Home /News /technology /

APPLE COMPANY SUES EX EMPLOYEE OVER ALLEGED LEAKED TRADE SECRETS SK GH

Apple: కంపెనీ ట్రేడ్ సీక్రెట్స్ దొంగిలించిన మాజీ ఉద్యోగి.. యాపిల్ సంస్థ ఏం చేసిందంటే..

ప్రతీకాాత్మక చిత్రం

ప్రతీకాాత్మక చిత్రం

లాంకస్టర్ ఒక్కడే కాదు గతంలోనూ ఆపిల్ తన మాజీ ఉద్యోగిపై ఇలాంటి ఆరోపణలు చేసింది. 2019లో ఆపిల్ తన మాజీ లీడ్ ఛీఫ్ ఆర్కిటెక్ట్ గెరార్డ్ విలియమ్స్-2 పై కూడా వ్యాజ్యం వేసింది.

ఆపిల్ సంస్థ గురించి తెలియనివారుండరు. ఎందుకంటే బ్రాండెడ్ ఐఫోన్లు విడుదల చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులున్న బహుళ జాతీయ కంపెనీ ఇది. తాజాగా ఈ సంస్థ తన వాణిజ్య రహస్యాలను బహిర్గత పరిచాడని ఓ మాజీ ఉద్యోగిపై కేసు వేసింది. దశాబ్దకాలంగా కంపెనీలో పనిచేసిన ఇతడు సంస్థ సీక్రెట్లు తస్కరించి ఫలితంగా వచ్చిన సొమ్మును తన స్టార్టప్ లో పెట్టుబడి పెట్టాడని ఆరోపించింది.

వివరాల్లోకి వెళ్తే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... సిమ్మన్ లాంకస్టర్ అనే వ్యక్తి ఆపిల్ సంస్థలో పనిచేస్తోన్న సమయంలో విడుదల కానీ హార్డ్ వేర్, ప్రకటించని ఫీచర్లు, భవిష్యత్తులో రానున్న ఉత్పత్తి వివరాలను ఇతరులతో పంచుకున్నాడని ఆ సంస్థ ఆరోపించింది. ఈ మేరకు ఫెడరల్ కోర్టులో కేసు వేసింది. గురువారం నాడు దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం లాంకస్టర్ సమాచారాన్ని దుర్వినియోగం చేసి మోసపూరితంగా ఉత్పత్తుల వివరాలను ఇతరులతో పంచుకొన్నాడని, తమ బృందం మనోధైర్యాన్ని దెబ్బతీశాడని ఆపిల్ సంస్థ తెలిపింది.

లాంకస్టర్ ఒక్కడే కాదు గతంలోనూ ఆపిల్ తన మాజీ ఉద్యోగిపై ఇలాంటి ఆరోపణలు చేసింది. 2019లో ఆపిల్ తన మాజీ లీడ్ ఛీఫ్ ఆర్కిటెక్ట్ గెరార్డ్ విలియమ్స్-2 పై కూడా వ్యాజ్యం వేసింది. ఆపిల్ ఉద్యోగుల సమాచారాన్ని దొంగతనంగా తీసుకున్నాడనే ఆరోపణలతో అతడిపై కేసు దాఖలు చేసింది. వీరిద్దరూ సంస్థలో సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రాజెక్టులో పనిచేశారు. వీరు చైనా ఇంజినీర్లకు ట్రేడ్ సీక్రెట్లు చెప్పినట్లు ఆ సంస్థ ఆరోపించింది. ఈ ఆరోపణలు ఇద్దరూ అంగీకరించలేదు. విచారణ కోసం ఎదురుచూస్తున్నారు. వినియోగదారులను సంతోషపెట్టేందుకు గాను వేల మంది ఉద్యోగులు అవిశ్రాంతంగా పనిచేస్తూ ప్రతిరోజూ కొత్త ఉత్పత్తులు, సేవలపై సమయాన్ని వెచ్చిస్తున్నారని ఆపిల్ ప్రతినిధి జోష్ రోసెన్ స్టాక్ అన్నారు. ఈ విధంగా సమాచారాన్ని తస్కరించడం తమ ప్రయత్నాలు బలహీనపరచడమే కాకుండా, సంస్థతో పాటు కస్టమర్లను మోసం చేసినట్లు అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

లాంకస్టర్ మీడియా వర్గాలతో కలిసి 2018 చివర నుంచి 2019 చివరకు పనిచేశాడని ఆపిల్ సంస్థ పేర్కొంది. నిర్దిష్ట పత్రాలను, ఉత్పత్తుల వివరాలను దొంగిలించి, సమాచార మార్పిడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఇందుకోసం పలువురిని వ్యక్తిగతంగా కలిశాడని తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన కూపెర్టినో ఎవరి కోసం పనిచేస్తుందో ఏ మీడియా వర్గం బయటపెట్టలేదని చెప్పింది.

"2019 ప్రారంభంలో లాంకస్టర్ నూతన హార్డ్ వేర్ ఉత్పత్తి గురించి సమాచారాన్ని చేరవేశాడు" అనే పుకారు ఆధారంగా ఆపిల్ తనపై ఈ ఆరోపణలు చేస్తుందని లాంకస్డర్ తెలిపాడు. ఇది తన స్టార్టప్ కు ఇబ్బంది కలిగిస్తుందని చెప్పాడు. అయితే ఆపిల్ మాత్రం ఇందుకు విరుద్ధంగా చెప్పింది. రెండు వారాలే కిందటే థర్డ్ పార్టీకి తమ సంస్థకు చెందిన వాణిజ్య రహస్యాలను లాంకస్టర్ చేరవేశాడని, ఈ విషయాన్ని ఓ జర్నలిస్టు వార్తకథనంలో ప్రచురించాడని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందని, తమ సంస్థలో లాంకస్టర్ పని చేసిన డివైజ్ లను పరిశీలిస్తున్నట్లు ఆపిల్ పేర్కొంది.

లాంకస్టర్ 2019 అక్టోబరులో రాజీనామా చేసిన తర్వాత అతడు ఐఫోన్ తయారీదారుల అమ్మకందారుల్లో ఒకరి కోసం పనిచేశాడు. బహుశా తస్కరించిన వాణిజ్య సీక్రెట్లను అతడు ఇప్పటికీ ఉపయోగిస్తూ ఉండొచ్చని అనుమానం వ్యక్తి చేస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన బర్కిలీ సంస్థ నవంబరు 2019లో విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం లాంకస్టర్ ఆపిల్ నుంచి అరిస్ కాంపోజిట్స్ కు వెళ్లాడని పేర్కొంది. కస్టమర్స్ ప్రొడక్ట్ అధినేతగా పనిచేశాడని, ఆపిల్ ఉత్పత్తులు, ప్రొటోటైప్ లను సృష్టించే అతడి నేపథ్యాన్ని ఈ ప్రకటన వివరించింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Apple, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు