'గే' కావడం దేవుడు ఇచ్చిన వరం: యాపిల్ సీఈఓ టిమ్ కుక్!

ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థకు సీఈఓగా ఉన్న టిమ్ కుక్ 2014 అక్టోబర్ 30న స్వయంగా బయటకు వచ్చి తాను 'గే' అని ప్రకటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అయితే అంతకుముందే టిమ్ కుక్ గే అన్న ప్రచారం ఉండేది.

news18-telugu
Updated: October 26, 2018, 5:17 PM IST
'గే' కావడం దేవుడు ఇచ్చిన వరం: యాపిల్ సీఈఓ టిమ్ కుక్!
ఆపిల్ సీఈవో టిమ్ కుక్ (Image: AP)
  • Share this:
'గే' కావడం దేవుడు ఇచ్చిన వరమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అన్నారు. తాను స్వలింగ సంపర్కుడినని గతంలోనే టిమ్ కుక్ ప్రకటించారు. అప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థకు సీఈఓగా ఉన్న టిమ్ కుక్ 2014 అక్టోబర్ 30న స్వయంగా బయటకు వచ్చి తాను 'గే' అని ప్రకటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అయితే అంతకుముందే టిమ్ కుక్ గే అన్న ప్రచారం ఉండేది. ఆ తర్వాత తనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. "ఆ విషయంలో నేను గర్వంగా ఉన్నాను" అంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్వలింగ సంపర్కుడిగా ఉండటం "నాకు దేవుడు ఇచ్చిన వరం" అని చెప్పారు కుక్.

ప్రతీ ఒక్కర్ని గౌరవించాలన్నది నేను చెప్పే ముఖ్యమైన విషయం. తాము బెదిరింపులు ఎదుర్కొంటున్నామని, ఇంట్లోంచి గెంటేస్తున్నారని, ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందని కొందరు పిల్లలు రాసిన లేఖలు నన్ను కదిలించాయి. అందుకే నేను బయటకు వచ్చి గర్వంగా చెప్పాను. గే అయినా సరే జీవితంలో ఏదైనా సాధించొచ్చని చూపించాలనుకున్నాను.

టిమ్ కుక్, యాపిల్ సీఈఓ


స్వలింగ సంపర్కుడినని ప్రకటించిన తర్వాత తనకు సానుభూతి వచ్చిందని, నాయకుడిగా ఎదిగేందుకు ఆ మద్దతు తోడ్పడిందని కుక్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

#CBIVsCBI: స్నూపింగ్... ఎవరా వేగులు? ఏమిటా కథ?

వాట్సప్‌ స్టిక్కర్స్: ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?క్రెడిట్ కార్డు ఎలా వాడాలి? ఈ టిప్స్ మీకోసమే!

Photos: 2018లో 20% రిటర్న్స్ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఇవే!
Published by: Santhosh Kumar S
First published: October 26, 2018, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading