష్య‌త్ అంతా వాటిదే అనే అభిప్రాయాన్ని అన్ని సంస్థ‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఇప్పుడు మనం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లు, నోట్ బుక్(Note book) లలో వాడుతున్న సురక్షితమైన లిథియం-అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు అకిరా యోషినోకి 2019లో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు.

    Aadhar-Epfo Link: ఈపీఎఫ్‌వోకి ఆధార్ లింక్ చేశారా.. సెప్టెంబ‌ర్ 1 ఆఖ‌రు తేదీ




    రాయిట‌ర్‌కు ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత అకిరా యోషినో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2021 ఏడాది చివరి నాటికి ఆపిల్ ఆటోమోటివ్(Auto motive) ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు అని అన్నారు.
    ఆయ‌న ఇంట‌ర్వ్యూ(Interview)లో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. టెక్ దిగ్గజ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలపై పెడుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని సంస్థల కంటే ఆపిల్ ముందు ఉన్నట్లు పేర్కొన్నారు. టైటాన్ అనే ప్రాజెక్ట్(Project) పేరుతో ఆపిల్ ఎలక్ట్రిక్ కారుపై పనిచేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా టెక్ దిగ్గజం హ్యుండాయ్(Hyundai) వంటి అనేక దక్షిణ కొరియా కార్ల తయారీదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే, ఆపిల్ గ్లోబల్(Globel) ఆటోమేకర్లతో సంబంధం ఉన్న చాలా నివేదికలను ఖండించింది. ప్రస్తుతం జాన్ జియాన్ ఆండ్రియా టైటాన్(Titan) అనే ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు, జియాన్ ఆండ్రియా 2018 వరకు గూగుల్ సెర్చ్ కు నాయకత్వం వహించారు. గూగుల్ కూడా త్వరలో సెల్ఫ్ డ్రైవింగ్(Self Driving) ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొని రావొచ్చు అని యోషినో అన్నారు.
    Published by:Sharath Chandra
    First published: