హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Apple Diwali Sale: యాపిల్ స్పెషల్ ఫెస్టివల్ సేల్ షురూ.. ఐఫోన్ 14 సిరీస్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు..

Apple Diwali Sale: యాపిల్ స్పెషల్ ఫెస్టివల్ సేల్ షురూ.. ఐఫోన్ 14 సిరీస్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు..

Apple Diwali Sale: యాపిల్ స్పెషల్ ఫెస్టివల్ సేల్ షురూ.. ఐఫోన్ 14 సిరీస్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు..

Apple Diwali Sale: యాపిల్ స్పెషల్ ఫెస్టివల్ సేల్ షురూ.. ఐఫోన్ 14 సిరీస్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు..

Apple Diwali Sale: టెక్ దిగ్గజం యాపిల్ స్పెషల్ దివాలీ సేల్‌ను ప్రకటించింది. నేటి నుంచి (సెప్టెంబర్ 26) ఇండియన్ కస్టమర్లకు ఈ సేల్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా ఐఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లతో బాటు కొన్ని ఆర్డర్లపై స్పెషల్ గిఫ్ట్స్ కూడా అందించనుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియా (India)లో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అన్ని కంపెనీలు ఆఫర్లతో సందడి చేస్తున్నాయి. అమ్మకాలను పెంచుకునేందుకు స్పెషల్ సేల్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), ఇతర ఈ-కామర్స్ పోర్టళ్లు భారీ ఆఫర్లతో ఎలక్ట్రానిక్స్, వేరబుల్, యాక్సెసరీస్‌ను అందిస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ (Apple) కూడా స్పెషల్ దివాలీ సేల్‌ (Diwali Sale)ను ప్రకటించింది. నేటి నుంచి (సెప్టెంబర్ 26) ఇండియన్ కస్టమర్లకు ఈ సేల్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా ఐఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లతో బాటు కొన్ని ఆర్డర్లపై స్పెషల్ గిఫ్ట్స్ కూడా అందించనుంది.

యాపిల్ కంపెనీ ‘దివాలీ సేల్’ (Apple Diwali Sale) పేరుతో ఇండియాలో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లను అందిస్తోంది. ఈ సందర్భంగా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తక్కువ ధరకే యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్పెషల్ సేల్‌లో రూ. 41,900 కంటే ఎక్కువ ధర ఉన్న అన్ని ఆర్డర్లపై యాపిల్ రూ. 7,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంటే తాజాగా రిలీజ్ అయిన ఐఫోన్ 14 సిరీస్‌ ఫోన్లపై రూ. 7,000 వరకు తగ్గింపు ఉంటుంది. దీంతో ఇప్పుడు యాపిల్ ఐఫోన్ 14ను రూ. 72,900కు, ఐఫోన్ 14 ప్రోను రూ. 1,22,900కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లు‌ లాంచ్ అయినప్పటి నుంచి వీటిపై బెస్ట్ ఆఫర్స్ ఇవేనని చెప్పుకోవచ్చు.

* బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు..

యాపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌లతో ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తే స్పెషల్ డిస్కౌంట్లు వర్తిస్తాయి. కొత్తగా విడుదల చేసిన ఎయిర్‌పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్, ఐఫోన్ 14 సిరీస్, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌లతో సహా అన్ని ప్రొడక్ట్స్‌పై 7% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చని యాపిల్ ఇండియా తెలిపింది. మినిమం ఆర్డర్ వాల్యూ రూ. 41,900 ఉంటేనే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇది సింగిల్, మల్టిపుల్ ఐటెమ్స్‌కు వ్యాలీడ్ అవుతుంది. కంపెనీ ఆరు నెలల వరకు నో కాస్ట్ EMI కూడా అందిస్తుంది. ఈ ఆఫర్లు ప్రస్తుతం యాపిల్ ఇండియా సైట్‌లో లిస్ట్ అయ్యాయి.

ఇది కూడా చదవండి : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోని బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ డీల్స్.. రూ.10 వేలలోపే అదిరిపోయే మొబైల్స్!

* వీటిపై కూడా..

ఐఫోన్ 13పై కూడా యాపిల్ ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం ఐఫోన్ 13 సిరీస్ ప్రారంభ ధర రూ.69,900. అయితే ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ సాయంతో దీని ధరను రూ.62,900కి తగ్గించుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఐఫోన్ 13 మోడళ్లను ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్‌ కూడా తక్కువ ధరకే అందిస్తున్నాయి. ఈ ఫెస్టివల్ సేల్‌లో మ్యాక్‌బుక్స్, ఎయిర్‌పాడ్స్, ఐప్యాడ్స్, ఎయిర్‌ట్యాగ్స్, ఇతర ప్రొడక్ట్స్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Apple iphone, Iphone 14, Tech news

ఉత్తమ కథలు