Tim Cook: భారత విపణిపై ఫోకస్..రెండోసారి రానున్న ఆపిల్ చీఫ్

అవకాశాల స్వర్గమైన భారత విపణిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రత్యేక దృష్టిసారించారు. ఇందు కోసం భారత్‌లో రెండోసారి పర్యటనకు ఆయన రానున్నారు.

news18-telugu
Updated: January 29, 2020, 4:01 PM IST
Tim Cook: భారత విపణిపై ఫోకస్..రెండోసారి రానున్న ఆపిల్ చీఫ్
టిమ్ కుక్ (ఫైల్ ఫొటో)
  • Share this:
భారత‌లో పుష్కలంగా ఉన్న వాణిజ్య అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రత్యేక దృష్టిసారించారు. భారత్‌లో తమ వాణిజ్య కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో త్వరలోనే ఆయన భారత పర్యటనకు రానున్నారు. మొదటిసారిగా 2016లో టిమ్ కుక్ భారత్‌లో పర్యటించారు. ఇప్పుడు రెండోసారి ఆయన భారత పర్యటనకు రానున్నారు. జూన్-జులై మాసాల్లో టిమ్ కుక్ భారత పర్యటన ఉండొచ్చని సమాచారం. ఈసారి కూడా తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారత్‌లో ఆపిల్ వ్యాపార విస్తరణ, పెట్టుబడులపై ప్రధానితో చర్చించే అవకాశముంది.

ఆపిల్ కంపెనీ సొంత ఆన్‌లైన్ స్టోర్లను భారత్‌లో 2019-2020 నాలుగో త్రైమాసం(జనవరి-మార్చి)లో ప్రారంభించాలని ఆ సంస్థ ముందుగా భావించింది. అయితే దీన్ని 2020 మూడో త్రైమాసానికి వాయిదావేశారు. తమ వాణిజ్య విస్తరణ కార్యాకలాపాలు ఆలస్యం అవుతుండడంతో స్వయంగా టిమ్ కుక్ రంగంలోకి దిగి భారత పర్యటనకు వస్తున్నట్లు సమాచారం. తన పర్యటనలో భాగంగా భారత్‌లో ఆపిల్ ఉత్పత్తుల తయారీని పెంచడం, భారత్ నుంచి పొరుగు దేశాలకు ఎగుమతులను పెంచడంపై కూడా ఆయన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

tim cook india visit, apple iphone news, apple news, tim cook gay, tim cook age, టిమ్ కుక్ వయస్సు, టిమ్ కుక్ వయస్సు, ఆపిల్ సంస్థ, ఐఫోన్
ఆపిల్ సీఈవో టిమ్ కుక్ (Image: AP)


ఆపిల్ ఫోన్స్‌ విక్రయాల్లో 30 శాతం మేరకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫాంలపై ఆన్‌లైన్‌‌లో అమ్ముడుపోతున్నాయి. దీంతో ఈ-కామర్స్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలో సొంత ఆన్‌లైన్ రీటైల్ ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేయాలని చేయాలని ఆపిల్ నిర్ణయించింది.  తొలుత ముంబైలో ఆన్‌లైన్ స్టోర్స్ ప్రారంభించే యోచనలో ఉంది. మరో రెండు మూడేళ్లలో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలకు ఈ స్టోర్స్‌ను విస్తరించాలని భావిస్తోంది. ఇందు కోసం దేశంలో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఆపిల్ సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.
Published by: Janardhan V
First published: January 29, 2020, 4:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading