హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 15: ఐఫోన్ 15 అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐలాండ్ నాచ్‌.. దీని ప్రత్యేకత ఏంటంటే..

iPhone 15: ఐఫోన్ 15 అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐలాండ్ నాచ్‌.. దీని ప్రత్యేకత ఏంటంటే..

iPhone 15: ఐఫోన్ 15 అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐలాండ్ నాచ్‌..

iPhone 15: ఐఫోన్ 15 అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐలాండ్ నాచ్‌..

iPhone 15: ఐఫోన్ 15 సిరీస్‌లో ప్రో మోడల్‌లే కాకుండా అన్ని డివైజ్‌లలో డైనమిక్ ఐలాండ్ ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్ 15, 15 ప్లస్, ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లో ఒకే విధమైన నాచ్‌ ఉండనుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్‌ ఐఫోన్‌లకు ప్రత్యేక క్రేజ్‌ ఉంది. యాపిల్‌ రిలీజ్‌ చేసే లేటెస్ట్‌ సిరీస్‌ గాడ్జెట్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఫీచర్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతేడాది ఐఫోన్‌ 14 సిరీస్‌లో కూడా కంపెనీ కొన్ని కొత్త ఆప్షన్‌లు అందించిన విషయం తెలిసిందే. యాపిల్‌ డైనమిక్ ఐలాండ్(Dynamic Island), కెమెరా ఫీచర్లు, పెద్ద బ్యాటరీతో 14 ప్రో మోడల్‌లను మరింత ఆకర్షణీయంగా మార్చింది. అయితే యాపిల్‌ నుంచి ఈ ఏడాది ఐఫోన్ 15 సిరీస్‌(iPhone 15 Series) రాబోతుంది. ఐఫోన్ 15 సిరీస్‌లో ప్రో మోడల్‌లే కాకుండా అన్ని డివైజ్‌లలో డైనమిక్ ఐలాండ్ ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్ 15, 15 ప్లస్, ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లో ఒకే విధమైన నాచ్‌ ఉండనుంది.

డైనమిక్ ఐలాండ్ అనేది ఐఫోన్ డిస్‌ప్లే పైన కనిపించే స్పెషల్ విండో లాంటిది. అలర్ట్స్, నోటిఫికేషన్స్, యాక్టివిటీస్ వంటి ఫంక్షనాలిటీస్ డిస్‌ప్లే చేస్తుంది. ఎయిర్‌పాడ్‌లు కనెక్ట్ అయినప్పుడు లేదా డివైజ్ ఛార్జ్ చేయడం.. వంటి సమాచారాన్ని అందించడానికి ఈ ఫీచర్‌ను రూపొందించారు.

* ఐఫోన్ 15 సిరీస్ అప్‌డేట్స్..

వనిల్లా ఐఫోన్ 15, 15 ప్లస్‌లు స్టాండర్డ్‌ 60Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ బదులుగా ప్రోమోషన్ డిస్‌ప్లేను పొందే అవకాశం లేదని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ రెండు మోడల్‌లు ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌ను కూడా కోల్పోతాయి. యాపిల్‌ 2023లో కూడా నాన్-ప్రో మోడల్స్‌లో పాత A-సిరీస్ చిప్‌లను ఉపయోగించే ఆలోచనలో ఉంది. బిల్డ్ మెటీరియల్స్‌లో తేడా ఉంటుంది.

ఇది కూడా చదవండి : వాట్సప్ నుంచి కొత్త యాప్... ఇలా డౌన్‌లోడ్ చేయాలి

యాపిల్‌ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫినిషింగ్ కంటే ప్రో మోడళ్ల కోసం టైటానియం ఫ్రేమ్‌ను ఉపయోగించాలని సూచించింది. ఈ మార్పు చేయడం వలన ప్రో మోడల్‌ల పరిమాణం, బరువును ట్రిమ్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రో వేరియంట్‌లలో మ్యూట్ స్విచ్ ఆప్షన్‌ కూడా మారుతుందని భావిస్తున్నారు. ఐఫోన్‌ను సైలెంట్‌ లేదా సౌండ్ మోడ్‌లో పెట్టడానికి కొత్త మెకానిజం అందించే అవకాశాలు ఉన్నాయి.

* USB C ఛార్జింగ్‌ ఆప్షన్‌

యాపిల్‌ ఈ సంవత్సరం ఐఫోన్ 15 సిరీస్‌తో USB C ఛార్జింగ్‌ను కూడా ఇంట్రడ్యూస్‌ చేయనుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి గుడ్‌న్యూస్‌ అని చెప్పవచ్చు. ఐఫోన్‌ వినియోగదారులకు ఛార్జింగ్‌ సమస్యలు తీరిపోనున్నాయి. వినియోగదారులు థర్డ్-పార్టీ ఛార్జర్‌లను ఉపయోగించే అవకాశం కలుగుతుంది. యూనివర్సల్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌లను తీసుకురావాలనే నిబంధనలకు అనుగుణంగా యాపిల్‌ మార్పులు తీసుకొస్తోంది. ఈ వ్యర్థాలను నియంత్రించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. యాపిల్ తన ప్రీమియం ఫోన్‌ల ఛార్జింగ్ స్పీడ్‌ను కూడా పెంచనుంది. ఈ అప్‌గ్రేడ్స్‌తో ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ ధర పెరిగే సూచనలు ఉన్నాయి.

First published:

Tags: Apple, Apple iphone, IPhone 15, Tech news

ఉత్తమ కథలు